vengalrao park
-
మంత్రి పువ్వాడకు తప్పిన ప్రమాదం
బంజారాహిల్స్: మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. ఆయన కాన్వాయ్ ఒకదానికొకటి ఢీకొని దెబ్బతిన్నాయి. సోమవారం మధ్యాహ్నం బంజారాహిల్స్ రోడ్ నెం 1లోని వెంగళ్రావు పార్కు ముందు ఈ ఘటన చోటు చేసుకుంది. అజయ్‌కుమార్ మధ్యాహ్నం తన కాన్వాయ్‌లో ప్రగతి భవన్ వైపు వెంగళ్రావు పార్కు మీదుగా వెళ్తున్నారు. మంత్రి కూర్చున్న కారు ముందున్న ఎస్కార్ట్ ఓ ద్విచక్ర వాహనం అడ్డురావడంతో సడన్ బ్రేక్ వేశాడు. దీంతో ఎస్కార్ట్ కారును వెనకాల ఉన్న మంత్రి కారు ఢీకొట్టింది. ఆ వెనకాల ఉన్న కాన్వాయ్‌లోని మరో రెండు కార్లు కూడా ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో కార్లన్నీ దెబ్బతిన్నాయి. ఘటన తో మంత్రి షాక్‌కు గురయ్యారు. ఆ వెనకాలనే ఆయనకే చెందిన ప్రైవేట్ వా హనం రావడంతో అజయ్‌కుమార్ అందులోనే ప్రగతిభవన్‌కు వెళ్లారు. ఈ ఘటనపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వెంగళరావు పార్కులో నాయిని, హరీష్‌రావు
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావుతో కలిసి గురువారం ఉదయం వెంగళరావు పార్కును సందర్శించారు. ఈ సందర్భంగా నగరపాలక వాటర్ సప్లై అధికారులతో మాట్లాడారు. పార్కులోని చెరువు పునర్నిర్మాణ పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. చెరువు పనులను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించాలని అధికారులకు ఆదేశించారు.