Venkateswarlu thati
-
కేటీఆర్ కంటే నేనే సీనియర్: తాటి
అశ్వారావుపేట: తాతల కాలం నుంచి సాగు చేస్తున్న పోడు భూములకు సంబంధించి అర్హులైన గిరిజన, నిరుపేద రైతులకు పట్టాలు ఇస్తామనే ఒప్పం దంతోనే నాడు వైఎస్సార్ సీపీ నుంచి టీఆర్ఎస్లో చేరానని, అయితే ప్రస్తుతం పోడుదారులకు సీఎం కేసీఆర్ హక్కు పత్రాలిస్తారనే నమ్మకం లేదని అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు అన్నారు. కేటీఆర్ కంటే ముందు నుంచే తాను రాజకీయాల్లో ఉన్నానని, ఆయన కంటే సీనియర్నని తెలిపారు. నాడు పార్టీలోకి రావాలని ఆహ్వానించిన వారంతా.. నేడు అవమానాల పాల్జేస్తున్నారని విమర్శించారు. ఇకనైనా పార్టీ అధిష్టానం తనను పట్టించుకుని గుర్తింపునివ్వాలని, లేదంటే పార్టీ మారేందుకూ వెనుకాడేది లేదన్నారు. మంగళవారం ఆయన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో విలేకరులతో మాట్లాడుతూ, పూర్వ ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ పరిస్థితి బాగాలేదని, అశ్వారావుపేట నియోజకవర్గ ఇన్చార్జిగా మంత్రి కేటీఆర్ తనని ప్రకటిస్తే రాజకీయంగా అణచివేసేందుకు పార్టీ నాయకులే ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. గత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా నుంచి టీఆర్ఎస్ తరఫున ఒక్కరే ఎమ్మెల్యే గెలుపొందారని, వచ్చే ఎన్నికల్లోనూ అదే పరిస్థితి ఉంటుం దని చెప్పారు. ఇటీవల తన కూతురు చనిపోతే రాష్ట్ర నాయకులెవరూ పరామర్శించేందుకు రాలేదని వాపోయారు. -
టీఆర్ఎస్ అభ్యర్థికి షాక్.. ఐదుకోట్లకు అమ్ముడుపోయావ్.!
‘రోడ్లేశావా..? నీళ్లిచ్చావా..? ఇళ్లిచ్చావా..? మాకేం ఇచ్చావ్..? మాకేం చేశావ్..? మీకు ఓటెందుకేయాలి..?’ అని, అభ్యర్థులను, నాయకులను ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నిగ్గదీసి అడుగుతున్నారు. ప్రజల్లో చైతన్యమొచ్చిందా...! ప్రశ్నించే ధైర్యమొచ్చిందా...?! సాక్షి, కొత్తగూడెం, అశ్వారావుపేట: మల్లాయిగూడెం గ్రామం. గత ఎన్నికల్లో తాటి వెంకటేశ్వర్లు గెలుపులో ఇక్కడి ఓటర్లు కీలక పాత్ర పోషించారు. ఆనాడు ఆయనను ఆ గ్రామం అంతగా ఆదరించింది.. అక్కున చేర్చుకుంది. ఎన్నికల ప్రచారంలో భా గంగా గురువారం ఆ మల్లాయిగూడెం గ్రామానికి టీఆర్ఎస్ అభ్యర్థిగా వెళ్లిన అదే తాటి వెం కటేశ్వర్లుకు ఊహించని పరిణామం ఎదురైంది. ఆనాడు ఆయనతోపాటు వైఎస్సార్ సీపీ నుంచి టీఆర్ఎస్లోకి వెళ్లిన ఓటర్లు అడ్డుకున్నారు. ‘‘నీతోపాటు మేమూ పార్టీ మారాం. మాకేం చేశా వ్..? మా ఊరికేం చేశావ్..?’’ అని నిలదీశారు. ఇంతలో ఓ వ్యక్తి వచ్చి.. ‘‘ఐదుకోట్లకు అమ్ముడుపోయావ్’’ అని, మొహమ్మీదనే ఆరోపించారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత నెలకొంది. ఆ త రువాత అదే గ్రామంలో ఒకచోట తాటి కూర్చు న్నారు. స్థానికులతో ‘మనసు విప్పి’ మాట్లాడారు. కొన్ని వాస్తవాలను ఇలా బయటపెట్టారు. అభివృద్ధి కోసమే వెళ్లా... తాటి మాట్లాడుతూ.. ‘‘అభివృద్ధి కోసమే తుమ్మల నాగేశ్వరరావుతోపాటు నేను కూడా టీఆర్ఎస్ పా ర్టీలో చేరాను. నేను అమ్ముడుపోయే వ్యక్తిని కాదు. నా గురించి మీకు తెలియదా..?’’ అన్నారు. అభివృద్ధి చేయలేదు... సారీ.. అభివృద్ధి కోసమే టీఆర్ఎస్లోకి వెళ్లానన్న తాటి, ఆ తరువాత ఏం చేశావని ఎవ్వరూ ప్రశ్నిం చనప్పటికీ ఇలా నిజాయితీగా వైఫల్యాన్ని ఒప్పు కున్నారు. ‘‘ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మీ గ్రామానికి ఏమీ చేయలేకపోవడం బాధాకరమే. మీకేం కావాలో ఇప్పుడు చెప్పండి. ఈసారి నన్ను గెలిపించండి.. మల్లాయిగూడెం గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తా’’నని హామీ ఇచ్చారు. పోడు పట్టాలిప్పిస్తా... మల్లాయిగూడెంతోపాటు మరికొన్ని గ్రామా ల్లోనూ తాటి ప్రచారం చేశారు. చెన్నాపురం గ్రామస్తులతో మాట్లాడారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. ‘‘ప్రతి ఒక్క సమస్యనూ పరిష్కరిస్తా. ఏజెన్సీ ప్రాంతంలో పోడు భూములకు పట్టాల సమస్య ఉన్నది. 2015కు ముందు సాగు చేసుకుంటున్న గిరిజనులకు పోడు పట్టాలు ఇచ్చేలా కృషి చేస్తా, సీఎం కేసీఆర్ను ఒప్పిస్తా’’నని హామీ ఇచ్చారు. ‘ఈ నాలుగేళ్లలో మా సమస్యలను ఎందుకు పరిష్కరించలేదు? పోడు పట్టాలను మీ ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదు..?’ అని, మల్లా యిగూడెం గ్రామస్తుల మాదిరిగా ఇక్కడ తాటి వెంకటేశ్వర్లును ఎవ్వరూ ప్రశ్నించలేదు. అటవీశాఖ అనుమతిస్తే రోడ్లు.. ‘‘గాండ్లగూడెం నుంచి చెన్నాపురం, కన్నాయిగూడెం నుంచి అనంతారం గ్రామాలకు బీటీ రహదారి నిర్మాణానికి అటవీ శాఖ అనుమతిం చలేదు’’ అని చెప్పారు. అనుమతి వస్తే రోడ్లు నిర్మిస్తామన్నారు. గుడిసెలు పీకిస్తా.. ఇళ్లు కట్టిస్తా... ‘‘గిరిజన గ్రామాల్లోని గుడిసెలను పీకిస్తా. డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తా’’ అన్నారు. ‘ఇదే పనిని ఈ నాలుగేళ్లలో ఎందుకు చేయలేదు..?’ అని, ఆ గిరిజనుల నుంచి ప్రశ్న ఎదురవలేదు. తాటి వెంకటేశ్వర్లుకు, గురువారం నాటి ప్రచారంలో గ్రామగ్రామాన నిరాదరణే ఎదురైంది. తమల్లాయిగూడెంలో టీఆర్ఎస్ కార్యకర్తలు, గ్రామస్తులు నిలదీశారు. మా ఊరికి ఏం చేశా వంటూ సూటిగా ప్రశ్నించారు. ఏమీ చేయ నందుకు బాధపడుతున్నానని తాటి అన్నారు. కొన్ని గ్రామాల్లో తాటి వెంకటేశ్వర్లు ప్రచార రథం వద్దకు ఎవ్వరూ రాలేదు. గ్రామస్తులంతా వ్యవసాయ పనులకు వెళ్లిన వేళ ప్రచారానికి రావడంతో ఈ పరిస్థితి కనిపించింది. కొన్ని గ్రామాల్లో విపక్ష పార్టీలకు చెందిన కొందరు ప్రశ్నల పరంపరతో తాటి వెంకటేశ్వర్లు ను ఉక్కిరిబిక్కిరి చేశారు. ఆయన సంయమనం పాటిస్తూ.. ‘‘నా పనితనం మీకు నచ్చితే ఓట్లే యండి’’ అంటూ, ప్రచారాన్ని కొనసాగించారు. కొత్తకన్నాయిగూడెం గ్రామంలో కొండరెడ్లకు 20 డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టించారు. అయినప్పటికీ, అక్కడ తాటి ప్రచార రథం వద్దకు కనీసంగా 20మందిని కూడా స్థానిక నాయకులు పోగేయలేకపోయారు. చిన్నపాటి వర్షానికే నెలలతరబడి వాగు నీటి ప్రవాహంలో చిక్కుకునే కంట్లం గ్రామంలో తాటి ప్రచారానికి గ్రామస్తులు రాలేదు. ముందస్తు సమాచారం లేకపోవడం, ప్రజలు పొలం పను లకు వెళ్లడంతో తాటి నిరాశగా వెనుదిరిగారు. చెన్నాపురం గ్రామంలో రెండు సీసీ రహదారులను కాంట్రాక్టర్ పూర్తిచేయలేదు. దీనిపై గ్రామస్తులు మండిపడ్డారు. -
ఎస్ఐలకు గెజిటెడ్ హోదా... హామీ ఏమైంది..?
దమ్మపేట: ‘‘ఎస్సైలకు గెజిటెడ్ హోదా ఇస్తామన్న హామీ ఏమైంది? దాని అమలును ప్రభుత్వం మరిచిపోరుుందా..?’’ అని, వైఎస్ఆర్ సీపీ శాసనసభాపక్ష నేత, అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు మంగళవారం అసెంబ్లీ జీరో ఆవర్లో ప్రభుత్వాన్ని నిలదీశారు. దీనితోపాటు, పోలీసు సిబ్బందికి సంబంధించిన పలు సమస్యలపై ఆయన 20 నిమిషాలపాటు మాట్లాడారు. ఈ వివరాలను ఆయన ‘సాక్షి’కి ఫోన్లో తెలిపారు. ‘‘టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే సబ్ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్(ఎస్ఐ)లకు గెజిటెడ్ హోదా కల్పిస్తామని ఎన్నికల్లో కేసీఆర్ హామీ ఇచ్చారు. ఆ హామీ నేటికీ అమలుకు నోచుకోలేదు. దీని అమలును ప్రభుత్వం మరిచిపోరుుందా...? ఎస్ఐ నుంచి కానిస్టేబుళ్ల వరకు బయట విధులకు వెళితే టీఏ, డీఏ ఇవ్వాలి. కానీ అరకొరగా మాత్రమే ఇస్తున్నారు. పాత నిబంధనల ప్రకారంగా ఎస్ఐకు రెండువేలు, కానిస్టేబుళ్లకు 1050 రూపాయలు ఇస్తున్నారు. ఇవి ఎలా సరిపోతారుు..? పోలీస్ సిబ్బంది యూనిఫాం కోసం ప్రభుత్వం ఏడాదికి రెండువేలు కేటాయిస్తోంది. ప్రస్తుత మార్కెట్లో దుస్తుల ధరలు ఆకాశాన్నంటున్నారుు. ఈ పరిస్థితిలో ఈ మొత్తం ఏ మేరకు సరిపోతుందో ప్రభుత్వమే ఆలోచించాలి. తక్కువ జీతాలతో పోలీసుల జీవనం కష్టంగా మారుతోంది. పోలీస్ కానిస్టేబుళ్లతో సమానంగా విధులు నిర్వహిస్తున్న హోంగార్డులకు ప్రభుత్వం అరకొరగా వేతనాలు ఇస్తోంది. వారి జీవనం ఎలా సాగుతుంది? హోంగార్డులకు వేతనంగా నెలకు 15వేల రూపాయలు ఇవ్వాలి’’ అని కోరినట్టు ఎమ్మెల్యే చెప్పారు. ఎస్టీ, ఎస్సీ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహమమివ్వాలి ఎస్టీ, ఎస్సీ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహమమివ్వాలని ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ‘‘ఎస్టీ, ఎస్సీ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఏ విధంగా ఇస్తారో స్పష్టం చేయాలి’’ అని ఆయన కోరారు. మంగళవారం శాసనసభ ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో మొదటి ప్రశ్నగా దీనిని తాటి వెంకటేశ్వర్లు లేవనెత్తారు. ‘‘ఎస్టీ, ఎస్సీ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం ఇవ్వాలంటే 24 గంటలపాటు విద్యుత్ సరఫరా చేయాలి, బ్యాంకుల ద్వారా రుణాలు ఇవ్వాలి. ఇది ప్రభుత్వానికి సాధ్యమా..?’’ అని ప్రశ్నించారు. ‘‘ఎస్సీ, ఎస్టీలకు భూములుండవు. భూములు లేని వారికి బ్యాంకులు రుణాలు ఇవ్వవు. ఈ పరిస్థితిలో ఆయా వర్గాల పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం ఏ విధంగా ప్రోత్సాహాన్నిస్తుందో సభలో చెప్పాలి’’ అని కోరారు. ‘‘ఎలాంటి నిబంధనలు లేకుండా ప్రభుత్వమే బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించాలి. ప్రభుత్వ భూములను కేటాయించాలి. మార్జిన్ మనీ కూడా ప్రభుత్వమే చెల్లించేలా చర్యలు తీసుకోవాలి’’ అని కోరారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్రెడ్డి హయాంలో గిరిజన, దళిత పారిశ్రామికవేత్తలకు మంచి ప్రోత్సాహం అందిన విషయూన్ని గుర్తు చేశారు. అదే విధానాన్ని కేసీఆర్ ప్రభుత్వం కూడా అనుసరించాలని కోరారు.