వేగంగా గుడా కార్యకలాపాలు
పురపాలక, పట్టణాభివృద్ధి సంస్థ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశం
కాకినాడ సిటీ :
గోదావరి అర్భ¯ŒS డెవలప్మెంట్ అథార్టీ (గుడా) కార్యకలాపాలను వేగవంతం చేయాలని పురపాలక, పట్టణాభివృద్ధి సంస్థ ప్రిన్సిపల్ సెక్రటరీ కరికల వలవ¯ŒS జిల్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం విజయవాడ నుంచి జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరె¯Œ్స నిర్వహించారు. గుడా కార్యకలాపాలపై సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. కార్యాలయ ఏర్పాటుకు భవనాలు త్వరితగతిన చూడాలని, ఇప్పటికే కార్యాలయ ప్రధాన పోస్టులు మంజూరు చేశామని, మిగిలిన అధికారులు సిబ్బంది నియమకానికి చర్యలు తీసుకుంటామన్నారు. ప్రధానంగా గ్రామాల్లో నా¯ŒSలేఅవుట్లు ఎక్కువై ధరలు పెరుగుతున్న నేపథ్యంలో గుడా ఏర్పాటుతో ధరలు పెరుగుతున్నాయనే అభిప్రాయం ప్రజల్లో అపోహలకు తావులేకుండా అవగాహన సమావేశాలు నిర్వహించాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరె¯Œ్సలో కలెక్టరేట్ నుంచి గుడా ఇ¯ŒSచార్జ్ వైస్ చైర్మన్, రాజమహేంద్రవరం కార్పొరేష¯ŒS కమిషనర్ విజయరామరాజు, మున్సిపల్ ఆర్డీడీ సాయిబాబు, ఆర్అండ్బీ ఎస్ఈ సీఎస్ఎ¯ŒS మూర్తి, డీపీవో గంగాధర కుమార్, ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈ ప్రసాద్ పాల్గొన్నారు.