పెన్ కెమెరాతో శ్రీవారి ఆలయంలోకి ప్రవేశం
విజిలెన్స్ ఇన్స్పెక్టర్ నిర్వాకం
సాక్షి, తిరుమల: బాధ్యతాయుతమైన విధుల్లో ఉంటూ పెన్ కెమెరాతో శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించిన విజిలెన్స్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు సోమవారం బదిలీ అయ్యారు. 4 నెలల కింద ఆయన ఏపీఎస్పీ పోలీసు విభాగం నుంచి టీటీడీకి బదిలీ అయ్యారు. ఈనెల 15న శుక్రవారం టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా పెన్కెమెరాతో ఆలయంలోకి ప్రవేశించారు. దీన్ని గుర్తించిన ఇతర విజిలెన్స్ సిబ్బంది కెమెరాను స్వాధీనం చేసుకుని పరిశీలించారు.