నెలాఖరులో సబ్‌స్టేషన్ ఆపరేటర్ల నోటిఫికేషన్
ఓవర్‌లోడ్ ఉంటే అదనపు ట్రాన్స్‌ఫార్మర్లు
రైతులెవరూ కొత్తవాటికి డబ్బులివ్వొద్దు
ఎన్పీడీసీఎల్ సీఎండీ వెంకటనారాయణ
రఘునాథపల్లి : ఐదు జిల్లాల్లో ఖాళీగా ఉన్న సబ్‌స్టేషన్ ఆపరేటర్ల పోస్టులకు నెలాఖరులో నోటిఫికేషన్ వేస్తామని ఎన్పీడీసీఎల్ సీఎండీ కె.వెంకటనారాయణ తెలిపారు. శుక్రవారం మండలంలోని కోమళ్ల సబ్‌స్టేషన్‌లో ఆయన సతీమణితో కలిసి హరితహారంలో మొక్కలు నాటా రు. ఈసందర్బంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఖాళీగా ఉన్న 150 ఆపరేటర్ల నియామకాల్లో పూర్తి పారదర్శత పాటిస్తామన్నారు. దళారుల మాటలు నమ్మి ఎవరూ మోసపోవద్దన్నారు. రైతు సోదరులు ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద మరమ్మతులు చేయవద్దని వ్యవసాయ బావుల వద్ద ఏదైనా సమస్య ఉంటే నేరుగా విద్యుత్ అధికారులకు, సిబ్బం దిని సంప్రదించాలి. నిధులకు డోకా లేదని ఓవర్‌లోడ్ ఉంటే వెంటనే అదనపు ట్రాన్స్‌ఫార్మర్లు బిగిస్తామన్నారు. కొత్త వాటికి, లైన్లకు రైతులెవరూ డబ్బులు ఇవ్వొద్దని సూచించా రు.ఎలాంటి అంతరాయాలు లేకుండా విద్యు త్ అందించాలని నిర్లక్ష్యం వహిస్తే చర్యలు ఉంటాయని సిబ్బందిని హెచ్చరించారు.
వన సంపదతోనే వర్షాలు
వర్షాలు కురవాలంటే వన సంపద కావాలని అందుకే అందరూ మొక్కలు నాటాలని సీఎం డీ పేర్కొన్నారు. తమ పరిధిలో గత ఏడాది 97 వేల మొక్కలు నాటామని ఈ ఏడాది లక్షా పది వేల మొక్కలు నాటే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇప్పటికే 62 వేలు నాటినట్లు చెప్పారు. కార్యక్రమంలో డీఈ వై.రాం బా బు, ఏడీఈ బి.రవి, ఏఈలు శంకరయ్య, నటరాజ్, కనుకయ్య, రవికుమార్, మధు, నరేందర్‌రెడ్డి, బాలు, శ్రీధర్‌రెడ్డి, స్వామిదాసు, రాజేందర్, వీరయ్య, సాయిబాబా, ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.