జైపూర్: కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది ఎన్నో పెళ్లిల్లు ఆగిపోయాయి. కోవిడ్ కారణంగా సామాన్యులు పెళ్లి ఆలోచన మానేస్తే.. సెలబ్రిటీలు మాత్రం పెళ్లి పీటలేక్కారు. ఇక మహమ్మారి విజృంభణ కాలంలో వివాహం చేసుకున్న వారు కోవిడ్ నియమాలను పాటిస్తూ.. పెళ్లి తంతు ముగించారు. ప్రస్తుతం ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. కోవిడ్ కేర్ సెంటర్‌లో.. పీపీఈ కిట్లు ధరించి.. చేసుకున్న ఓ పెళ్లికి సంబంధించిన వీడియో నెటిజనులను ఆకట్టుకుంటుంది. రాజస్తాన్ కెల్వారా కోవిడ్ కేర్ సెంటర్‌లో ఈ వివాహ వేడుకు చోటు చేసుకుంది. వివరాలు.. రాజస్తాన్‌కు చెందిన ఓ యువతికి కొద్ది రోజుల క్రితం వివాహం నిశ్చయమయ్యింది. తీరా పెళ్లి ముహుర్తం సమీపించాక ఆమెకి కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. దాంతో కరోనా కేర్ సెంటర్‌లో జాయిన్ చేశారు. విషయం తెలుసుకున్న వరుడు.. పెళ్లిని వాయిదా వేయడం ఇష్టం లేక ముందుగా అనుకున్న ముహుర్తానికే యువతి మెడలో మూడు ముళ్లు వేశాడు. (వధువుకు కరోనా: అయినా పెళ్లి ఆగలేదు)
వధువు, వరుడు, పూజారితో పాటు మరోక వ్యక్తి ఈ వివాహానికి హాజరయ్యారు. ఇక వధువుకు కరోనా సోకడంతో ఆమెతో పాటు, పెళ్లి కుమారుడి, పూజారి, మరో వ్యక్తి నలుగురు పీపీఈ కిట్లు ధరించారు. ఇక వరుడు ఫేస్ షీల్డ్ కూడా ధరించాడు. పూజారి చెప్పిన విధంగా పీపీఈ కిట్లు ధరించి పెళ్లి తంతు ఆచరించారు. మూడ ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. పీపీఈ కిట్లు ధరించి.. కోవిడ్ నియమాలు పాటిస్తూ.. జరిగిన ఈ వేడుక నెజినులను ఆకట్టుకుంది. కొత్త జంటను ఆశీర్వదించడమే కాక ప్రశంసిస్తున్నారు నెటిజనులు.
Comments
Please login to add a commentAdd a comment