ఎక్సైజ్ సిఐ ఎర్రచందనం అక్రమ రవాణా
తిరుపతి: ఎర్రచందనంను అక్రమంగా రవాణా చేస్తున్న ఎక్సైజ్ సిఐని ఫారెస్ట్ ఉన్నతాధికారులు పట్టుకున్నారు. ఎర్రచందనంను వెంకటగిరి అటవీ ప్రాంతంలో అక్రమంగా రవాణా చేస్తున్న వాహనాన్ని ఫారెస్ట్ అధికారులు అడ్డుకున్నారు. ఆ వాహనంలో ఉన్నవారు అధికారులతో వాగ్వివాదానికి దిగారు. ఓ అధికారికి చెందిన వాహనం అని చెప్పి వారు వాదనకు దిగారు.
అయితే ఫారెస్ట్ అధికారులు మాత్రం నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఎక్సైజ్ సీఐ సెల్వం కూడా ఉన్నాడు. తమిళనాడు ఎక్సైజ్ శాఖకు చెందిన సెల్వం దగ్గర ఉండి ఎర్రచందనాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నాడు. ఫారెస్ట్ అధికారులు అదుపులోకి తీసుకున్నవారిని విచారిస్తున్నారు.