venkataprasad
-
ఆ ఫార్చూనర్ కందికుంటదే!
అనంతపురం: శ్రీ సత్యసాయి జిల్లా కదిరి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్‌ను రూ.2 కోట్ల వ్యవహారం ఇరకాటంలో పడేసింది. అనంతపురం నుంచి కదిరికి ఆయన కారులో తరలిస్తున్న సుమారు రూ.2 కోట్లను మంగళవారం పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే. అభ్యర్థి కారులోనే నగదును తరలిస్తుండటం చర్చనీయాంశమైంది. ఎన్నికల్లో తనకు అనుకూలమైన వాతావరణం లేకపోవడంతో కందికుంట ప్రలోభాలకు తెరతీశారు.డబ్బు ఎరవేసి ఓట్లు దండుకోవాలని పన్నాగం పన్నారు. ఈ క్రమంలోనే అనంతపురం నుంచి కదిరికి డబ్బు తరలిస్తుండగా..పోలీసు తనిఖీల్లో పట్టుబడింది. నగదు తరలింపు వ్యవహారాన్ని ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించినట్లు తెలుస్తోంది. నగదు లభించిన ఏపీ 39 ఆర్క్యూ 0999 నంబరు ఫార్చూనర్ కారు కందికుంట ప్రసాద్ పేరుతోనే రిజిస్టర్ అయింది. దీంతో ఎన్నికల సంఘం కందికుంటకు నోటీసులు ఇవ్వడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. అనంతపురం పోలీసులు ఆయనకు నోటీసులు ఇవ్వనున్నారు. నగదు తరలించడానికి కారణాలేమిటి? తదితర అంశాలను ప్రస్తావిస్తూ కందికుంటకు నోటీసులు జారీచేసి వివరణ తీసుకోనున్నారు. బెంగళూరు ఎయిర్‌పోర్టు నుంచి అనంతపురానికి కందికుంట వాహనంలోనే రాంబాబు రాక డబ్బు తరలింపు వ్యవహారంలో హైదరాబాద్‌కు చెందిన కందికుంట ప్రధాన అనుచరుడు రాంబాబు కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. కందికుంట ఫార్చూనర్ కారు సోమవారం కదిరి నుంచి బెంగళూరు ఎయిర్‌పోర్టుకు వెళ్లి.. అక్కడ రాంబాబును ఎక్కించుకుని అనంతపురం వచ్చింది. రాంబాబు సోమవారం రాత్రి నగరంలోని ఓ త్రీస్టార్ హోటల్లో బసచేశారు. మంగళవారం ఉదయం రాంబాబును అదే ఫార్చునర్ కారులో తీసుకెళ్లి రాంనగర్లో వదలి పెట్టారు. తర్వాత కందికుంట వాహన డ్రైవర్ ఆనంద్‌కుమార్ రాంనగర్‌లోని ఒక ఇంటికి వెళ్లి, అప్పటికే బ్యాగుల్లో ఉంచిన నగదును కారులో పెట్టుకున్నాడు. ముందు ఒక కారు (పైలట్ వాహనం), వెనుక కందికుంట ఫార్చునర్ కారు వెళ్లేలా ప్రణాళిక రచించుకున్నారు. అనంతపురంలోని విద్యుత్‌నగర్ సర్కిల్‌కు వెళ్లాక ముందు ఉన్న కారులో పోలీసులు తనిఖీ చేశారు. వెనుక ఉన్న కందికుంట కారు డ్రైవర్ పోలీసులను చూసి భయపడి కారులో ఉన్న నగదు బ్యాగులు పోలీసులకు అప్పగించాడు. దీంతో పోలీసులు ఆ కారు రిజి్రస్టేషన్ వివరాలు పరిశీలించగా అది కందికుంటదని తేలింది. అప్పటికే ముందున్న కారులోని వ్యక్తులు వేగంగా వెళ్లిపోయారు. ఆ కారులో వెళ్లింది ఎవరన్న అంశంపై పోలీసులు దృష్టి సారించారు. ఈ నగదు తరలింపు వ్యవహారంలో కందికుంట అనుచరుడు రాంబాబుతో పాటు మరోవ్యక్తి ఉన్నట్లు తెలుస్తోంది.ఆదాయపన్ను అధికారుల విచారణ ప్రారంభం పోలీసుల తనిఖీల్లో రూ.10 లక్షల కంటే ఎక్కువగా నగదు పట్టుబడితే ఆదాయపన్ను విభాగానికి సమాచారం అందించాల్సి ఉంటుంది. దీంతో పోలీసులు దాదాపు రూ.2 కోట్ల నగదు పట్టుబడిన విషయాన్ని ఆదాయపన్ను శాఖకు తెలిపారు. ఆ శాఖ అధికారులు కూడా విచారణ ప్రారంభించారు. నగదుకు సంబంధించిన లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. వారి విచారణ పూర్తయిన తరువాత చట్టపరంగా చర్యలు తీసుకోనున్నారు. ఏది ఏమైనా కందికుంట వెంకటప్రసాద్ చుట్టూ రూ.2 కోట్ల ఉచ్చు బిగుస్తోందని విశ్లేషకులు అంటున్నారు. కందికుంటకు అసలే నియోజకవర్గంలో ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. ఈ క్రమంలో ఆయన కారులోనే డబ్బు పట్టుబడింది. దీంతో ఆయన ఎన్నికల సంఘంతో పాటు పోలీసులు, ఆదాయపన్ను అధికారులకు సమాధానం చెప్పాల్సి ఉంది. ఈ పరిణామాలతో కందికుంట ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు సొంత టీడీపీ వారు చెబుతున్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడి మృతి
తగరపువలస(విశాఖ), విజయనగరం కల్చరల్, న్యూస్‌లైన్: జాతీయ రహదారి 43పై ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఉపాధ్యాయుడు అక్కడికక్కడే చనిపోయాడు. విజయనగరం నట రాజు కాలనీకి చెందిన బులుసు సూర్యవెంకటప్రసాద్ (45) గజపతినగరంలో ఉపాధ్యాయునిగా వి ధులు నిర్వహిస్తున్నారు. విశాఖ నగరంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ చదువుతున్న కొడుకు వద్దకు కారులో బయలుదేరారు. బోడమెట్టపాలెం వద్దకు వచ్చేసరికి తగరపువలస నుంచి విజయనగరం వైపు ప్రయాణికులతో వెళ్తున్న టాటా ఏస్ బలంగా ఢీకొట్టింది. దీంతో కారు నడుపుతున్న వెంకటప్రసాద్ బయటకు తుళ్లి అక్కడికక్కడే చనిపోయా రు. ప్రమాద సమయంలో కారు వెనుక వస్తున్న ఓ మోటారు సైక్లిస్టు కారును బలంగా ఢీకొట్టి స్వల్పంగా గాయపడ్డారు. టాటా ఏస్ డ్రైవర్‌కు తీవ్రగాయాలు కాగా విజయనగరంలోని మహారాజా ఆస్పత్రికి తరలించి నట్లు భీమిలి ట్రాఫిక్ ఎస్ఐ జె.భాస్కరరావు తెలిపారు. ఘటనా స్థలికి చేరుకున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడు మృతుని కుటుంబానికి సమాచారం అందజేశారు. స్థానిక నటరాజ్ కాలనీలో ని వాసముంటున్న ప్రసాద్ శ్రీవారి సేవా సంఘం అధ్యక్షునిగా సేవలందిస్తున్నారు. గత ఎనిమిదేళ్లుగా ఆయన ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రసాద్ గజపతినగరంలో ఉపాధ్యాయునిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు. టీటీడీ సంతాపం సాక్షి, తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లోని శ్రీవారి సేవ విభాగంలో సేవకుడు (వాలంటీర్)గా అత్యుత్తమ సేవలందించిన ప్రసాదరావు ఆదివారం విశాఖ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆయన హఠాన్మరణంపై టీటీడీ పీఆర్వో టీ.రవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రసాదరావు ఒకవైపు ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ మరోవైపు శ్రీవారి సేవకుడిగా పదేళ్లకుపైగా ఉత్తమ సేవలు అందించారని కొనియాడారు. శ్రీవారి సేవలో చురుకైన కార్యకర్తను కో ల్పోవడం బాధాకరమని తెలిపారు. ప్రసాదరావు ఆత్మకు శాంతి చేకూర్చి, వైకుంఠ ప్రాప్తి కలిగించాలని శ్రీవేంకటేశ్వరస్వామిని ప్రార్థిస్తున్నామని అన్నారు. పీఆర్వోతోపాటు ఏపీఆర్వో పీ.నీలిమ, టీటీడీ సీనియర్ ఫొటోగ్రాఫర్ శేఖర్ పెరుమాళ్, శ్రీవారి సేవా విభాగం అధికారులు, సిబ్బంది సంతాపం తెలియజేశారు.