ముంబై : కరోనా మహమ్మారిపై పోరాటం చేస్తున్న వైద్యులు, సిబ్బంది కోసం వెయ్యి పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్ (పీపీఈ) కిట్లను విరాళంగా ఇవ్వనున్నట్లు బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ పేర్కొంది. ఈ సందర్భంగా తన ఫేస్‌బుక్‌లో ఒక వీడియోను షేర్ చేసింది. ఆ వీడియోలో.. ' కోవిడ్-19పై వైద్యులు చేస్తున్న పోరాటం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. దేశ సైనికులు బోర్డర్‌లో నిలబడి దేశ కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి మనకోసం కోసం కాపలా కాస్తున్నారు. ఇప్పుడు కరోనాపై యుద్దం చేస్తున్న వైద్యులు కూడా అలాగే కనిపిస్తున్నారు. కరోనా రోగులతో వైద్యులు క్షణం తీరిక లేకుండా కాలం గడుపుతున్నారు. వీరిలో ప్రాణాంతక వైరస్ ఒక్కరికి సోకినా అది పెద్ద ప్రమాదానికి తీస్తుంది. దీంతో పాటు క్వారంటైన్‌లో ఉండే వారి సంఖ్య పెరిగి ఆసుపత్రులు నిండిపోతాయి. మనకోసం ఇంతచేస్తున్న వైద్యులను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. అందుకోసమే పీపీఈ కిట్ల కోసం నిధుల సేకరణక మొదలు పెట్టాను. నాకు తోడుగా సినీ నిర్మాత మనీష్ ముంద్రా, ఫోటోగ్రాఫర్ అతుల్ కస్‌బేకర్ అండగా ఉన్నారు. రండి నాతో చేయి కలపండి.. మీ అందరి సహకారం ఉంటే మన హీరోలకు మరింత సాయం చెయ్యొచ్చు' అంటూ విద్యాబాలన్ చెప్పుకొచ్చింది. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 26వేలకు చేరుకోగా, 800కు పైగా మృతి చెందారు.
(మా ఇంటికాడ కరోనా పరీక్షలా?)
Comments
Please login to add a commentAdd a comment