
ఖాళీ బిందెలతో నిరసన తెలుపుతున్న మహిళలు
చండ్రుగొండ : మండలంలోని తిప్పనపల్లి గ్రామంలో తాగునీటి ఎద్దడి నెలకొంది. దీంతో ఆగ్రహించిన మహిళలు శుక్రవారం గ్రామంలో ఖాళీ బిందెలతో రాస్తారోకో చేశారు. తిప్పనపల్లి గ్రామంలోని పాతూరులో డైరెక్డ్ పంపింగ్ సిస్టం ద్వార తాగునీటి సరఫరా జరుగుతోంది. అయితే బోరుబావిలో నీటి జలాలు అడుగంటిపోవడంతో నెలరోజులుగా తాగునీటి ఇబ్బందులు నెలకొన్నాయి. సుమారు 200 కుటుంబాలు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడున్నారు. అధికారులకు, ప్రజాప్రతినిధులకు అనేకమార్లు సమస్య వివరించినప్పటికి చర్యలు తీసుకోలేదని లతీఫ్‌బీ, జాన్‌బీ, సాబీర, హుసేన్‌బీ తెలిపారు. ఈ క్రమంలోనే తాము రోడ్డెక్కి నిరసన తెలియజేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఇప్పటికైన అధికారులు సత్వర చర్యలు తీసుకుని తాగునీటి సరఫరా పునరుద్ధరించాలని వారు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment