Unofficial program
-
వీరు వెలుగు సిబ్బందా.. లేక..
సాక్షి, సీఎస్‌పురం(ప్రకాశం): వెలుగు కార్యాలయ సిబ్బంది పని తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు మంగళవారం వెలుగు కార్యాలయంలో ఎపీఎం రజనీకుమారిని కలిశారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మండలంలోని పొదుపు గ్రూపుల మహిళల చేత వెలుగు సిబ్బంది ప్రత్యేక తీర్మానాలు రాయిస్తున్నారు. ఈ తీర్మానాలు చేయించడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అభ్యంతరం వ్యక్తం జేశారు. టీడీపీ నాయకులు అధికారులను ఉపయోగించుకుని తమ పార్టీ కార్యకర్తల ఓట్లను తొలగిస్తున్నారనీ, ఈ నేపథ్యంలో ఎన్నడూ లేని విదంగా డబ్బుకు ఒత్తిళ్లకు లొంగబోమంటూ మహిళల చేత తీర్మానాలు చేయించడంలో మీ ఉద్దేశమేమిటంటూ వారు ప్రశ్నించారు. అలాగే వెలుగు సిబ్బంది అధికార పార్టీ నాయకులకు కొమ్ముకాస్తూ వారు చెప్పిన వారికే రుణాలు ఇవ్వడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం జేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కొండ్రాజు వెంకటేశ్వర్లు, జిల్లా సంయుక్త కార్యదర్శులు పాలకొల్లు వెంకటేశ్వరరెడ్డి, దుగ్గిరెడ్డి జయరెడ్డి, జిల్లా యూత్ కార్యదర్శి వీరంరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, నాయకులు బత్తుల దేవరాజు, బత్తుల కొండయ్య, మూరం మొరార్జి, లక్ష్మీనర్సయ్య లు పాల్గొన్నారు. -
ఆ ఇద్దరిది ఆరు వందల కోట్ల టార్గెట్...!
పశ్చిమ గోదావరి జిల్లాలో అధికార పార్టీకి చెందిన ఇద్దరు నేతలు హడలెత్తిస్తున్నారు. వారు ఇప్పుడు దేన్నీ వదలడం లేదు. మరీ చిన్నచిన్న విషయాలను కూడా వదలడం లేదేంటని సన్నిహితులు అడిగినప్పుడు.. ఆరు వందల కోట్ల టార్గెట్ రీచ్ కావాలని బహిరంగంగానే చెప్పేస్తున్నారట. వీరిద్దరూ జిల్లాలో కీలకమైన పదవుల్లో ఉన్నారు. అధికారులపై దాడులకు సైతం వెనుకాడకుండా అందినకాడికి కాజేస్తున్న వారు ఒకరైతే అధికార, అనధికార కార్యక్రమం ఏదైనా సరే శిలాఫలకంపై పేరు లేకపోతే గడ్డపారతో పగులగొడతానని బెదిరిస్తుంటారు ఇంకొక నేత. ఒకాయన 500 కోట్ల టార్గెట్ పెట్టుకుంటే...! మరో నేత వంద కోట్ల టార్గెట్ పెట్టుకున్నారట. టీడీపీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే వీరు సంపాదనలో మునిగిపోయారు. ఇసుక నుంచి అధికారుల బదిలీల వరకు అన్నింటిలోనూ తమ తడాఖా ఏంటో చూపిస్తున్నారు. గడచిన 16 నెలల కాలంలోనే రెండు వందల కోట్లకు తగ్గకుండా ఒకాయన వెనుకేసుకోగా...! రెండో నేత కూడా టార్గెట్‌లో సగం తన ఖాతాలో వేసుకున్నాడు. వీరి అగడాలకు అధికారులు బెంబేలెత్తిపోతున్నారు. ఈ టార్గెట్ గొడవలో తాము బలవుతున్నామని వారంతా మిగతా నాయకులకు మొరపెట్టుకుంటుంటే... అధినేతకు కప్పం కట్టగా మిగిలిన దాంట్లో టార్గెట్ రీచ్ కావడమంటే ఈ గొడవలు తప్పదని ఆ నేతలిద్దరూ నిర్మొహమాటంగా సెలవిస్తున్నారట.!!!