breaking news
VicePresidential Elections
-
భారత ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్.. రేపే ప్రమాణస్వీకారం
ఢిల్లీ: ఇటీవల జరిగిన భారత ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధమైంది. శుక్రవారం ఉదయం (సెప్టెంబర్ 12) ఉదయం 9.30గంటలకు సీపీ రాధాకృష్ణన్ భారత 15వ ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈవారం జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్ధి సీపీ రాధాకృష్ణన్ విజయం సాధించారు. సీపీ రాధాకృష్ణన్ 152 ఓట్ల తేడాతో ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్‌రెడ్డిపై గెలుపొందారు. సీపీ రాధాకృష్ణన్‌కు 452 ఓట్లు రాగా, సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు వచ్చాయి,. ఫలితంగా భారత 15వ ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలో 15 ఓట్లు చెల్లలేదు 98.2 శాతం పొలింగ్ నమోదైంది.ఈ ఎన్నికకు గాను 767 మంది ఎంపీలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. పార్లమెంటు భవనంలోని ‘ఎఫ్-101 వసుధ’లో జరిగిన పోలింగ్‌లో బ్యాటెట్ పత్రాలనే ఉపయోగించారు. రెండో ప్రాధాన్యత ఓటు ఉండటం వల్ల ఈవీఎంలను వాడలేదు. పార్లమెంటు ఉభయసభల సభ్యుల సంఖ్య 788 కాగా ఏడు స్థానాలు ఖాళీ కావడం వల్ల ప్రస్తుతం 781 మందే ఉన్నారు. అయితే పోలింగుకు దూరంగా బీఆర్ఎస్ (4రాజ్యసభ), బీజేడీ(7), శిరోమణి అకాలీదల్(3) దూరంగా ఉన్నాయి. దాంతో 767 మందే ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్డీయేకి 425 మంది సభ్యుల బలం.. ఇతరుల మద్దతు కలిపితే ఆ సంఖ్య మరింత పెరిగింది. ఇక ఇండియా కూటమికి 314 మంది ఎంపీల మద్దతు !మాత్రమే ఉంది. మంగళవారం సాయంత్రం ఐదు గంటల వరకూ పోలింగ్ జరగ్గా, అటు తర్వాత ఓట్ల లెక్కింపు జరిగింది. -
జస్టిస్ సుదర్శన్‌రెడ్డి గెలుపే లక్ష్యంగా..
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: ఉపరాష్ట్రపతి ఎన్నికల వేళ తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ఢిల్లీలో రాజకీయ వ్యూహాలకు పదునుపెట్టారు. మంగళవారం జరగనున్న ఎన్నికల్లో ఇండియా కూటమి ఉమ్మడి అభ్యరి్థ, తెలుగుబిడ్డ జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్న ఆయన, రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలతో ప్రత్యేకంగా సమావేశమై ఎన్నికల వ్యూహాలపై కీలక చర్చలు జరిపారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు రేవంత్‌రెడ్డి క్షుణ్ణంగా దిశానిర్దేశం చేశారు.ముఖ్యంగా, ఇది రహస్య ఓటింగ్ పద్ధతిలో జరిగే ఎన్నిక కాబట్టి, దీనిని ఇండియా కూటమికి అనుకూలంగా ఎలా మలచుకోవాలనే దానిపై ప్రధానంగా చర్చించారు. మిగతా పారీ్టల ఎంపీలతో ఏ విధంగా సమన్వయం చేసుకోవాలి, అంతరాత్మ ప్రబోధం మేరకు ఓటు వేయాలని కోరుతూ ఎవరెవరితో సంప్రదింపులు జరపాలి అనే అంశాలపై సీఎం ఎంపీలకు స్పష్టమైన సూచనలు చేసినట్లు తెలిసింది.రాజ్యాంగ పరిరక్షణకు, ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడిన అభ్యరి్థగా జస్టిస్ సుదర్శన్‌రెడ్డికి ఓటు వేయడం చారిత్రక అవసరమని, ఈ విషయాన్ని ఇతర పార్టీల ఎంపీలకు కూడా నొక్కిచెప్పాలని సూచించారు. తెలుగు వ్యక్తి ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యే ఈ అవకాశాన్ని సది్వనియోగం చేసుకునేలా ఎంపీలందరూ సమష్టిగా పనిచేయాలని సీఎం పిలుపునిచ్చారు. మంగళవారం జరిగే పోలింగ్‌లో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన ఎంపీలకు స్పష్టం చేశారు.రెండు రోజులు ఢిల్లీలోనే సీఎం.. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి మంగళవారం జరగనున్న ఉప రాష్ట్రపతి ఎన్నికలను పర్యవేక్షిస్తారు. వీలును బట్టి పలువురు కేంద్ర మంత్రులను కూడా కలుస్తారు. అలాగే రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ధి ప్రాజెక్టులపై చర్చించేందుకు ప్రధాని మోదీని కూడా కలిసే అవకాశాలున్నాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం అపాయింట్మెంట్ను అడిగినట్టు తెలిసింది. ప్రధాని అపాయింట్మెంట్ లభిస్తే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల గురించి కూడా సీఎం మాట్లాడే అవకాశముందని సమాచారం. మరోవైపు టీపీసీసీ ఆధ్వర్యంలో ఈ నెల 15న కామారెడ్డిలో నిర్వహించనున్న బీసీల సమర భేరి సభకు ఏఐసీసీ పెద్దలను రేవంత్ ఆహ్వానించనున్నట్టు తెలుస్తోంది. -
ఉపరాష్ట్రపతిగా వెంకయ్య గర్వకారణం: వైఎస్ జగన్
హైదరాబాద్: ఉపరాష్ట్రపతిగా విజయం సాధించిన ఎన్డీయే అభ్యర్థి వెంకయ్య నాయుడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. రాజ్యసభ ఛైర్మన్‌గా తెలుగు వ్యక్తి ఉండటం మొత్తం తెలుగు ప్రాంతానికే గర్వకారణం అని అన్నారు. రాజ్యాంగ బద్ధమైన పదవులకు ఏకగ్రీవ ఎన్నిక జరగాలనే ఎల్లప్పుడూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆకాంక్షిస్తుందని చెప్పారు. శనివారం జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా ఘనవిజయం సాధించారు. మొత్తం 781 ఓట్లకుగాను 771ఓట్లు పోలవ్వగా వెంకయ్యనాయుడికి 516 ఓట్లు వచ్చాయి. ప్రతిపక్షాల అభ్యర్థి గోపాలకృష్ణగాంధీకి 244 ఓట్లు రాగా మొత్తం 272 ఓట్ల మెజార్టీతో వెంకయ్యనాయుడు గెలుపొందారు. మరోపక్క, విజయం సాధించిన వెంకయ్యకు గోపాలకృష్ణ గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే, భారత జాతి నిర్మాణంలో వెంకయ్యనాయుడు చాలా అంకితభావంతో పనిచేస్తారని తాను మనస్ఫూర్తిగా నమ్ముతున్నానని పేర్కొంటూ భారత ప్రధాని నరేంద్ర మోదీ వెంకయ్యకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతోపాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వెంకయ్యపై అభినందనల వర్షం కురిపించారు. -
వెంకయ్య ఘన విజయం.. ఇక ఉపరాష్ట్రపతిగా..
న్యూఢిల్లీ : దేశంలో రెండో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఉపరాష్ట్రపతి ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. అనుకున్నట్లుగానే ఎన్డీయే అభ్యర్థి వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా ఘనవిజయం సాధించారు. ప్రతిపక్షాల అభ్యర్థి గోపాల కృష్ణ గాంధీపై 272 ఓట్ల మెజార్టీని సాధించారు. మొత్తం 781 ఓట్లకుగాను 771ఓట్లు పోలవ్వగా వెంకయ్యనాయుడికి 516 ఓట్లు వచ్చాయి. ప్రతిపక్షాల అభ్యర్థి గోపాలకృష్ణకు 244 ఓట్లు వచ్చాయి. శనివారం ఉదయం 10 గంటలకు పార్లమెంట్ ఆవరణలో మొదలైన ఈ ఓటింగ్ ప్రక్రియ, సాయంత్రం 5 గంటలకు ముగిసింది. దీంతో వెంటనే పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభించారు. ప్రస్తుతం ఉప రాష్ట్రపతిగా బాధ్యతలు కొనసాగుతున్న హమీద్ అన్సారీ పదవీకాలం ఈ నెల 10తో ముగియనుంది. దీంతో ఆగస్టు 11న ఆయన భారతదేశానికి 13వ ఉప రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టనున్నారు. రాష్ట్రపతి ఎన్నికల మాదిరిగానే ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా ఎవరి అంచనాలకు అందకుండా వెంకయ్యానాయుడి ఎన్డీయే నాయకత్వం ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, ఈయనపై పోటీ చేసిన మహాత్మాగాంధీ మనవడు, పశ్చిమబెంగాల్ మాజీ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీకి ప్రతిపక్షాలు మద్దతిచ్చాయి. లోక్‌సభలో మెజార్టి ఉన్న ఎన్డీయే అభ్యర్థి వెంకయ్యనాయుడి గెలుపు లాంఛనప్రాయమేనని అనుకున్న విషయం తెలిసిందే. రైతు కుటుంబం నుంచి.. సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన వెంకయ్యనాయుడి ప్రస్థానమంతా చాలా ఆసక్తిగా కనిస్తుంది. ముఖ్యంగా ఆయనకు ఆభరణం మాట. చక్కటి మాటలతో ఆయన ఎవరినైనా మంత్రముగ్దుల్ని చేయగలరు. ఏ అంశాన్నయినా విశ్లేషించగలరు. విద్యార్థి దశ నుంచి తనలో మొలకెత్తిన నాయకత్వ లక్షణాలను పొదివిపట్టుకున్న ఆయన అంచలంచెలుగా ఎదిగి దేశంలోనే రెండో అత్యున్నత పదవిని అందుకున్నారు. సొంత ప్రతిభతోపాటు తాను ఎంతో నమ్ముకున్న పార్టీని కడవరకు అంటిపెట్టుకునే ఉన్నందుకే ఆయనను ఈ అదృష్టం దక్కిందని చెప్పాలి. వెంకయ్య బాల్యం గురించి సంక్షిప్తంగా.. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని చవటపాళెం అనే గ్రామంలో సాధారణ రైతు కుటుంబంలో వెంకయ్యనాయుడు జన్మించారు. చిన్నతనంలోనే ఆయన తల్లి చనిపోవడంతో మేనమామ మస్తాన్‌నాయుడు ఆదరణలో శ్రీరామపురంలో పెరిగారు. అక్కడే పాఠశాలలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసి ఉన్నత చదువుల కోసం నెల్లూరు వెళ్లటానికి సుమారు 6 కి.మీలు నడిచి వెళ్లేవారు. నెల్లూరులో డిగ్రీ వరకు చదివిన ఆయన ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1971 ఏప్రిల్ 14న ఉషమ్మను వివాహం చేసుకున్నారు. రాజకీయాలవైపు.. ప్రతికూల పరిస్థితుల్ని సైతం తనకు అనుకూలంగా మార్చుకునే ఆయన రాజకీయాల్లో అజాత శత్రువనే చెప్పాలి. సమయస్ఫూర్తి, వాగ్ధాటి ఆయన సొంతం లౌక్యం, మాటకారితనం, కష్టపడి పనిచేసే తత్వం ఈ స్థాయికి తీసుకెళ్లాయి. విశాఖపట్నంలో న్యాయవాద విద్య అభ్యసించేటప్పుడు జైఆంధ్రా ఉద్యమంలో పాల్గొని విద్యార్ధి నేతగా మారారు. ఉద్యమంలో అరెస్టై తొలిసారి జైలుకు వెళ్లిన ఆయన తర్వాత జయప్రకాశ్ నారాయణ్(జేపీ) ప్రారంభించిన అవినీతి వ్యతిరేక ఉద్యమంలో భాగంగా రాష్ట్రంలో విద్యార్ధి సంఘర్షణ సమితి పేరుతో కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఉద్యమించి జైలుకు వెళ్లారు. తొలిసారి 1977లో జనతా పార్టీ తరఫున ఒంగోలు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 1978లో ఇందిర ప్రభావం తీవ్రంగా ఉన్న రోజుల్లోనే ఆయన నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి గెలుపొందారు. ఎన్టీఆర్ హయంలో కూడా రెండోసారి విజయం సాధించారు. 1987 డిసెంబర్ 31 నుంచి నాలుగు రోజులపాటు విజయవాడలో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా నిర్వహించిన భారీ బహిరంగ సభలో 45నిమిషాలపాటు వెంకయ్య చేసిన ప్రసంగం నాటి అగ్ర నేతలు వాజ్‌పేయి, అద్వానీలను అమితంగా ఆకర్షించింది. దీంతో ఆయనకు జాతీయ రాజకీయాల్లో ప్రవేశం దొరికినట్లయింది. ఆ తర్వాత ఆయన జాతీయ నేతగా వివిధ పదవులు నిర్వహించారు. వాజపేయి ప్రధానిగా ఉన్నప్పుడు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. రాజకీయ ప్రస్తానం 1973-74 : ఆంధ్రా విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం అధ్యక్షులు 1974-75 : లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ యువజన సంఘర్ష్ సమితి రాష్ట్ర విభాగం కన్వీనర్ 1977-80 : జనతాపార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు 1978-83 : నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా తొలిసారిగా ఎన్నిక 1980-83 : ఏపీ భాజపా రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శి 1983-85 : ఉదయగిరి నియోజకవర్గం నుంచి రెండోసారి శాసనసభకు ఎన్నిక (భాజపా శాసనసభపక్ష నేత) 1988-93 : ఏపీ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు 1993-2000 : భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి 1998 : కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎన్నిక. భాజపా పార్లమెంటరీ కార్యదర్శిగా, పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ కార్యదర్శిగా, పార్టీ అధికార ప్రతినిధిగా వ్యవహరించారు. 1998-99 : హోంమంత్రిత్వ శాఖ పార్లమెంటరీ కమిటీ, వ్యవసాయ కమిటీల్లో సభ్యుడు. 2000-02: వాజ్‌పేయి మంత్రివర్గంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి 2002-04 : భాజపా జాతీయ అధ్యక్షుడు 2004 : కర్ణాటక నుంచి రెండో సారి రాజ్యసభకు ఎంపిక 2014-: నరేంద్ర మోదీ ప్రభుత్వంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ, సమాచార శాఖ మంత్రి. కొన్నాళ్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా కూడా ఉన్నారు. 2016 : రాజస్థాన్ నుంచి రాజ్యసభకు నాలుగోసారి ఎన్నిక 2017 : ఆగస్టు 5న ఉపరాష్ట్రపతిగా ఎన్నిక