సాక్షి, సీఎస్‌పురం(ప్రకాశం): వెలుగు కార్యాలయ సిబ్బంది పని తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు మంగళవారం వెలుగు కార్యాలయంలో ఎపీఎం రజనీకుమారిని కలిశారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మండలంలోని పొదుపు గ్రూపుల మహిళల చేత వెలుగు సిబ్బంది ప్రత్యేక తీర్మానాలు రాయిస్తున్నారు. ఈ తీర్మానాలు చేయించడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అభ్యంతరం వ్యక్తం జేశారు. టీడీపీ నాయకులు అధికారులను ఉపయోగించుకుని తమ పార్టీ కార్యకర్తల ఓట్లను తొలగిస్తున్నారనీ, ఈ నేపథ్యంలో ఎన్నడూ లేని విదంగా డబ్బుకు ఒత్తిళ్లకు లొంగబోమంటూ మహిళల చేత తీర్మానాలు చేయించడంలో మీ ఉద్దేశమేమిటంటూ వారు ప్రశ్నించారు.
అలాగే వెలుగు సిబ్బంది అధికార పార్టీ నాయకులకు కొమ్ముకాస్తూ వారు చెప్పిన వారికే రుణాలు ఇవ్వడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం జేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కొండ్రాజు వెంకటేశ్వర్లు, జిల్లా సంయుక్త కార్యదర్శులు పాలకొల్లు వెంకటేశ్వరరెడ్డి, దుగ్గిరెడ్డి జయరెడ్డి, జిల్లా యూత్ కార్యదర్శి వీరంరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, నాయకులు బత్తుల దేవరాజు, బత్తుల కొండయ్య, మూరం మొరార్జి, లక్ష్మీనర్సయ్య లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment