aswaraopeta MLA
-
టీఆర్ఎస్ అభ్యర్థికి షాక్.. ఐదుకోట్లకు అమ్ముడుపోయావ్.!
‘రోడ్లేశావా..? నీళ్లిచ్చావా..? ఇళ్లిచ్చావా..? మాకేం ఇచ్చావ్..? మాకేం చేశావ్..? మీకు ఓటెందుకేయాలి..?’ అని, అభ్యర్థులను, నాయకులను ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నిగ్గదీసి అడుగుతున్నారు. ప్రజల్లో చైతన్యమొచ్చిందా...! ప్రశ్నించే ధైర్యమొచ్చిందా...?! సాక్షి, కొత్తగూడెం, అశ్వారావుపేట: మల్లాయిగూడెం గ్రామం. గత ఎన్నికల్లో తాటి వెంకటేశ్వర్లు గెలుపులో ఇక్కడి ఓటర్లు కీలక పాత్ర పోషించారు. ఆనాడు ఆయనను ఆ గ్రామం అంతగా ఆదరించింది.. అక్కున చేర్చుకుంది. ఎన్నికల ప్రచారంలో భా గంగా గురువారం ఆ మల్లాయిగూడెం గ్రామానికి టీఆర్ఎస్ అభ్యర్థిగా వెళ్లిన అదే తాటి వెం కటేశ్వర్లుకు ఊహించని పరిణామం ఎదురైంది. ఆనాడు ఆయనతోపాటు వైఎస్సార్ సీపీ నుంచి టీఆర్ఎస్లోకి వెళ్లిన ఓటర్లు అడ్డుకున్నారు. ‘‘నీతోపాటు మేమూ పార్టీ మారాం. మాకేం చేశా వ్..? మా ఊరికేం చేశావ్..?’’ అని నిలదీశారు. ఇంతలో ఓ వ్యక్తి వచ్చి.. ‘‘ఐదుకోట్లకు అమ్ముడుపోయావ్’’ అని, మొహమ్మీదనే ఆరోపించారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత నెలకొంది. ఆ త రువాత అదే గ్రామంలో ఒకచోట తాటి కూర్చు న్నారు. స్థానికులతో ‘మనసు విప్పి’ మాట్లాడారు. కొన్ని వాస్తవాలను ఇలా బయటపెట్టారు. అభివృద్ధి కోసమే వెళ్లా... తాటి మాట్లాడుతూ.. ‘‘అభివృద్ధి కోసమే తుమ్మల నాగేశ్వరరావుతోపాటు నేను కూడా టీఆర్ఎస్ పా ర్టీలో చేరాను. నేను అమ్ముడుపోయే వ్యక్తిని కాదు. నా గురించి మీకు తెలియదా..?’’ అన్నారు. అభివృద్ధి చేయలేదు... సారీ.. అభివృద్ధి కోసమే టీఆర్ఎస్లోకి వెళ్లానన్న తాటి, ఆ తరువాత ఏం చేశావని ఎవ్వరూ ప్రశ్నిం చనప్పటికీ ఇలా నిజాయితీగా వైఫల్యాన్ని ఒప్పు కున్నారు. ‘‘ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మీ గ్రామానికి ఏమీ చేయలేకపోవడం బాధాకరమే. మీకేం కావాలో ఇప్పుడు చెప్పండి. ఈసారి నన్ను గెలిపించండి.. మల్లాయిగూడెం గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తా’’నని హామీ ఇచ్చారు. పోడు పట్టాలిప్పిస్తా... మల్లాయిగూడెంతోపాటు మరికొన్ని గ్రామా ల్లోనూ తాటి ప్రచారం చేశారు. చెన్నాపురం గ్రామస్తులతో మాట్లాడారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. ‘‘ప్రతి ఒక్క సమస్యనూ పరిష్కరిస్తా. ఏజెన్సీ ప్రాంతంలో పోడు భూములకు పట్టాల సమస్య ఉన్నది. 2015కు ముందు సాగు చేసుకుంటున్న గిరిజనులకు పోడు పట్టాలు ఇచ్చేలా కృషి చేస్తా, సీఎం కేసీఆర్‌ను ఒప్పిస్తా’’నని హామీ ఇచ్చారు. ‘ఈ నాలుగేళ్లలో మా సమస్యలను ఎందుకు పరిష్కరించలేదు? పోడు పట్టాలను మీ ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదు..?’ అని, మల్లా యిగూడెం గ్రామస్తుల మాదిరిగా ఇక్కడ తాటి వెంకటేశ్వర్లును ఎవ్వరూ ప్రశ్నించలేదు. అటవీశాఖ అనుమతిస్తే రోడ్లు.. ‘‘గాండ్లగూడెం నుంచి చెన్నాపురం, కన్నాయిగూడెం నుంచి అనంతారం గ్రామాలకు బీటీ రహదారి నిర్మాణానికి అటవీ శాఖ అనుమతిం చలేదు’’ అని చెప్పారు. అనుమతి వస్తే రోడ్లు నిర్మిస్తామన్నారు. గుడిసెలు పీకిస్తా.. ఇళ్లు కట్టిస్తా... ‘‘గిరిజన గ్రామాల్లోని గుడిసెలను పీకిస్తా. డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తా’’ అన్నారు. ‘ఇదే పనిని ఈ నాలుగేళ్లలో ఎందుకు చేయలేదు..?’ అని, ఆ గిరిజనుల నుంచి ప్రశ్న ఎదురవలేదు. తాటి వెంకటేశ్వర్లుకు, గురువారం నాటి ప్రచారంలో గ్రామగ్రామాన నిరాదరణే ఎదురైంది. తమల్లాయిగూడెంలో టీఆర్ఎస్ కార్యకర్తలు, గ్రామస్తులు నిలదీశారు. మా ఊరికి ఏం చేశా వంటూ సూటిగా ప్రశ్నించారు. ఏమీ చేయ నందుకు బాధపడుతున్నానని తాటి అన్నారు. కొన్ని గ్రామాల్లో తాటి వెంకటేశ్వర్లు ప్రచార రథం వద్దకు ఎవ్వరూ రాలేదు. గ్రామస్తులంతా వ్యవసాయ పనులకు వెళ్లిన వేళ ప్రచారానికి రావడంతో ఈ పరిస్థితి కనిపించింది. కొన్ని గ్రామాల్లో విపక్ష పార్టీలకు చెందిన కొందరు ప్రశ్నల పరంపరతో తాటి వెంకటేశ్వర్లు ను ఉక్కిరిబిక్కిరి చేశారు. ఆయన సంయమనం పాటిస్తూ.. ‘‘నా పనితనం మీకు నచ్చితే ఓట్లే యండి’’ అంటూ, ప్రచారాన్ని కొనసాగించారు. కొత్తకన్నాయిగూడెం గ్రామంలో కొండరెడ్లకు 20 డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టించారు. అయినప్పటికీ, అక్కడ తాటి ప్రచార రథం వద్దకు కనీసంగా 20మందిని కూడా స్థానిక నాయకులు పోగేయలేకపోయారు. చిన్నపాటి వర్షానికే నెలలతరబడి వాగు నీటి ప్రవాహంలో చిక్కుకునే కంట్లం గ్రామంలో తాటి ప్రచారానికి గ్రామస్తులు రాలేదు. ముందస్తు సమాచారం లేకపోవడం, ప్రజలు పొలం పను లకు వెళ్లడంతో తాటి నిరాశగా వెనుదిరిగారు. చెన్నాపురం గ్రామంలో రెండు సీసీ రహదారులను కాంట్రాక్టర్ పూర్తిచేయలేదు. దీనిపై గ్రామస్తులు మండిపడ్డారు. -
లైంగిక దాడి కేసులో.. 12మంది అరెస్ట్
అశ్వారావుపేట : దమ్మపేట మండలం రాచూరపల్లి గ్రామంలో గిరిజన బాలికపై సామూహికంగా లైంగిక దాడి చేసిన 12మందిని పాల్వంచ డీఎస్పీ శ్రీనివాసులు అరెస్ట్ చేసి, కోర్టుకు శుక్రవారం అప్పగించారు. దమ్మపేట పోలీస్ స్టేషన్లో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన వెల్లడించిన వివరాలు.. ఠీకుక్కునూరు మండలం నల్లకుంట గ్రామానికి చెందిన గిరిజన బాలిక, ఈ నెల 21 దమ్మపేట మండలం రాచూరపల్లి గ్రామంలోని తన స్నేహితురాలి ఇంటికి వచ్చింది. స్నేహితురాలి తాత మందలించడంతో మరుసటి రోజున గ్రామ శివారులోని చెరువు వద్దకు వెళ్లింది. అక్కడ మధ్యాహ్నం 12 గంటల సమయంలో అదే గ్రామానికి చెందిన కోర్సా మహేష్, జారే శివరాజు, సరియం నర్సయ్య, నరసింహారావు, సరియం లక్ష్మణరావు, మడివి నగేష్, కొర్సా అర్జునరావు, సమీపంలోగల చెరువు కట్ట వద్దనున్న వాగులోకి బలవంతంగా తీసుకెళ్లి లైంగిక దాడి చేశారు. అక్కడి నుంచి ఆమె ఏడ్చుకుంటూ గ్రామంలోకి వస్తోంది. మార్గమధ్యలోగల జామాయిల్ తోట వద్దకు రాగానే, అశ్వారావుపేట మండలం నందిపాడు గ్రామానికి చెందిన పద్దం నవీన్, సోడే ముత్తేష్, డేరంగుల దివాకర్, మత్తుల మధు, ఓ బాలుడు కలిసి రెండు మోటార్ సైకిళ్లపై వచ్చి అడ్డగించారు. వారు కూడా ఆమెపై లైంగిక దాడికి దిగి వెళ్లిపోయారు. కొంతసేపటి తరువాత ఆమె కోలుకుంది. ఏడ్చుకుంటూ రోడ్డు పైకి వచ్చింది. అటుగా బైక్‌పై వెళుతున్న గుర్తు తెలియని వ్యక్తి గమనించాడు. వివరాలు తెలుసుకున్నాడు. ఆమెను కుక్కునూరు మండలం నల్లకుంటలోని ఇంటి వద్దకు తీసుకెళ్లి అప్పగించాడు. తనపై జరిగిన దారుణాలను ఆమె తన తల్లిదండ్రులకు తెలిపింది. మేనమామ శీలం దూలయ్య సహాయంతో గురువారం దమ్మపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. నిందితులను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసి, సత్తుప్లలి కోర్టుకు అప్పగించారు. వెనుకబడిన తరగతి(బీసీ)కి చెందిన నిందితులు దివాకర్, మధుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తులో అశ్వారావుపేట సీఐ ఎం.అబ్బయ్య, అశ్వారావుపేట, దమ్మపేట ఎస్ఐలు వేల్పుల వెంకటేశ్వర్లు, జలకం ప్రవీణ్‌కుమార్ సహరించినట్టు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. -
తాగునీటి తిప్పలు
చండ్రుగొండ : మండలంలోని తిప్పనపల్లి గ్రామంలో తాగునీటి ఎద్దడి నెలకొంది. దీంతో ఆగ్రహించిన మహిళలు శుక్రవారం గ్రామంలో ఖాళీ బిందెలతో రాస్తారోకో చేశారు. తిప్పనపల్లి గ్రామంలోని పాతూరులో డైరెక్డ్ పంపింగ్ సిస్టం ద్వార తాగునీటి సరఫరా జరుగుతోంది. అయితే బోరుబావిలో నీటి జలాలు అడుగంటిపోవడంతో నెలరోజులుగా తాగునీటి ఇబ్బందులు నెలకొన్నాయి. సుమారు 200 కుటుంబాలు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడున్నారు. అధికారులకు, ప్రజాప్రతినిధులకు అనేకమార్లు సమస్య వివరించినప్పటికి చర్యలు తీసుకోలేదని లతీఫ్బీ, జాన్‌బీ, సాబీర, హుసేన్‌బీ తెలిపారు. ఈ క్రమంలోనే తాము రోడ్డెక్కి నిరసన తెలియజేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఇప్పటికైన అధికారులు సత్వర చర్యలు తీసుకుని తాగునీటి సరఫరా పునరుద్ధరించాలని వారు కోరుతున్నారు. -
అశ్వారావుపేట ఎమ్మెల్యేకు మాతృవియోగం
అశ్వారావుపేట: ఖమ్మం జిల్లా అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు మాతృమూర్తి బుల్లెమ్మ(84) గురువారం తుదిశ్వాస విడిచారు. ఆమె స్వగ్రామం పశ్చిమగోదావరి జిల్లా పి.నరసాపురం మండలంలోని ఆమె స్వగ్రామం మర్రిగూడెంలో మృతి చెందారు. విషయం తెల్సిన తాటి వెంకటేశ్వర్లు మర్రిగూడెం బయలు దేరారు. ఎమ్మెల్యేకు పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.