ఎక్సైజ్ సిఐ ఎర్రచందనం అక్రమ రవాణా | Excise CI Sandlewood smuggling | Sakshi
Sakshi News home page

ఎక్సైజ్ సిఐ ఎర్రచందనం అక్రమ రవాణా

Published Sun, Dec 1 2013 6:59 PM | Last Updated on Thu, Jul 11 2019 8:43 PM

Excise CI Sandlewood smuggling

తిరుపతి: ఎర్రచందనంను  అక్రమంగా రవాణా చేస్తున్న ఎక్సైజ్ సిఐని ఫారెస్ట్ ఉన్నతాధికారులు పట్టుకున్నారు. ఎర్రచందనంను  వెంకటగిరి అటవీ ప్రాంతంలో అక్రమంగా రవాణా చేస్తున్న వాహనాన్ని ఫారెస్ట్ అధికారులు అడ్డుకున్నారు. ఆ వాహనంలో ఉన్నవారు అధికారులతో వాగ్వివాదానికి దిగారు. ఓ అధికారికి చెందిన వాహనం అని చెప్పి వారు వాదనకు దిగారు.

అయితే ఫారెస్ట్ అధికారులు మాత్రం నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఎక్సైజ్ సీఐ సెల్వం కూడా ఉన్నాడు. తమిళనాడు ఎక్సైజ్ శాఖకు చెందిన సెల్వం దగ్గర ఉండి ఎర్రచందనాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నాడు.  ఫారెస్ట్ అధికారులు అదుపులోకి తీసుకున్నవారిని విచారిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement