రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడి మృతి
Published Mon, Sep 9 2013 4:22 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
తగరపువలస(విశాఖ), విజయనగరం కల్చరల్, న్యూస్‌లైన్: జాతీయ రహదారి 43పై ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఉపాధ్యాయుడు అక్కడికక్కడే చనిపోయాడు. విజయనగరం నట రాజు కాలనీకి చెందిన బులుసు సూర్యవెంకటప్రసాద్ (45) గజపతినగరంలో ఉపాధ్యాయునిగా వి ధులు నిర్వహిస్తున్నారు. విశాఖ నగరంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ చదువుతున్న కొడుకు వద్దకు కారులో బయలుదేరారు. బోడమెట్టపాలెం వద్దకు వచ్చేసరికి తగరపువలస నుంచి విజయనగరం వైపు ప్రయాణికులతో వెళ్తున్న టాటా ఏస్ బలంగా ఢీకొట్టింది.
దీంతో కారు నడుపుతున్న వెంకటప్రసాద్ బయటకు తుళ్లి అక్కడికక్కడే చనిపోయా రు. ప్రమాద సమయంలో కారు వెనుక వస్తున్న ఓ మోటారు సైక్లిస్టు కారును బలంగా ఢీకొట్టి స్వల్పంగా గాయపడ్డారు. టాటా ఏస్ డ్రైవర్‌కు తీవ్రగాయాలు కాగా విజయనగరంలోని మహారాజా ఆస్పత్రికి తరలించి నట్లు భీమిలి ట్రాఫిక్ ఎస్‌ఐ జె.భాస్కరరావు తెలిపారు. ఘటనా స్థలికి చేరుకున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడు మృతుని కుటుంబానికి సమాచారం అందజేశారు. స్థానిక నటరాజ్ కాలనీలో ని వాసముంటున్న ప్రసాద్ శ్రీవారి సేవా సంఘం అధ్యక్షునిగా సేవలందిస్తున్నారు. గత ఎనిమిదేళ్లుగా ఆయన ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రసాద్ గజపతినగరంలో ఉపాధ్యాయునిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.
టీటీడీ సంతాపం
సాక్షి, తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లోని శ్రీవారి సేవ విభాగంలో సేవకుడు (వాలంటీర్)గా అత్యుత్తమ సేవలందించిన ప్రసాదరావు ఆదివారం విశాఖ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆయన హఠాన్మరణంపై టీటీడీ పీఆర్‌వో టీ.రవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రసాదరావు ఒకవైపు ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ మరోవైపు శ్రీవారి సేవకుడిగా పదేళ్లకుపైగా ఉత్తమ సేవలు అందించారని కొనియాడారు. శ్రీవారి సేవలో చురుకైన కార్యకర్తను కో ల్పోవడం బాధాకరమని తెలిపారు. ప్రసాదరావు ఆత్మకు శాంతి చేకూర్చి, వైకుంఠ ప్రాప్తి కలిగించాలని శ్రీవేంకటేశ్వరస్వామిని ప్రార్థిస్తున్నామని అన్నారు.
పీఆర్‌వోతోపాటు ఏపీఆర్‌వో పీ.నీలిమ, టీటీడీ సీనియర్ ఫొటోగ్రాఫర్ శేఖర్ పెరుమాళ్, శ్రీవారి సేవా విభాగం అధికారులు, సిబ్బంది సంతాపం తెలియజేశారు.
Advertisement
Advertisement