Viber
-
స్కైప్ కాల్స్‌కు ఎయిర్టెల్ చార్జీ
న్యూఢిల్లీ: భారతీ ఎయిర్టెల్ మొబైల్ డేటా ప్యాకేజీలు ఉపయోగించుకుని స్కైప్, వైబర్ తదితర యాప్స్ ద్వారా కాల్స్ చేసుకునే వారు ఇకపై మరింత అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుత డేటా ప్యాకేజీలలో చేర్చకుండా వాయిస్ కాల్స్ ఓవర్ ఇంటర్నెట్ (వీఓఐపీ)కి విడిగా చార్జీలు వసూలు చేయాలని ఎయిర్టెల్ నిర్ణయించడం ఇందుకు కారణం. డిస్కౌంటు రేటుతో లభించే ఇంటర్నెట్ ప్యాక్‌లు కేవలం బ్రౌజింగ్కి మాత్రమే పనిచేస్తాయని, వీఓఐపీ వీటిలో భాగం కాబోదని ఎయిర్టెల్ తమ వెబ్సైట్లో పేర్కొంది. వీఓఐపీ వినియోగించుకునే వారు 10 కేబీకి/4 పైసలు (3జీ సర్వీసులకు), 10 కేబీకి/10 పైసలు (2జీ సర్వీసులకు) ప్రామాణిక డేటా రేటు చెల్లించాల్సి ఉంటుందని వివరించింది. ఇలా వీఓఐపీ డేటాకు విడిగా చార్జీలు విధించడం దేశీయంగా ఇదే తొలిసారి. దీని కోసం త్వరలో ప్రత్యేక ప్యాక్‌ను కూడా ప్రవేశపెట్టబోతున్నామని ఎయిర్టెల్ వివరించింది. వాట్స్‌యాప్, లైన్, స్కైప్ వంటి ఇంటర్నెట్ ఆధారిత సర్వీసుల సంస్థలను కూడా నియంత్రణ పరిధిలోకి తీసుకురావాలంటూ మొబైల్ ఆపరేటర్లు చాన్నాళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. -
వైబర్ నుంచి పబ్లిక్ చాట్ సర్వీస్
న్యూఢిల్లీ: ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వైబర్ పబ్లిక్ చాట్ సర్వీస్‌ను అందిస్తోంది. ఈ పబ్లిక్ చాట్‌తో యూజర్లు తమ స్మార్ట్ఫోన్ల ద్వారా కమ్యూనిటీలు, సెలబ్రిటీలతో ఇంటరాక్ట్ కావచ్చు. పబ్లిక్ చాట్ సర్వీస్ ద్వారా చాటింగ్ చేయవచ్చని, పబ్లిక్ చాట్స్‌కు ఫ్రెండ్స్‌ను ఇన్వైట్ చేయవచ్చని వైబర్ హెడ్ ఇండియా అనుభవ్ నయ్యర్ చెప్పారు. అంతర్జాతీయంగా వైబర్‌కు 311 మంది చాట్ భాగస్వాములున్నారు. వీరిలో 56 మంది భారత్‌లో ఉన్నారు. వీరిలో అనుష్క శర్మ, రణ్వీర్ సింగ్, అర్జున్ కపూర్, షాన్, సచిన్ తేందూల్కర్, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, సైనా నెహ్వాల్‌లు కొందరు. ఈ ఏడాది చివరికల్లా తమ వినియోగదారుల సంఖ్య 50 కోట్లకు చేరుతుందనేది వైబర్ అంచనా. భారత్, రష్యాల్లో జోరుగా ఉన్న వృద్ధే దీనికి కారణమని వివరించింది. తమకు అత్యధికంగా భారత్‌లోనే యూజర్లున్నారని (3.3 కోట్ల మంది), ఆ తర్వాతి స్థానాల్లో అమెరికా (3 కోట్లు). రష్యా(2.8 కోట్లు) ఉన్నాయని వైబర్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ మార్క్ హర్డీ చెప్పారు. తమకు ఆదాయం వచ్చే అగ్రశ్రేణి ఐదు మార్కెట్లలో భారత్ కూడా ఒకటని వివరించారు. తన ప్లాట్‌ఫామ్‌పై గేమ్స్, మరింత స్థానిక కంటెంట్ ను అందించనున్నామని చెప్పారు. -
ఇక వైబర్లోనూ చాటింగ్!!
ఫేస్బుక్, వాట్సప్లలోనే కాదు.. తాజాగా వైబర్లోనూ చాటింగ్ చేసుకోడానికి అవకాశం వస్తోంది. భారతదేశంలో మొబైల్ ఇంటర్నెట్ వినియోగం శరవేగంగా విస్తరిస్తుండటంతో ఇన్నాళ్లూ ఉచితంగా కాల్స్ మాత్రమే అందిస్తున్న వైబర్.. ఇప్పుడు పబ్లిక్ చాట్‌ను కూడా ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని కంపెనీ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ మార్క్ హార్డీ చెప్పారు. భారతదేశంలో తమకు అత్యధిక సంఖ్యలో యూజర్లున్నారని, మొత్తం 46 కోట్ల మంది యూజర్లుంటే, వాళ్లలో 3.3 కోట్లమంది భారతీయులేనని, ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా అమెరికా, రష్యా, బ్రెజిల్, యూకే దేశాల వాళ్లు ఉన్నారని ఆయన అన్నారు. పబ్లిక్ చాటింగ్ ద్వారా కేవలం చాటింగ్ చేసుకోవడమే కాక, కంటెంట్ కూడా షేర్ చేసుకోవచ్చని తెలిపారు. అలాగే, తాము ఫాలో అయ్యే సెలబ్రిటీల చాట్లు, వాళ్ల చర్చలను కూడా యూజర్లు చూసుకోవచ్చు. అంతేకాదు.. ఇందులో మరో కొత్త అవకాశం కూడా ఉంది. లైవ్ సంభాషణలు జరుగుతున్నప్పుడు వాటిని అప్పటికప్పుడే చూసుకోవచ్చు. వైబర్ వాడేవాళ్లు ఎంతమందిని ఫాలో అవుతుంటే అంతమంది చాట్లు చూడచ్చు. ఇందులో టెక్స్ట్, ఫొటోలు, ఆడియో, వీడియో, వెబ్ లింకులు ఏవైనా షేర్ చేసుకోవచ్చు. భారతదేశంలో ఏడాదికి 130 శాతం పెరుగుదల ఉంటోందని, ప్రతివారం తమకు అదనంగా 10 లక్షల మంది యూజర్లు కలుస్తున్నారని మార్క్ హార్డీ తెలిపారు. -
తక్కువ రేట్ల కాల్స్ కోసం వైబర్ అవుట్
హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా వైబర్ అవుట్ ఆవిష్కరణలో భాగంగా వైబర్ నేడిక్కడ ఆండ్రాయిడ్, ఐఫోన్ల కోసం వైబర్ 4.1 వెర్షన్‌ను ఆవిష్కరించింది. ఈ కొత్త ఫీచర్ కారణంగా యూజర్లు ఏ మొబైల్ లేదా ల్యాండ్‌లైన్ ఫోన్ నంబర్‌కైనా తక్కువ వ్యయానికే కాల్స్ చేసుకునే సౌకర్యం ఉంటుందని వైబర్ ఒక ప్రకటనలో పేర్కొంది. అంటే అవతలి వారి ఫోన్లో వైబర్ లేకపోయినా ఇది సాధ్యమవుతుందని వివరించింది. వైబర్ అవుట్ అనేది లక్షలాది యూజర్లకు ఏ కాంటాక్ట్నైనా, ఏ సమయంలోనైనా చేరుకునే అవకాశాన్ని కలిగిస్తుందని వైబ్ సీఈవో టాల్మన్ మార్కో పేర్కొన్నారు.