వెల్దుర్తి పోస్టాఫీస్‌లో చోరీ
వెల్దుర్తి రూరల్ : స్థానిక అనంతయ్య కాంప్లెక్స్‌లోని కొత్త పోస్టాఫీసులో చోరీ జరిగింది. పోస్టల్ అధికారులు సోమవారం పోస్టాఫీసు ప్రారంభించ సంకల్పించారు. ఇందులో భాగంగా చిన్నచిన్న పనులు చేయడానికి ఆదివారం 11గంటల ప్రాంతంలో కార్యాలయం తాళం తీయగా..వస్తువులు చిందరవందరగా పడి ఉండడం గమనించారు. లాకర్ తెరచి ఉండడంతో గమనించిన వెంటనే విషయం పోస్ట్ మాస్టర్ చైతన్యకు సిబ్బంది రాజేష్ తెలిపారు. దాదాపు రూ. 2లక్షల వరకు చోరీ జరిగినట్లు సమాచారం.