టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి షాక్‌.. ఐదుకోట్లకు అమ్ముడుపోయావ్‌.! | People Protest Against Aswaraopeta MLA | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి షాక్‌.. ఐదుకోట్లకు అమ్ముడుపోయావ్‌.!

Published Fri, Oct 26 2018 4:08 PM | Last Updated on Fri, Oct 26 2018 4:08 PM

People Protest Against Aswaraopeta MLA - Sakshi

తాటి వెంకటేశ్వర్లును నిలదీస్తున్న ప్రజలు

‘రోడ్లేశావా..? నీళ్లిచ్చావా..? ఇళ్లిచ్చావా..? మాకేం ఇచ్చావ్‌..? మాకేం చేశావ్‌..? మీకు ఓటెందుకేయాలి..?’ అని, అభ్యర్థులను, నాయకులను ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నిగ్గదీసి అడుగుతున్నారు. ప్రజల్లో చైతన్యమొచ్చిందా...! ప్రశ్నించే ధైర్యమొచ్చిందా...?!

సాక్షి, కొత్తగూడెం, అశ్వారావుపేట: మల్లాయిగూడెం గ్రామం. గత ఎన్నికల్లో తాటి వెంకటేశ్వర్లు గెలుపులో ఇక్కడి ఓటర్లు కీలక పాత్ర పోషించారు. ఆనాడు ఆయనను ఆ గ్రామం అంతగా ఆదరించింది.. అక్కున చేర్చుకుంది. ఎన్నికల ప్రచారంలో భా గంగా గురువారం ఆ మల్లాయిగూడెం గ్రామానికి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా వెళ్లిన అదే తాటి వెం కటేశ్వర్లుకు ఊహించని పరిణామం ఎదురైంది. ఆనాడు ఆయనతోపాటు వైఎస్సార్‌ సీపీ నుంచి టీఆర్‌ఎస్‌లోకి వెళ్లిన ఓటర్లు అడ్డుకున్నారు. ‘‘నీతోపాటు మేమూ పార్టీ మారాం. మాకేం చేశా వ్‌..? మా ఊరికేం చేశావ్‌..?’’ అని నిలదీశారు. ఇంతలో ఓ వ్యక్తి వచ్చి.. ‘‘ఐదుకోట్లకు అమ్ముడుపోయావ్‌’’ అని, మొహమ్మీదనే ఆరోపించారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత నెలకొంది. ఆ త రువాత అదే గ్రామంలో ఒకచోట తాటి కూర్చు న్నారు. స్థానికులతో ‘మనసు విప్పి’ మాట్లాడారు. కొన్ని వాస్తవాలను ఇలా బయటపెట్టారు.

అభివృద్ధి కోసమే వెళ్లా...
తాటి మాట్లాడుతూ.. ‘‘అభివృద్ధి కోసమే తుమ్మల నాగేశ్వరరావుతోపాటు నేను కూడా టీఆర్‌ఎస్‌ పా ర్టీలో చేరాను. నేను అమ్ముడుపోయే వ్యక్తిని కాదు. నా గురించి మీకు తెలియదా..?’’ అన్నారు.

అభివృద్ధి చేయలేదు... సారీ..
అభివృద్ధి కోసమే టీఆర్‌ఎస్‌లోకి వెళ్లానన్న తాటి, ఆ తరువాత ఏం చేశావని ఎవ్వరూ ప్రశ్నిం చనప్పటికీ ఇలా నిజాయితీగా వైఫల్యాన్ని ఒప్పు కున్నారు. ‘‘ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మీ గ్రామానికి ఏమీ చేయలేకపోవడం బాధాకరమే. మీకేం కావాలో ఇప్పుడు చెప్పండి. ఈసారి నన్ను గెలిపించండి.. మల్లాయిగూడెం గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తా’’నని హామీ ఇచ్చారు.

పోడు పట్టాలిప్పిస్తా...
మల్లాయిగూడెంతోపాటు మరికొన్ని గ్రామా ల్లోనూ తాటి ప్రచారం చేశారు. చెన్నాపురం గ్రామస్తులతో మాట్లాడారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. ‘‘ప్రతి ఒక్క సమస్యనూ పరిష్కరిస్తా. ఏజెన్సీ ప్రాంతంలో పోడు భూములకు పట్టాల సమస్య ఉన్నది. 2015కు ముందు సాగు చేసుకుంటున్న గిరిజనులకు పోడు పట్టాలు ఇచ్చేలా  కృషి చేస్తా, సీఎం కేసీఆర్‌ను ఒప్పిస్తా’’నని హామీ ఇచ్చారు. ‘ఈ నాలుగేళ్లలో మా సమస్యలను ఎందుకు పరిష్కరించలేదు? పోడు పట్టాలను మీ ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదు..?’ అని, మల్లా యిగూడెం గ్రామస్తుల మాదిరిగా ఇక్కడ తాటి వెంకటేశ్వర్లును ఎవ్వరూ ప్రశ్నించలేదు.

అటవీశాఖ అనుమతిస్తే రోడ్లు..
‘‘గాండ్లగూడెం నుంచి చెన్నాపురం, కన్నాయిగూడెం నుంచి అనంతారం గ్రామాలకు బీటీ రహదారి నిర్మాణానికి అటవీ శాఖ అనుమతిం చలేదు’’ అని చెప్పారు. అనుమతి వస్తే రోడ్లు నిర్మిస్తామన్నారు.

గుడిసెలు పీకిస్తా.. ఇళ్లు కట్టిస్తా...
‘‘గిరిజన గ్రామాల్లోని గుడిసెలను పీకిస్తా. డబుల్‌ బెడ్రూం ఇళ్లు కట్టిస్తా’’ అన్నారు. ‘ఇదే పనిని ఈ నాలుగేళ్లలో ఎందుకు చేయలేదు..?’ అని, ఆ గిరిజనుల నుంచి ప్రశ్న ఎదురవలేదు.

తాటి వెంకటేశ్వర్లుకు, గురువారం నాటి ప్రచారంలో గ్రామగ్రామాన నిరాదరణే ఎదురైంది. తమల్లాయిగూడెంలో టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, గ్రామస్తులు నిలదీశారు. మా ఊరికి ఏం చేశా వంటూ సూటిగా ప్రశ్నించారు. ఏమీ చేయ నందుకు బాధపడుతున్నానని తాటి అన్నారు. కొన్ని గ్రామాల్లో తాటి వెంకటేశ్వర్లు   ప్రచార రథం వద్దకు ఎవ్వరూ రాలేదు. గ్రామస్తులంతా వ్యవసాయ పనులకు వెళ్లిన వేళ ప్రచారానికి రావడంతో ఈ పరిస్థితి కనిపించింది.  కొన్ని గ్రామాల్లో విపక్ష పార్టీలకు చెందిన కొందరు ప్రశ్నల పరంపరతో తాటి వెంకటేశ్వర్లు ను ఉక్కిరిబిక్కిరి చేశారు. ఆయన సంయమనం పాటిస్తూ.. ‘‘నా పనితనం మీకు నచ్చితే ఓట్లే యండి’’ అంటూ, ప్రచారాన్ని కొనసాగించారు.   కొత్తకన్నాయిగూడెం గ్రామంలో కొండరెడ్లకు 20 డబుల్‌ బెడ్రూం ఇళ్లు కట్టించారు. అయినప్పటికీ, అక్కడ తాటి ప్రచార రథం వద్దకు కనీసంగా 20మందిని కూడా స్థానిక నాయకులు పోగేయలేకపోయారు.  చిన్నపాటి వర్షానికే నెలలతరబడి వాగు  నీటి ప్రవాహంలో చిక్కుకునే కంట్లం గ్రామంలో తాటి ప్రచారానికి గ్రామస్తులు రాలేదు. ముందస్తు సమాచారం లేకపోవడం, ప్రజలు పొలం పను లకు వెళ్లడంతో తాటి నిరాశగా వెనుదిరిగారు. చెన్నాపురం గ్రామంలో రెండు సీసీ రహదారులను కాంట్రాక్టర్‌ పూర్తిచేయలేదు. దీనిపై గ్రామస్తులు మండిపడ్డారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement