వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ శ్రీనివాసులు, వెనుకవైపున ముసుగుతో నిందితులు
అశ్వారావుపేట : దమ్మపేట మండలం రాచూరపల్లి గ్రామంలో గిరిజన బాలికపై సామూహికంగా లైంగిక దాడి చేసిన 12మందిని పాల్వంచ డీఎస్పీ శ్రీనివాసులు అరెస్ట్ చేసి, కోర్టుకు శుక్రవారం అప్పగించారు. దమ్మపేట పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన వెల్లడించిన వివరాలు.. ఠీకుక్కునూరు మండలం నల్లకుంట గ్రామానికి చెందిన గిరిజన బాలిక, ఈ నెల 21 దమ్మపేట మండలం రాచూరపల్లి గ్రామంలోని తన స్నేహితురాలి ఇంటికి వచ్చింది. స్నేహితురాలి తాత మందలించడంతో మరుసటి రోజున గ్రామ శివారులోని చెరువు వద్దకు వెళ్లింది.
- అక్కడ మధ్యాహ్నం 12 గంటల సమయంలో అదే గ్రామానికి చెందిన కోర్సా మహేష్, జారే శివరాజు, సరియం నర్సయ్య, నరసింహారావు, సరియం లక్ష్మణరావు, మడివి నగేష్, కొర్సా అర్జునరావు, సమీపంలోగల చెరువు కట్ట వద్దనున్న వాగులోకి బలవంతంగా తీసుకెళ్లి లైంగిక దాడి చేశారు.
- అక్కడి నుంచి ఆమె ఏడ్చుకుంటూ గ్రామంలోకి వస్తోంది. మార్గమధ్యలోగల జామాయిల్ తోట వద్దకు రాగానే, అశ్వారావుపేట మండలం నందిపాడు గ్రామానికి చెందిన పద్దం నవీన్, సోడే ముత్తేష్, డేరంగుల దివాకర్, మత్తుల మధు, ఓ బాలుడు కలిసి రెండు మోటార్ సైకిళ్లపై వచ్చి అడ్డగించారు. వారు కూడా ఆమెపై లైంగిక దాడికి దిగి వెళ్లిపోయారు.
- కొంతసేపటి తరువాత ఆమె కోలుకుంది. ఏడ్చుకుంటూ రోడ్డు పైకి వచ్చింది. అటుగా బైక్‌పై వెళుతున్న గుర్తు తెలియని వ్యక్తి గమనించాడు. వివరాలు తెలుసుకున్నాడు. ఆమెను కుక్కునూరు మండలం నల్లకుంటలోని ఇంటి వద్దకు తీసుకెళ్లి అప్పగించాడు.
- తనపై జరిగిన దారుణాలను ఆమె తన తల్లిదండ్రులకు తెలిపింది. మేనమామ శీలం దూలయ్య సహాయంతో గురువారం దమ్మపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. నిందితులను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసి, సత్తుప్లలి కోర్టుకు అప్పగించారు.
- వెనుకబడిన తరగతి(బీసీ)కి చెందిన నిందితులు దివాకర్, మధుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది.
ఈ కేసు దర్యాప్తులో అశ్వారావుపేట సీఐ ఎం.అబ్బయ్య, అశ్వారావుపేట, దమ్మపేట ఎస్‌ఐలు వేల్పుల వెంకటేశ్వర్లు, జలకం ప్రవీణ్‌కుమార్ సహరించినట్టు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment