velugu employees
-
విశాఖలో వీఏఓల నిరసన జ్వాలలు
-
మనుషులా.. రాబంధులా!
అందరూ ఆడపిల్లలు. తల్లిదండ్రుల మరణంతో అనాథలయ్యారు. ఉండడానికి సరైన గూడు కూడా లేని దయనీయ స్థితిలో ఉన్న ఆడపిల్లల విషయంలో మానవత్వం చూపాల్సిన కొందరు రాబంధుల్లా వ్యవహరించారు. తండ్రి మరణంతో ప్రభుత్వం అందజేసిన బీమా సొమ్మును ఎవరికి వారు వీలైనంత వాటాలు పంచుకున్నారు. అసలే గిరిజనులు. చదువు సంధ్య లేని అమాయకులు. ఆడపిల్లల అమాయకత్వాన్ని, అజ్ఞానాన్ని ఆసరాగా చేసుకుని కొందరు గ్రామ పెద్దలు వేరొకరి బాకీలను, అప్పు ఉన్నాడని డబ్బులు కాజేశారు. సాక్షి, నెల్లూరు(కలువాయి): సాటి మనిషికి కష్టమొస్తే.. అండగా నిలిచి మానవత్వం చూపాల్సిన కొందరు పెద్ద మనుషులు, ప్రభుత్వ ఉద్యోగులు సాయం పేరుతో రాబంధుల కన్నా హీనంగా వ్యవహరించారు. రాబంధులన్నా.. కళేబరాలను మాత్రమే పీక్కుతింటాయి. కానీ మనిషి రూపంలో ఉన్న ఈ రాబంధులు బతికున్న వాళ్లను పీక్కుతింటున్నారు. అనాథలైన ఆడపిల్లలకు తలో చేయ్యేసి మేమున్నామని భరోసా ఇవ్వాల్సిన తరుణంలో వీరు తలో చేయ్యేసి వారి సొమ్మును కాజేసి వాటాలు పంచుకున్నారు. ►మండలంలోని దాచూరు ముక్కుతిప్ప గ్రామంలో ఓ పేద గిరిజన కుటుంబం నివాసం ఉంటోంది. మల్లికా రమణయ్య, లక్ష్మమ్మ దంపతులకు ఐదుగురు సంతానం. అందరూ ఆడబిడ్డలే. ►రమణయ్య చేపల వేటతో ఆ కుటుంబం జీవనం సాగించేది. ఏ పూటకాపూట పని చేస్తేనే కానీ పూట గడవని స్థితి. విధివశాత్తు లక్ష్మమ్మ 13 ఏళ్ల క్రితం మరణించింది. ►అందరూ ఆడపిల్లలు కావడంతో రమణయ్య తాను కాయకష్టం చేసి బిడ్డలను పోషించుకుంటూ వచ్చాడు. అయితే అప్పటికే తన మొదటి ఇద్దరు బిడ్డలు వెంకటరమణమ్మ, అంజలిలకు పెళ్లి చేశాడు. ►ఐదో సంతానం స్వాతి పుట్టుకతో మూగ, మానసిక పరిపక్వత లేకపోయినా ఎంతో అపురూపంగా చూసుకునేవాడు. ►విధి ఆ కుటుంబాన్ని వెంటాడింది. రమణయ్య ఈ ఏడాది మార్చి 21వ తేదీ ఆకస్మికంగా మృతి చెందాడు. ►తల్లి, తండ్రి కాలం చేయడంతో ఆ కుటుంబం వీధిన పడింది. ►ఆయన మృతితో మిగిలిన బిడ్డలు అనాథలుగా మారారు. ప్రస్తుతం వీరు పెదనాన్న హనుమంతు సంరక్షణలో ఉన్నారు. ►హనుమంతు కుటుంబం ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రమే. కూలి పనులు చేసి జీవనం సాగించేవాడు. తనకు భారమైన తమ్ముడి సంతానం బాగోగులు చూస్తున్నాడు. వైఎస్సార్ బీమా సొమ్ములో ఉద్యోగులు, పెద్దలు వాటాలు రమణయ్య మృతితో ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం వైఎస్సార్ బీమా పథకం కింద రూ.2 లక్షలు మంజూరు చేసింది. ఈ మొత్తాన్ని ఆడ పిల్లల బతుకుదెరువుకు అందించాల్సిన వెలుగు ఉద్యోగులు, గ్రామ పెద్దలు కొందరు వాటాలు పంచుకుని, చివరకు కేవలం రూ.45 వేలు మాత్రమే వారికి అందించారు. ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ప్రభుత్వం అందజేసే సాయాన్ని ప్రతి రూపాయి ఆ కుటుంబ ప్రయోజనాలకే ఉపయోగపడాలని, బ్యాంకర్లు, ప్రైవేట్ అప్పుల వాళ్లు తీసుకోకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. అయితే ఇందుకు భిన్నంగా ఇక్కడి ఉద్యోగుల, కొందరు పెద్దలు వ్యవహరించిన తీరు జుగుస్పాకరంగా ఉంది. ►రమణయ్య పేరుతో వేరొక వ్యక్తి బ్యాంక్‌లో తీసుకున్న రుణం బకాయికి కొందరు పెద్దలు రూ. 12 వేలు జమ చేయించారు. ►మరో వ్యక్తి రమణ్య తనకు బాకీ పడ్డాడని తెల్ల కాగితాలు చూపించి మరో రూ.30 వేలు అప్పు కింద జమ చేసుకున్నాడు. ►వెలుగులో పని చేసే వీఓఏ అధికారులకు, ఖర్చులకు అంటూ రూ.10 వేలు తీసుకున్నారు. ►రమణయ్య కూతురు పొదుపు రుణం ఉందని దానికి జమ చేయించేందుకు కొంత పక్కన పెట్టారు. ►అన్నీ పోగా ఆ కుటుంబానికి బీమా సొమ్ములో రూ. 45 వేలు మాత్రమే మిగిలాయి. సమాధానం చెప్పని వెలుగు ఉద్యోగులు మానవత్వాన్ని ప్రశ్నిస్తున్న గిరిజన కుటుంబానికి జరిగిన అన్యాయంపై స్థానిక విలేకరులు వెలుగు ఉద్యోగులను సంప్రదిస్తే సమాధానం చెప్పడానికి కూడా ఇష్టపడడం లేదు. ఒకటికి పది సార్లు ఫోన్ చేసినా కూడా కనీసం లిఫ్ట్ చేయడం లేదు. మరొకరి ద్వారా ఫోన్ చేయిస్తే.. తమకేమీ తెలియదంటూ దాట వేస్తున్నారు. ఈ విషయం బయటకు పొక్కాక హడావుడిగా వీఓఏ తీసుకున్న రూ.10 వేల మాత్రం ఆడపిల్లలకు తెచ్చి ఇచ్చేశారు. నెలనెలా ప్రభుత్వ జీతాలు తీసుకుంటూ ఇలాంటి సాయంలో కక్కుర్తికి పాల్పడుతున్న ఉద్యోగుల తీరుపై స్థానికులు అసహ్యించుకుంటున్నారు. ఈ వ్యవహారంలో వీఓఏను కాపాడేందుకే హడావుడిగా స్వాహా చేసిన సొమ్మును తిరిగి తెచ్చి ఇచ్చారని స్థానికులు అంటున్నారు. -
13 మంది ఉపాధి సిబ్బంది సస్పెన్షన్
సాక్షి, ఎర్రావారిపాళెం: ఉపాధి హామీ పనుల్లో అక్రమాలకు పాల్పడ్డారని గుర్తించి ఎర్రావారిపాళెం మండలానికి చెందిన 13 మంది ఉపాధి హామీ సిబ్బందిని సస్పెండ్ చేస్తూ అడిషనల్ పీడీ శ్రీనివాస్ ప్రసాద్ సోమవారం ఆదేశాలిచ్చారు. మరోవైపు మామిడి చెట్లు లేకుండానే వెలుగు సిబ్బంది బిల్లులు చేసినట్లుగా గుర్తించి పది మందిపై సస్పెన్షన్ వేటు వేశారు. సామాజిక తనిఖీల్లో భాగంగా మండల వ్యాప్తంగా జరిగిన 800 ఉపాధిహామీ పనుల్లో భారీ అవకతవకలు వెలుగుచూశాయి. 2018–19 వార్షిక సంవత్సరానికి రూ.7.5కోట్ల మేర ఎర్రావారిపాళెం మండలంలో ఉపాధి నిధులు ఖర్చుచేశారు. ఈ పనులను తనిఖీ చేయడానికి పది రోజుల నుంచి మండలంలో ఎస్ఆర్పీ వెంకటేష్ నాయక్ సారధ్యంలో 12 మందితో కూడిన 12వ సామాజిక తనిఖీ బృందం పరిశీలించింది. ఈ తనిఖీల్లో భారీ కుంభకోణాలు వెలుగుచూశాయి.ఉపాధిహామీ పథకంలో జరిగిన పలు అక్రమాలు, అవకతవకలను సోమవారం జరిగిన ఆడిట్ ఓపెన్ ఫాంలో బహిర్గతం చేశారు. పనులు లేకుండా బిల్లులు చేయడం, యంత్రాలతో పనులు చేసి కూలీల పేర్లతో బిల్లులు తీసుకున్నట్టు ఆడిట్ బృందం గుర్తించింది. పనుల వద్ద పనికి సంబంధించి వివరాలతో కూడిన బోర్డులు నిర్మించకపోవడం, ఎస్‌డబ్ల్యూపీసీ పనులు అసంపూర్తిగా ఉన్నప్పటికీ బిల్లులు చేసినట్టు కనిపెట్టింది. నిర్దేశిత పనికి మంజూరైన బిల్లులకు మించి అదనంగా బిల్లులు చెల్లించినట్టు నిర్ధారిం చింది. అనేక పనులను యంత్రాలతో చేసినట్లు అధికారులు వెల్లడించారు. పనులకు సంబంధించి గ్రామ సభలు నిర్వహించక పోగా గ్రామ సభ తీర్మానాలు ఒక్క పనికి ఇవ్వనట్లు పేర్కొన్నారు. ఫాం పాండ్లు, ఫీడర్ చానల్, ఫిష్ పాండు, పొలాలకు రోడ్డు పనుల్లో అవకతవకలు బయటపెట్టారు. గతంలో సస్పెండైన వారివే అవకతవకలు గత ఆడిట్లో సస్పెండ్ అయిన ఉపాధి సిబ్బందిని టీడీపీ ప్రభుత్వం మళ్లీ కొనసాగించడంతో అవే తప్పులు మళ్లీ పునరావృతం కావడం విశేషం. గత ఆడిట్లో ఆరుగురు సిబ్బంది సస్పెండ్ అయ్యారు. అయితే ధనార్జనే ధ్యేయంగా పెట్టుకున్న టీడీపీ నాయకులు పంతం పట్టి అదే సిబ్బందిని ఒత్తిడి చేసి విధుల్లో కొనసాగించారు. అప్పట్లో కొనసాగిన ప్రతి ఫీల్డ్ అసిస్టెంట్ మళ్లీ అంతకు మించి తప్పులు చేసి సస్పెన్షన్‌కు గురయ్యారు. ఆరు నెలలు సస్పెన్షన్‌లో ఉన్న బీఎఫ్టీతో చెక్‌డ్యాంలకు ఏపీఓతో పాటు ఈసీలు సంతకాలు చేయించిన విషయాన్ని అడిషనల్ పీడీ గుర్తిం చారు. సస్పెన్షన్‌లో ఉండగా ఎలా సంతకాలు చేస్తారంటూ ఏపీఓను అడిషనల్ పీడీ ఆగ్రహించారు. తమ ప్రమేయం లేదు ఏపీడీ ఆదేశాల మేరకే అనుమతించామంటూ ఏపీఓ బదులిచ్చారు. అలానే రిపోర్ట్ ఇస్తే ఏపీడీని కూడా సస్పెండ్ చేస్తానంటూ సిబ్బంది పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అపరాధం, సస్పెన్షన్ వేటు ఉపాధిహామీ పథకం ద్వారా చేపట్టిన పనుల్లో అక్రమాలకు పాల్పడ్డ సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడింది. కమళ్ల, బోడేవాండ్లపల్లి, నెరబైలు, చెరుకువారిపల్లి, ఉస్తికాయలపెంట, యల్లమంద, వీఆర్ అగ్రహారం, ఉదయమాణిక్యం, కూరపర్తివారిపల్లి పంచాయతీలకు చెందిన ఫీల్డ్ అసిస్టెంట్లు, ఏపీఓ, టీఏ, ఈసీ, బీఎఫ్టీలు మొత్తం 13 మందిని సస్పెండ్ చేశారు. అదేవిధంగా రూ.12.29 లక్షల రికవరీకి ఆదేశించారు. పనుల్లో జరిగిన కొలతలు, బిల్లులు మంజూరులో లోపాలు, తప్పుడు మస్టర్లు, బినామీ మస్టర్లు సృష్టించడం వంటివి తనిఖీల్లో బయటపడ్డాయి. చెరువులో పూడిక తీత పనులు, చెక్‌డ్యాంలో కొలతలు తేడా, చెక్‌డ్యాంలు రాళ్లతో కట్టినట్టు గుర్తించడం, అంగన్వాడీ వర్కర్ల పేర్లతో బిల్లులు చేసినట్లుగా గుర్తించారు. పది మంది వెలుగు సిబ్బందిపై వేటు మండలంలో పలుచోట్ల మామిడి చెట్లు లేకుండానే వెలుగు సిబ్బంది బిల్లులు చేసినట్లుగా గుర్తించారు. దీంతో పదిమందిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలిచ్చారు. మరోవైపు యంత్రాలతో చేసిన పనులకు కూలీల పేర్లతో బిల్లులు తీసుకున్నట్లుగా ఆధారాలను ఆడిట్ బృందం బహిర్గతం చేసింది. చింతగుంట పంచాయతీలో అవకతవకలు జరిగాయంటూ ప్రజలు విన్నవించారు. అక్కడ చేసిన పనులన్నీ పూర్తిస్థాయిలో లేకపోగా పలు పనులను పాత వాటికే బిల్లులు చేశారంటూ అడిషనల్ పీడీకి ఫిర్యాదుచేశారు. చింతగుంటలో రీ ఆడిట్‌కు అడిషనల్ పీడీ శ్రీనివాస్ ప్రసాద్ ఆదేశాలిచ్చారు. ముందే చెప్పిన సాక్షి ఎర్రావారిపాళెం మండల వ్యాప్తంగా ఉపాధి హామీ పనుల్లో పలు అవకతవకలు చోటుచేసుకున్నాయి. దీనిపై సాక్షి దినపత్రిక పలు కథనాలను ప్రచురించింది. ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లు చేతివాటం ప్రదర్శిస్తూ ప్రజాధనాన్ని స్వార్థపరులకు కమీషన్‌కు అమ్మేస్తున్నారంటూ పలు కథనాల్లో పేర్కొంది. సాక్షి చెప్పినట్లే సోమవారం జరిగిన బహిరంగ సభలో కళ్లు చెదిరే వాస్తవాలు వెలుగు చూశాయి. -
వీరు వెలుగు సిబ్బందా.. లేక..
సాక్షి, సీఎస్‌పురం(ప్రకాశం): వెలుగు కార్యాలయ సిబ్బంది పని తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు మంగళవారం వెలుగు కార్యాలయంలో ఎపీఎం రజనీకుమారిని కలిశారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మండలంలోని పొదుపు గ్రూపుల మహిళల చేత వెలుగు సిబ్బంది ప్రత్యేక తీర్మానాలు రాయిస్తున్నారు. ఈ తీర్మానాలు చేయించడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అభ్యంతరం వ్యక్తం జేశారు. టీడీపీ నాయకులు అధికారులను ఉపయోగించుకుని తమ పార్టీ కార్యకర్తల ఓట్లను తొలగిస్తున్నారనీ, ఈ నేపథ్యంలో ఎన్నడూ లేని విదంగా డబ్బుకు ఒత్తిళ్లకు లొంగబోమంటూ మహిళల చేత తీర్మానాలు చేయించడంలో మీ ఉద్దేశమేమిటంటూ వారు ప్రశ్నించారు. అలాగే వెలుగు సిబ్బంది అధికార పార్టీ నాయకులకు కొమ్ముకాస్తూ వారు చెప్పిన వారికే రుణాలు ఇవ్వడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం జేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కొండ్రాజు వెంకటేశ్వర్లు, జిల్లా సంయుక్త కార్యదర్శులు పాలకొల్లు వెంకటేశ్వరరెడ్డి, దుగ్గిరెడ్డి జయరెడ్డి, జిల్లా యూత్ కార్యదర్శి వీరంరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, నాయకులు బత్తుల దేవరాజు, బత్తుల కొండయ్య, మూరం మొరార్జి, లక్ష్మీనర్సయ్య లు పాల్గొన్నారు. -
కదంతొక్కిన వెలుగు ఉద్యోగులు
నెల్లూరు(పొగతోట): నెల్లూరులో వెలుగు ఉద్యోగులు భారీ ర్యాలీతో కదంతొక్కారు. తమను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు కలెక్టరేట్ ఎదుట రిలే నిరాహారదీక్షలు చేస్తున్నారు. గురువారంతో దీక్షలు 9వ రోజుకు చేరుకున్నాయి. ఇప్పటికే రోడ్లు శుభ్రం చేయండం, రక్తదానం, వంటా వార్పు తదితర నిరసన కార్యక్రమాలు చేపట్టారు. గురువారం ఏబీఎం కాంపౌండ్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా దీక్షలు చేస్తున్న వెలుగు ఉద్యోగులకు జిల్లా సమాఖ్య సభ్యులు, స్వయం సహాయక గ్రూపు సభ్యులు, వీఓఏలు, కల్యాణమిత్రలు, బీమామిత్రలు, ఎంఎస్‌సీసీలు, సీసీలు ర్యాలీలో పాల్గొని మద్దతు తెలిపారు. సుమారు రెండు వేలమందితో ర్యాలీ జరిగింది. ధర్నాతో కలెక్టరేట్ ప్రాంగణం దద్దరిల్లింది. ప్రభుత్వానికి, సెర్ప్ సీఈఓకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పట్టించుకోలేదు ఈ సందర్భంగా వెలుగు ఉద్యోగుల సంక్షేమ సంఘం, జేఏసీ నాయకులు మాట్లాడుతూ 18 సంవత్సరాల నుంచి వెట్టిచాకిరి చేస్తున్నామన్నారు. పీజీలు, డబుల్ పీజీలు చేసిన వారు వెలుగులో పనిచేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రెండునాల్కల ధోరణితో వెలుగు ఉద్యోగుల జీవితాలతో ఆటలాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన 2012లో ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని అప్పటి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారన్నారు. 2014 ఎన్నికల సమయంలో టీడీపీ అధికారంలోకి వస్తే రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చారన్నారు. ఈ విషయాన్ని 2014 ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందన్నారు. అధికారంలోకి వచ్చి నాలుగన్నర సంవత్సరాలు గడిచినా ఇంతవరకు తమను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సెర్ప్ సీఈఓ ఒక అధికారిగా వ్యవహరించడం లేదని ఆరోపించారు. సమ్మె విరమించి రండి.. సీఎం వద్దకు తీసుకెళతా అని మభ్యపెడుతున్నారన్నారు. సీఎంతో చర్చించి ఉద్యోగాల రెగ్యులరైజేషన్ విషయాన్ని 2019 ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టేలా చర్యలు తీసుకుంటామని కొందరు మళ్లీ మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఉద్యోగులను రెగ్యులర్ చేసేంత వరకు సమ్మె విరమించేదిలేదని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో వెలుగు ఉద్యోగుల సంక్షేమ సంఘం నాయకులు ఎం.కృష్ణయ్య, సింహాద్రి, మధుసూదనరావు, జనార్దన్, ఆదిశేషయ్య, నవీన్, సృజన, సుజాత, లక్ష్మి, డీడీపీఎంలు, ఏసీలు, ఏపీఎంలు, సీసీలు, ఎంఎస్‌సీసీలు, అకౌంటెంట్స్, జిల్లా సమాఖ్య సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
వెలుగు ఉద్యోగుల సమ్మె
విశాఖపట్నం, పాడేరు: డిమాండ్ల సాధన కోసం ఒక వైపు వెలుగు ఉద్యోగులు సమ్మె బాట పట్టగా, మరో వైపు 132 జీవో రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయులు ఆందోళన ఉధృతం చేస్తున్నారు. ఏపీ వెలుగు ఉద్యోగుల రాష్ట్ర సంఘం పిలుపు మేరకు గురువారం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి డి.కె బాలాజీకి సమ్మె నోటీసు అందజేసి, సమ్మెలోకి వెళ్లారు. ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం సెర్ఫ్‌లో పనిచేస్తున్న వెలుగు హెచ్ఆర్ సిబ్బందికి టైమ్‌స్కేల్ నిర్ణయిస్తూ తక్షణమే వర్తింప చేయాలనే డిమాండ్ చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల కోసం కష్టపడి పనిచేస్తున్నామని, తమ సమస్యల్ని ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని వెలుగు ఉద్యోగులు డిమాండ్ చేశారు. ముఖ్యంగా వెలుగు హెచ్ఆర్ సిబ్బంది అందరికీ టైమ్‌స్కేల్ వర్తింప చేయాలని, 5.11.2018న ఈసీ అప్రూవల్ చేసిన అంశాలను డిసెంబర్ 1నుంచి అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. 132 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల సంఘం, ప్రధానోపాధ్యాయుల సంఘం ఈ నెల 10 నుంచి ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు సిద్ధమవుతున్నాయి. గిరిజన సంక్షేమశాఖలోని ప్రధానోపాధ్యాయుల డ్రాయింగ్ అండ్ డిస్పార్స్‌మెంట్ అధికారాలను ఏటీడబ్ల్యూవోలకు బదలాయిస్తూ ప్రభుత్వం గత ఆగస్టులో ఇచ్చిన 132 జీవోపై ఆది నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయ సంఘాలు, ఇతర ఉద్యోగ సంఘాలన్నీ ఆందోళనలు కొనసాగిస్తున్నాయి. ప్రభుత్వం నుంచి స్పందన కానరాకపోవడంతో ఆందోళన ఉధృతం చేసేందుకు ఉపాధ్యాయ సంఘాలన్నీ ఏకమవుతున్నాయి. ఈ మేరకు అన్ని ఐటీడీఏ ప్రధాన కేంద్రాల్లో నిరవధిక రిలే నిరాహార దీక్షలు నిర్వహించాలని, భాగంగా విశాఖ ఏజెన్సీలోని 11 మండల కేంద్రాల్లో ఈ నెల 10 నుంచి 21వరకు రోజుకొక చోట రిలే నిరాహార దీక్షలు చేపట్టాలని, ర్యాలీలు నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాలు నిర్ణయించాయి. -
హామీ ఇచ్చి మోసం చేశారు..
కర్నూలు(హాస్పిటల్): తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు..గత ఎన్నికల్లో హామీ ఇచ్చి మోసం చేశారని ఏపీ గ్రామీణాభివృద్ధి ఉద్యోగుల సంక్షేమ సంఘం వెలుగు(జేఏసీ)సెర్ఫ్ నాయకులు శ్రీధర్‌రెడ్డి, రహెమాన్, పుల్లయ్య విమర్శించారు. కర్నూలులో వెలుగు ఉద్యోగులు గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. స్థాని క శ్రీ కృష్ణదేవరాయల విగ్రహం నుంచి కలెక్టరేట్ వరకు, అక్కడ నుంచి ధర్నా చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం పలువురు ఉద్యోగులు రిలే నిరాహార దీక్షకు కూర్చున్నారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ఫ్)లో ప్రాజెక్టు మేనేజర్స్, డిస్ట్రిక్ట్ మేనేజర్స్, అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్స్, కమ్యూనిటీ కో ఆర్డినేటర్, సపోర్టింగ్ స్టాప్, ఎంఎస్‌సీసీలుగా జిల్లాలో 384 మంది వెలుగు సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారన్నారు. పదేళ్ల క్రితానికి, ఇప్పటికీ పనిభారం రెట్టింపు అయిందని, జీతం మాత్రం పెరగలేదన్నారు. 2014లో తాడేపల్లి గూడెం ఎన్నికల సభలో వెలుగు ఉద్యోగులను తన మానసపుత్రులని, తాను అధికారంలోకి వస్తే ఉద్యోగాలను తప్పకుండా క్రమబద్ధీకరిస్తానని నారా చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారన్నారు. ఈవిషయాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చేర్చా రని తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హామీని విస్మరించారన్నారు. ఈ కారణంగానే రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లోని 5వేల మందికి పైగా వెలుగు ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లారన్నారు. ఉద్యోగాలు క్రమబద్ధీకరించేంత వరకు సమ్మె విరమించబోయేది లేదని చెప్పారు. జేఏసీ నాయకులు కృష్ణుడు, ఖాదర్, మనోహర్, శేఖర్, ప్రసాద్, రాఘవేంద్ర,రవి పాల్గొన్నారు. -
రోడ్డెక్కిన వెలుగు ఉద్యోగులు
ఒంగోలు టూటౌన్:జిల్లాలోని వెలుగు (సెర్ఫ్) ఉద్యోగులు గురువారం రోడ్డెక్కారు. ప్రగతి భవనం నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్ల కార్డులతో నిరసన వ్యక్తం చేశారు. వెలుగు ఉద్యోగులందరినీ పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఇరవై ఏళ్లుగా నామమాత్రపు వేతనాలతో పనిచేస్తున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. గత ఎన్నికల ప్రచార సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెలుగు ఉద్యోగులకు ఇచ్చిన హామీని ర్యాలీలో మైకుల ద్వారా ప్రజలకు వినిపించారు. చంద్రబాబు వెలుగు ఉద్యోగులకు ఇచ్చిన హామీ వాయిస్‌ను కలెక్టరేట్ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ విన్నారు. తమ న్యాయమైన కోర్కెలు తీర్చాలంటూ బుధవారం సమ్మెబాట పట్టిన వెలుగు (సెర్ఫ్ ) ఉద్యోగులు గురువారం ఉద్యమ తీవ్రతను మరింత పెంచారు. కలెక్టరేట్ సమీపంలోని చర్చి సెంటర్లో మానవహారంగా ఏర్పడ్డారు. నాలుగు వైపులా వాహన రాకపోకలు స్తంభించిపోయాయి. పోలీసులు రంగ ప్రవేశం చేసినా.. తమకు అనుమతి ఉందంటూ నాయకులు ఆగ్రహించారు. తమ డిమాండ్, సమస్యలు చెప్పుకోనివ్వాలంటూ పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి తమకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని నినాదించారు. అనంతరం మీడియాతో వెలుగు జేఏసీ నాయకులు మాట్లాడారు. ఆ తర్వాత కలెక్టరేట్ వద్ద ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా వెలుగు జేఏసీ నాయకుడు నరేంద్రకుమార్ మాట్లాడుతూ సెర్ఫ్‌ను ప్రభుత్వ రంగ సంస్థగా గుర్తించాలని డిమాండ్ చేశారు. వెలుగులో పనిచేసే ఉద్యోగులను పర్మినెంట్ చేయాలన్నారు. టైమ్ స్కేల్ వర్తింపజేయాలని, కారుణ్య నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సెర్ఫ్ ఉద్యోగులకు ప్రమోషన్లు ఇవ్వాలన్నారు. జేఏసీ నాయకులు అంబేడ్కర్, వెంకట్రావు మాట్లాడారు. పెరుగుతున్న ధరల దృష్ట్యా అలవెన్సులు పెంచాలని, హెచ్ఆర్ లేని ఉద్యోగులకు హెచ్ఆర్ వర్తింపచేయాలన్నారు. వైఎస్సార్‌ను గుర్తు చేసుకున్న ఉద్యోగులు తమకు హెచ్ఆర్ పాలసీ అమలు చేయడంతో పాటు 58 ఏళ్ల వరకు ఉద్యోగులను తొలగించేది లేదని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హామీ ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా ఉద్యోగులు గుర్తు చేశారు. ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికల ప్రచారం సమయంలో టీడీపీ అధినేత, నారా చంద్రబాబునాయుడు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే వెలుగు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చారన్నారు. నాలుగున్నరేళ్లు దాటినా నేటికీ తమకు ఇచ్చిన హామీ నెరవేర్చలేదని మండిపడ్డారు. గత్యంతరం లేక సమ్మెబాట పట్టామన్నారు. ప్రభుత్వం దిగొచ్చి తమ సమస్యలు పరిష్కరించే వరకూ దశల వారీ ఆందోళన చేపడతామని నాయకులు హెచ్చరించారు. ధర్నా అనంతరం కలెక్టర్ వినయ్‌చంద్‌కు వినతిపత్రం ఇచ్చారు. జేఏసీ నాయకులతో పాటు వెలుగు ఉద్యోగులు, స్టాఫ్ పాల్గొన్నారు. నేటి నుంచి నిరాహార దీక్షులు వెలుగు ఉద్యోగులు శుక్రవారం నుంచి నిరాహార దీక్షలు చేపట్టనున్నారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకుంటే ఆమరణ నిరాహారదీక్షలకైనా వెనుకాడబోమని సెర్ఫ్ (వెలుగు) ఉద్యోగుల సంఘ నాయకులు హెచ్చరించారు. -
కనీస వేతనం రూ.16 వేలు ఇవ్వాలి
అనంతపురం టౌన్ : గ్రామీణాభివద్ధి శాఖ పరిధిలోని ‘వెలుగు’లో పని చేస్తున్న ఎల్–1, ఎల్–2 ఉద్యోగులకు కనీస వేతనం రూ.16 వేలు ఇవ్వాలని వెలుగు ఉద్యోగుల సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు అశ్వర్థరెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం టీటీడీసీలో జరిగిన ఎల్–1, ఎల్–2, ఎంఎస్ సీసీల యూనియన్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎంఎస్ సీసీలకు రూ.12 వేలు వర్తింపజేయాలన్నారు. ఎఫ్టీఏలకు రూ.5 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. 43 శాతం ఫిట్మెంట్ అమలు చేయాలన్నారు. అనంతరం ఈ సమస్యలపై సెర్ప్ సీఈఓకు వినతిపత్రం అందజేయాలని తీర్మానించారు. కార్యక్రమంలో వెలుగు క్షేత్రస్థాయి ఉద్యోగులు పాల్గొన్నారు.