విద్యార్థులను మోసం చేసిన విద్యోదయ అకాడమీ
హైదరాబాద్: నల్లకుంటలోని విద్యోదయ అకాడమీ పదవ తరగతి విద్యార్థులను మోసం చేసింది. పదవ తరగతి తప్పిన విద్యార్థులను ఉత్తీర్ణులను చేయిస్తానని ఆ సంస్థ 400 మందికి కుచ్చుటోపీ పెట్టింది. ఒక్కొక్క విద్యార్థి నుంచి 4 వేల రూపాయల నుంచి 8 వేల రూపాయల వసూలు చేశారు.
ఆ తరువాత ఆ సంస్థ నిర్వాహకులు పరారయ్యారు. బాధిత విద్యార్థులు నల్లకుంట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి నిర్వాహకుల కోసం గాలిస్తున్నారు.