Venkatanarayana
-
న్యాయపోరాట యోధుడు.. రూ.5,003 కోసం.. 42 ఏళ్లుగా పోరాటం!
సాక్షి, అమరావతి : ప్రభుత్వం నుంచి పరిహారంగా తనకు దక్కాల్సిన రూ.5003 కోసం ఏకంగా 42 ఏళ్ల పాటు ప్రభుత్వంతో పోరాటం చేశాడు. ఈ పోరాటంలో 15 ఏళ్ల పాటు హైకోర్టులో న్యాయ పోరాటం చేశాడు. చివరకు జీవిత చరమాంకంలో తన పోరాటంలో విజయం సాధించాడు. 81 ఏళ్ల వయస్సులో మంచంపై ఉండి కూడా ఆయన చేసిన న్యాయ పోరాటానికి ఫలితం దక్కింది. పరిహారాన్ని వడ్డీతో సహా చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఒక సామాన్య రైతుకు చిన్న మొత్తం పరిహారంగా చెల్లించే విషయంలో జరిగిన ఈ అసాధారణ జాప్యాన్ని ధర్మాసనం తీవ్రంగా ఆక్షేపించింది.పరిహారం కోరడం పౌరుల రాజ్యాంగ హక్కు ‘వెంకటనారాయణేమీ ధనికుడు కాదు. విద్యావంతుడూ కానందున తన హక్కుల కోసం పోరాటం చేసేందుకు సరైన న్యాయ సలహాలు పొందలేకపోయారు. నష్టపోయిన ఆస్తికి పరిహారం పొందకుండా వెంకటనారాయణ వంటి వారిని కోర్టులు అడ్డుకోలేవు. నాలుగు దశాబ్దాలకు పైగా పరిహారం చెల్లించకపోవడాన్ని ఏ రకంగానూ మేం మన్నించజాలం. చట్ట నిబంధనల అమల్లో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. వెంకటనారాయణ వయస్సు ఇప్పుడు 81 ఏళ్లు. వయోభారం వల్ల మంచం మీద ఉన్నారు. అతనికి ఎంతో మద్దతు అవసరం. వెంకటనారాయణ హక్కుల విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం ఈ న్యాయస్థానం మనస్సాక్షిని షాక్‌కు గురిచేస్తోంది. తన జీవనాధారాన్ని తీసుకోవడం వల్ల వెంకటనారాయణ వంటి సామాన్య రైతు అనుభవించిన వేదనను ఈ కోర్టు పరిగణనలోకి తీసుకుంటోంది. అయితే నష్టాన్ని కేవలం డబ్బుతోనే పూడ్చలేం. అయినప్పటికీ చట్ట ప్రకారం మేం ఆ పని చేయదలుచుకున్నాం. భూమి కోల్పోయిన యజమానికి పరిహారం చెల్లించకుండా భూమిని తీసుకోవడానికి వీల్లేదు. నష్టపోయిన ఆస్తికి పరిహారం కోరడమన్నది పౌరుల రాజ్యాంగ హక్కు. ప్రస్తుత కేసు వంటి అసాధారణ కేసుల్లో న్యాయస్థానాలు అధికరణ 226 కింద తన అధికార పరిధిని ఉపయోగించడం తప్పనిసరి. వెంకటనారాయణ ఓ చిన్న రైతు. రాష్ట్ర ప్రభుత్వం అతనికున్న చిన్నపాటి భూమిని తీసేసుకోవడమే గాక.. 42 ఏళ్లుగా ఆ భూమికి పైసా కూడా పరిహారం చెల్లించలేదు.’ అంటూ ప్రభుత్వం తీరును ధర్మాసనం తీవ్రంగా ఆక్షేపించింది. ‘పాత భూ సేకరణ చట్టంలో ఉన్న లొసుగుల కారణంగానే కేంద్రం 2013లో కొత్త భూ సేకరణ చట్టాన్ని తెచ్చింది. తద్వారా వెంకటనారాయణ వంటి వారికి పునరావాసం కల్పించేందుకు అవకాశం కల్పించడం వీలవుతోంది. ప్రస్తుత కేసులో వెంకటనారాయణ పట్ల అధికారుల వ్యవహరించిన తీరు దురదృష్టకరం. అది విస్మయకర నిర్లక్ష్యం. ప్రస్తుతం ఉన్న మార్కెట్ విలువను పరిగణనలోకి తీసుకుని దానికి అనుగుణంగా పరిహారాన్ని నిర్ణయించి దానిని నాలుగు నెలల్లో ఆయనకు చెల్లించాలని అధికారులను ఆదేశిస్తున్నాం. ఈ లోపు 1982 ఫిబ్రవరి 16 నుంచి ఈ రోజు వరకు వెంకట నారాయణకు చెల్లించాల్సిన రూ.5003 పరిహారాన్ని 9 శాతం వార్షిక వడ్డీతో కలిపి మూడు వారాల్లో చెల్లించాలని కూడా ఆదేశిస్తున్నాం. ఈ రూ.5003, వడ్డీ మొత్తాన్ని మార్కెట్ ధర ప్రకారం అంతిమంగా చెల్లించే పరిహారంలో సర్దుబాటు చేసుకోవాలి. ఇందుకు విరుద్ధంగా ఏం చేసినా కూడా దానిని కోర్టు ఆదేశాల ఉల్లంఘన కింద భావిస్తాం’ అంటూ న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్‌రావు, జస్టిస్ నూనేపల్లి హరినాథ్‌ల ధర్మాసనం తీర్పు వెలువరించింది. 2009 నుంచి న్యాయ పోరాటంకృష్ణా జిల్లా కలిదిండి మండలం తాడినాడకు చెందిన ఓలేటి వెంకటనారాయణకు ఆ గ్రామంలోని సర్వే నంబర్ 694/2ఏ2లో 0.87 సెంట్ల భూమి ఉంది. ఈ భూమితో పాటు మరికొందరికి చెందిన మొత్తం 44.43 ఎకరాల భూమిని 1977లో అధికారులు భూ సేకరణ చట్టం 1894 కింద సేకరించారు. 1982లో అధికారులు ఆ భూమిని స్వాధీనం చేసుకున్నారు. వెంకటనారాయణకు తప్ప మిగిలిన వారందరూ కూడా కోర్టుకెళ్లి ఎకరాకు రూ.5002.50 పరిహారంగా చెల్లించేలా ఉత్తర్వులు తెచ్చుకున్నారు. ఈ విషయం తెలిసిన వెంకటనారాయణ మిగిలిన వారికి ఇచ్చినట్టుగా తనకూ పరిహారం ఇవ్వాలంటూ 1997లో అధికారులను కోరారు. ఆ అభ్యర్థనను అధికారులు పట్టించుకోలేదు. దీంతో వెంకటనారాయణ 2009లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం పెండింగ్‌లో ఉండగానే 2013లో కేంద్ర ప్రభుత్వం కొత్త భూసేకరణ చట్టాన్ని తెచ్చింది. వెంకటనారాయణ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ జడ్జి 2023లో తీర్పునిస్తూ సేకరించిన భూమికి గాను ఆయనకు ఎకరాకు రూ.5003 చొప్పున 6 శాతం వార్షిక వడ్డీతో పరిహారం చెల్లించాలని అధికారులను ఆదేశించారు. 2013 భూ సేకరణ చట్టం కింద పరిహారం ఇవ్వాలని చెప్పలేదు. ధర్మాసనం ఎదుట అప్పీల్సింగిల్ జడ్జి తీర్పును సవాలు చేస్తూ వెంకటనారాయణ ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఎదుట 2024లో అప్పీల్ దాఖలు చేశారు. ఈ అప్పీల్‌పై న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందర్రావు, జస్టిస్ నూనేపల్లి హరినాథ్ ధర్మాసనం ఇటీవల విచారణ జరిపింది. వెంకటనారాయణ తరఫు న్యాయవాది ఏవీ శివయ్య వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్‌కు చట్ట ప్రకారం పరిహారం చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. మిగిలిన వ్యక్తుల నుంచి సేకరించిన భూమికి పెంచిన మేర పరిహారం చెల్లించిన అధికారులు.. పిటిషనర్‌కు మాత్రం ఇప్పటి వరకూ చెల్లించకపోవడం దారుణమన్నారు. ఈ వాదనలతో ప్రభుత్వం విభేదించింది. వెంకటనారాయణ భూమిని 1982లోనే స్వాధీనం చేసుకున్నామని.. అందువల్ల ఆయనకు కొత్త భూ సేకరణ చట్టం వర్తించదంది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం రెండు రోజుల కిందట తీర్పునిచ్చింది. -
నెలాఖరులో సబ్‌స్టేషన్ ఆపరేటర్ల నోటిఫికేషన్
ఓవర్‌లోడ్ ఉంటే అదనపు ట్రాన్స్ఫార్మర్లు రైతులెవరూ కొత్తవాటికి డబ్బులివ్వొద్దు ఎన్పీడీసీఎల్ సీఎండీ వెంకటనారాయణ రఘునాథపల్లి : ఐదు జిల్లాల్లో ఖాళీగా ఉన్న సబ్‌స్టేషన్ ఆపరేటర్ల పోస్టులకు నెలాఖరులో నోటిఫికేషన్ వేస్తామని ఎన్పీడీసీఎల్ సీఎండీ కె.వెంకటనారాయణ తెలిపారు. శుక్రవారం మండలంలోని కోమళ్ల సబ్‌స్టేషన్‌లో ఆయన సతీమణితో కలిసి హరితహారంలో మొక్కలు నాటా రు. ఈసందర్బంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఖాళీగా ఉన్న 150 ఆపరేటర్ల నియామకాల్లో పూర్తి పారదర్శత పాటిస్తామన్నారు. దళారుల మాటలు నమ్మి ఎవరూ మోసపోవద్దన్నారు. రైతు సోదరులు ట్రాన్స్ఫార్మర్ల వద్ద మరమ్మతులు చేయవద్దని వ్యవసాయ బావుల వద్ద ఏదైనా సమస్య ఉంటే నేరుగా విద్యుత్ అధికారులకు, సిబ్బం దిని సంప్రదించాలి. నిధులకు డోకా లేదని ఓవర్‌లోడ్ ఉంటే వెంటనే అదనపు ట్రాన్స్ఫార్మర్లు బిగిస్తామన్నారు. కొత్త వాటికి, లైన్లకు రైతులెవరూ డబ్బులు ఇవ్వొద్దని సూచించా రు.ఎలాంటి అంతరాయాలు లేకుండా విద్యు త్ అందించాలని నిర్లక్ష్యం వహిస్తే చర్యలు ఉంటాయని సిబ్బందిని హెచ్చరించారు. వన సంపదతోనే వర్షాలు వర్షాలు కురవాలంటే వన సంపద కావాలని అందుకే అందరూ మొక్కలు నాటాలని సీఎం డీ పేర్కొన్నారు. తమ పరిధిలో గత ఏడాది 97 వేల మొక్కలు నాటామని ఈ ఏడాది లక్షా పది వేల మొక్కలు నాటే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇప్పటికే 62 వేలు నాటినట్లు చెప్పారు. కార్యక్రమంలో డీఈ వై.రాం బా బు, ఏడీఈ బి.రవి, ఏఈలు శంకరయ్య, నటరాజ్, కనుకయ్య, రవికుమార్, మధు, నరేందర్‌రెడ్డి, బాలు, శ్రీధర్‌రెడ్డి, స్వామిదాసు, రాజేందర్, వీరయ్య, సాయిబాబా, ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు. -
పెళ్లయిన 45 రోజులకే..
యువతి అనుమానాస్పద మృతి భర్తే హత్య చేశాడంటున్న బంధువులు పోలీసుల అదుపులో మృతురాలి భర్త జగ్గయ్యపేట : తల్లి ప్రేమకు నోచుకోకున్నా అల్లారుముద్దుగా పెంచుకున్న ఒక్కగానొక్క కుమార్తెకు ఆ తండ్రి ఘనంగా వివాహం చేశాడు. కుమార్తె జీవితం బావుంటుందని రాజధాని ప్రాంతంలో అరెకరం పొలం లాంఛనంగా ఇచ్చాడు. అయితే పెళ్లయిన 45 రోజులకే ఆమె అనుమానాస్పద స్థితిలో మృతిచెందడంతో కన్నతండ్రి భోరున విలపించాడు. ఈ ఘటన బుధవారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం మేరకు.... పెనుగంచిప్రోలు గ్రామానికి చెందిన జిడుగు వెంకట నారాయణకు గుంటూరు జిల్లా పెద్దకూరపాడు మండలం తాళ్లూరు గ్రామానికి చెందిన మునగోటి రాణి (18)తో 45 రోజుల క్రితం వివాహమైంది. నూతన దంపతులు బుధవారం ఉదయం నల్గొండ జిల్లా మేళ్లచెరువు గ్రామంలోని బంధువుల ఇంటికి ద్విచక్రవాహనంపై వెళ్లారు. రాత్రి సమయంలో తిరిగి పెనుగంచిప్రోలు బయలుదేరారు. అయితే జగ్గయ్యపేట బైపాస్ రోడ్డులో తన ద్విచక్ర వాహనం ప్రమాదానికి గురై రాణి గాయపడిందంటూ ఆమెను తన స్నేహితుడి సాయంతో వెంకటనారాయణ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లాడు. ఆమె అప్పటికే మృతి చెందిందని వైద్యులు చెప్పడంతో రెండు వైపుల బంధువులకు వెంకటనారాయణే సమాచారం ఇచ్చాడు. రాణి తండ్రి మునగోటి ప్రసాద్, పెదనాన్న దేవరకొండ బ్రహ్మం హుటాహుటిన ఆస్పత్రికి వచ్చి నిర్జీవంగా పడివున్న రాణిని చూసి భోరున విలపించారు. ఆమె మెడపై ఉరివేసినట్టు కమిలిన గుర్తు ఉండటంతో భర్తే హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరిస్తున్నాడంటూ రాణి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ వై.వి.ఎల్.రావు, అదనపు ఎస్ఐ వి.వి.రావు ఆస్పత్రికి వచ్చి మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదుచేసి విచారణ చేపట్టారు. నందిగామ డీఎస్పీ ఉమా మహేశ్వరరావు గురువారం ఉదయం రాణి మృతదేహాన్ని పరిశీలించి బంధువులను అడిగి ఈ ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. భర్తే హత్య చేశాడు.. ఒక్కగానొక్క కూతురువి.. తల్లి లేకపోయినప్పటికీ అల్లారుముద్దుగా పెంచుకున్నా.. సంసారం బావుంటుందని బంధువుకే ఇచ్చి పెళ్లిచేస్తే కాళ్ల పారాణి ఆరక ముందే నిండు నూరేళ్లు నిండిపోయాయా తల్లీ అంటూ రాణి తండ్రి కన్నీరుమున్నీరుగా విలపించారు. తన కుమార్తెను భర్తే హత్య చేశాడని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాణి భర్త వెంకట నారాయణ పోలీసుల అదుపులో ఉన్నాడు. భార్య మృతికి తానే కారణమని పోలీసుల ముందు ఒప్పుకున్నాడని సమాచారం.