Vidhya Balan
-
తన తొలి సంపాదన ఎంతో బయట పెట్టిన విద్యాబాలన్..
ఎవరికైన తొలి సంపాదన చాల ప్రత్యేకమైనది. ప్రస్తుతం స్టార్ నటిగా కోట్ల రూపాయల్లో పారితోషికం అందుకుంటున్న బాలీవుడ్ నటి విద్యాబాలన్ తాజాగా తన తొలి సంపాదన ఎంతో బయటపెట్టారు. ఆమె ప్రస్తుతం ‘షేర్నీ’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా తన తొలి రెమ్యునరేషన్ ఎంతో చెబుతూ అది ఎలా సంపాదించారో వివరించారు. ఆమె మాట్లాడుతూ.. ‘ఓ టూరిస్టు క్యాంపైన్ కోసం మొదటిసారిగా కెమెరా ముందుకు వచ్చాను. నా స్నేహితులు, కజిన్స్‌తో కలిసి ఆ టూరిస్టు క్యాంపైన్ ఫొటోషూట్‌లో పాల్గొన్నాను. ఈ ఫొటోషూట్‌లో మేమంతా ఓ చెట్టు పక్కన నిలుచుని చిరు నవ్వులు చిందిస్తూ ఫొటోకు ఫోజ్ ఇవ్వాలి. అలా ఫొటోలకు ఫోజులిచ్చినందుకు మాకు ఒక్కొక్కరికి 500 రూపాయలు ఇచ్చారు. అదే నా తొలి సంపాదన’ అంటూ విద్యా బాలన్ చెప్పుకొచ్చారు. కాగా విద్యాబాలన్ ‘హమ్ పాంచ్’ సీరియల్‌తో నటిగా పరిశ్రమలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె అప్పటి రోజులను గుర్తుచేసుకున్నారు. ‘హమ్ పాంచ్ సీరియల్ కోసం తొలి అడిషన్ ఇచ్చాను. అప్పుడు మా అమ్మ, సోదరితో కలిసి ఆడిషన్‌కు వెళ్లాను. సుమారు 150 మంది వరకూ ఆడిషన్స్‌కి వచ్చారు. అంతమందిని అక్కడ చూసి ఇక నాకు అవకాశం రాదని ఫిక్స్ అయిపోయాను. అదృష్టం కొద్ది అందులో నటించే ఛాన్స్ నాకు వచ్చింది’ అని ఆమె చెప్పారు. ఇకలేడీ ఓరియెంటెడ్ సినిమాలకు విద్యా బాలన్ కేరాఫ్ అడ్రస్‌గా మారారు. అప్పటి వరకు హీరోయిన్గా కాస్తా అవకాశాలు తగ్గిన విద్యాబాలన్‌కు ‘డర్టీ పిక్చర్’ మూవీతో మళ్లీ సినిమా అవకాశాలు రావడం ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలనే ఎంచుకుంటూ ఆమె వరుసగా అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. -
బాలీవుడ్లో మరో విషాదం
ధర్మశాల : బాలీవుడ్‌ను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. రెండు రోజుల వ్యవధిలోనే ఇర్ఫాన్ ఖాన్, రిషి కపూర్లను కోల్పోయిన బాలీవుడ్‌కు మరో షాక్ తగిలింది. ప్రముఖ నిర్మాత, టెలివిజన్ అండ్ సినిమా ప్రొడ్యూసర్ గిల్డ్ ఆఫ్ ఇండియా సీఈవో కుల్మీత్ మక్కర్(60) శుక్రవారం ఉదయం గుండెపోటుతో మరణించారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాలలోని ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కుల్మీత్ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. లాక్డౌన్ విధించకముందే ఇంట్లోనే గుండెపోటుకు గురైన కుల్మీత్ అప్పటినుంచి ధర్మశాలలోని ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. (‘మీ దగ్గరికి వచ్చే దాకా మిమ్మల్ని మిస్ అవుతాను’) ఈ సందర్భంగా పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఆయన మృతి పట్ల ట్విటర్ వేదికగా తమ నివాళి ప్రకటించారు. కాగా నివాళులు అర్పించిన వారిలో బాలీవుడ్ నటి విద్యాబాలన్, ప్రముఖ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహర్, దర్శకులు హన్సల్ మెహతా, సుభాష్ గాయ్ తదితరులు ఉన్నారు. బాలీవుడ నటి విద్యాబాలన్ స్పందిస్తూ.. ' ఇది నిజంగా షాకింగ్.. ఇండస్ట్రీకి మీరు అందించిన సేవలు ఎప్పటికి గుర్తుంచుకుంటాం. మా కన్నీటితో ఇవే మీకు మా ఘన నివాళులు. నా తరపున మీ కుటుంబసభ్యులకు ప్రగాడ సానభూతి తెలియజేస్తున్నా' అంటూ ట్వీట్ చేశారు. ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ స్పందిస్తూ.. ' ప్రొడ్యూసర్ గిల్డ్ ఆఫ్ సీఈవోగా మీరు నిస్వార్థ సేవలందించారు. పని పట్ల మీకున్న విశ్వసనీయతను ఎల్లప్పుడు గుర్తుంచుకుంటాం. అలాంటి మీరు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్లడం చాలా బాధాకరం. మీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా' అంటూ ట్వీట్ చేశారు. (ఆసుపత్రిలో ఆశీస్సులు అందిస్తోన్న రిషి కపూర్) 'అసలు బాలీవుడ్‌కు ఏమైంది.. వరుస విషాదాలు మమ్మల్ని వెంటాడుతున్నాయి. కుల్మీత్ మక్కర్ ! మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా' అంటూ దర్శకుడు హన్సల్ మెహతా పేర్కొన్నారు. మక్కర్ మూడు దశాబ్ధాలుగా ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్‌లోనే ఉన్నారు. కుల్మీత్ సినిమా, టెలివిజన్ ఫీల్డ్‌లో ఎన్నో పదవులను స్వీకరించారు. కుల్మీత్ సారేగమా, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్లో వివిధ హోదాల్లో పని చేశారు. బిగ్ మ్యూజిక్ అండ్ హోమ్ ఎంటర్టైన్మెంట్ను స్థాపించి కొంతకాలం సీఈవోగా పనిచేశారు. ప్రస్తుతం ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా సీఈవోగా ఉన్నారు. pic.twitter.com/Q6iw17DhRv — vidya balan (@vidya_balan) May 1, 2020 Kulmeet you were such an incredible pillar to all of us at the Producers Guild of India....relentlessly working for the industry and towards its enhancement and advancement... you left us too soon...We will miss you and always Remember you fondly.... Rest in peace my friend... pic.twitter.com/GUcapyjfMo — Karan Johar (@karanjohar) May 1, 2020 -
'నాతో చేయి కలపండి.. వారికి సాయం చేద్దాం'
-
'నాతో చేయి కలపండి.. వారికి సాయం చేద్దాం'
ముంబై : కరోనా మహమ్మారిపై పోరాటం చేస్తున్న వైద్యులు, సిబ్బంది కోసం వెయ్యి పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ (పీపీఈ) కిట్లను విరాళంగా ఇవ్వనున్నట్లు బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ పేర్కొంది. ఈ సందర్భంగా తన ఫేస్బుక్లో ఒక వీడియోను షేర్ చేసింది. ఆ వీడియోలో.. ' కోవిడ్-19పై వైద్యులు చేస్తున్న పోరాటం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. దేశ సైనికులు బోర్డర్లో నిలబడి దేశ కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి మనకోసం కోసం కాపలా కాస్తున్నారు. ఇప్పుడు కరోనాపై యుద్దం చేస్తున్న వైద్యులు కూడా అలాగే కనిపిస్తున్నారు. కరోనా రోగులతో వైద్యులు క్షణం తీరిక లేకుండా కాలం గడుపుతున్నారు. వీరిలో ప్రాణాంతక వైరస్ ఒక్కరికి సోకినా అది పెద్ద ప్రమాదానికి తీస్తుంది. దీంతో పాటు క్వారంటైన్లో ఉండే వారి సంఖ్య పెరిగి ఆసుపత్రులు నిండిపోతాయి. మనకోసం ఇంతచేస్తున్న వైద్యులను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. అందుకోసమే పీపీఈ కిట్ల కోసం నిధుల సేకరణక మొదలు పెట్టాను. నాకు తోడుగా సినీ నిర్మాత మనీష్ ముంద్రా, ఫోటోగ్రాఫర్ అతుల్ కస్బేకర్ అండగా ఉన్నారు. రండి నాతో చేయి కలపండి.. మీ అందరి సహకారం ఉంటే మన హీరోలకు మరింత సాయం చెయ్యొచ్చు' అంటూ విద్యాబాలన్ చెప్పుకొచ్చింది. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 26వేలకు చేరుకోగా, 800కు పైగా మృతి చెందారు. (మా ఇంటికాడ కరోనా పరీక్షలా?) -
మేడమ్.. థ్యాంక్యూ: విద్యాబాలన్
ముంబై : కరోనాను అంతం చేసేందుకు ఎన్ని చర్యలు చేపట్టినా.. రోజురోజుకీ కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ మహమ్మారీ వ్యాప్తిని నిరోధించడానికి దేశంలో లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రజలంతా ఇళ్లలోనే కుటుంబంతో గడుపుతుంటే కేవలం అత్యవసర సేవల్లో పనిచేసే వారు మాత్రం తమ ప్రాణాలను పణంగా పెట్టి పని చేస్తున్నారు. కరోనా తమల్ని కాటేస్తుందని తెలిసినా.. వైద్యులు, పోలీసులు, జర్నలిస్టులు, బ్యాంకు అధికారులు నిరంతరంగా పనిని కొనసాగిస్తున్నారు. ఈ జాబితాలోపారిశుద్ధ్య కార్మికులు కూడా ఉన్నారు. (ఫ్యాన్ శుభ్రం చేయడానికి స్టూల్ అవసరమా: హీరో ) తాజాగా వీరి సేవలను బాలీవుడ్ నటి విద్యాబాలన్ అభినందించారు. ముంబైలో ఓ మహిళ పారిశుద్ధ్య కార్మికురాలు రోడ్డుపై ఉన్న చెత్తను తొలగిస్తున్నారు. తన బాల్యనీ నుంచి ఆమెను చూసిన విద్యా.. ‘మేడమ్ థాంక్యూ.. గాడ్ బ్లెస్ యూ’ అంటూ మహిళకు వినపడేలా అరిచారు. అంతేగాకుండా ఆమె పనిచేస్తుండగా ఫోటో తీసి దానిని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘కరోనా భయం ఉన్నా.. మరో పక్క తమ విధులను నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. మిమ్మల్నీ, మీ కుంటుంబాన్ని ఆ దేవుడు ఎల్లప్పుడు ఆశీర్వదిస్తాడు.’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవ్వడంతో విద్యా చేసిన పనిని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. అలాగే మరో వీడియోలో విద్యాబాలన్ తన ఫాలోవర్స్‌కు ఇంటి పనులను కుటుంబ సభ్యులందరూ పంచుకోవాలని కోరారు, తద్వారా పని భారమంతా ఒక వ్యక్తిపై పడకుండా ఉంటుందని సూచించారు. (ఆడపులిలా బాలీవుడ్ భామ) -
ఇందిరాగాంధీగా విద్యాబాలన్
తమిళ సినిమా: నటి విద్యాబాలన్ తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీగా మారనున్నారు. అలనాటి శృంగార తార సిల్క్‌స్మిత జీవిత చరిత్రతో తెరకెక్కించిన దర్టిపిక్చర్స్ చిత్రంలో నటించి జాతీయ అవార్డును అందుకున్న విద్యాబాలన్ తాజాగా ఇందిరాగాంధీ జీవిత చరిత్రలో నటించనున్నారు. మహాత్మాగాంధీ హత్య ఉదంతం అనంతరం అంతకుపైగా కలకలం పుట్టించిన దుర్ఘటన ఇందిరాగాంధీ దారుణ హత్య. 16 ఏళ్లుగా భారత ప్రధాన మంత్రిగా పరిపాలించిన ఏకైక మహిళా ప్రధానిగా కీర్తిగడించిన ఇందిరా గాంధీ 1984 అక్టోబర్ 31 ఢిల్లీలోని తన స్వగృహంలో, తన సెక్యూరిటీ చేతే కాల్చబడి నేలకూలిన సంఘటన దేశాన్ని కదలించింది. కాగా అలాంటి అత్యంత శక్తివంతమైన మహిళా ప్రధానిగా పేరుగాంచిన ఇందిరాగాంధీ జీవిత చరిత్రను బుల్లితెర నిర్మాత, రచయిత్రి సహారిక పుస్తకంగా రచించారు. ఈ నవలను నటి విద్యాబాలన్, రాయ్‌కపూర్ పొడెక్షన్స్‌తో కలిసి చిత్రంగా రూపొందించడానికి హక్కులను పొందారు. ఈ విషయాన్ని రచయిత సహారికా తన ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నట్లు సమాచారం. -
ఆ పాత్రకు విద్యా 18 కోట్లు తీసుకుందట!
తమిళసినిమా: హీరోయిన్ల పారితోషికం కోటి దాటితేనే అమ్మో అంటారు. అయితే బాలీవుడ్లో ఈ సంఖ్య ఏప్పుడో దాటిపోయింది. 18 కోట్లకు ఇప్పటి వరకు ఎవరూ చేరలేదు. ఇప్పుడు విద్యాబాలన్ ఆ మొత్తానికి చేరువైనట్లు తెలుస్తోంది. ది దర్టీ పిక్చర్ తర్వాత బాలీవుడ్లో ఈ బెంగళూరు భామ క్రేజే వేరు. ఆ సినిమాలో పిచ్చపిచ్చగా అందాలను ఆరబోసిన విద్యాబాలన్‌ను జాతీయ అవార్డు వరించింది. ఆ తర్వాత వచ్చిన కహానీ సంచలన విజయం సాధించడంతో విద్యాబాలన్ మార్కెట్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆ తర్వాత నటించిన చిత్రాలు విద్యాబాలన్‌ను నిరాశపరిచాయనే చెప్పాలి. ఆమె నటించిన హమారి ఆదురి కహానీ చిత్రం ఆశించిన విజయం సాధించలేదు. అయినా ఆమె మార్కెట్ తగ్గలేదు. హిందీలో ఇందిరగాంధీ జీవిత చరిత్రతో చిత్రం తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో ఇందిరాగాంధీ పాత్ర పోషించడానికి నటి విద్యాబాలన్‌కు రూ.18 కోట్లు పారితోషికం ఇవ్వడానికి సిద్ధమయ్యారని సమాచారం. విద్యాబాలన్‌కు ఇటీవల విజయాలు లేకపోయినా నిజ జీవిత పాత్రలను అవగాహన చేసుకుని వాటిలో జీవించడంలో ఆమెకు ఆమేసాటి అనే పేరుండడంతో మార్కెట్‌కు డోకా లేకుండా పోయిందని సినీ వర్గాల భావన. అయితే ఇందిరాగాంధీ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెలువడాల్సి ఉంది. -
కమల్ హసన్, గోపీచంద్ కు పద్మభూషణ్ ప్రదానం