మహిళ నుంచి పుస్తెలతాడు చోరీ
నల్గొండ: జిల్లాలోని బీబీనగర్ మండలంలోని చిన రావులపల్లి గ్రామ శివారులో గురువారం ఓ మహిళను నమ్మించి ఆమె మెడలో ఉన్న పుస్తెలతాడును అపహరించి పోయారు. ఎస్ఐ ప్రణీత్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం చిన్నరావులపల్లి గ్రామానికి చెందిన బొమ్మగాని కమలమ్మ, ఎప్పటిలాగానే చిన్నరావులపల్లి నుంచి రాఘవాపూరం వెళ్లే రహదారి మధ్యలో కల్లు అమ్ముతుండగా గుర్తుతెలియని ఇద్దరు యువకులు ద్విచక్రవాహనంపై వచ్చి కల్లు కవాలని అడగంతో కమలమ్మ భర్త వెంకటస్వామిగౌడ్ కల్లు గీసేందుకు తాడు ఎక్కగా అక్కడ ఉన్న ఇద్ధరు యువకులు కత్తలతో బెదిరించడంతో ఆమె మెడలోని నాలుగు తులాల పుస్తెల తాడును వారికి ఇచ్చింది అక్కడ నుంచి యువకులు పారిపొయినట్లు తెలిపారు, ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యప్తు చే స్తున్నాట్లు ఎస్ఐ తెలిపారు.