Vignan rattaiah
-
వైఎస్ఆర్ సీపీలోకి ఊపందుకున్న వలసలు
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ఊపందుకున్నాయి. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మాజీ ఎమ్మెల్యే గంటా మురళీ రామకృష్ణ తన అనుచరులతో కలిసి శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ విజయానికి తనవంతు కృషి చేస్తానన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డితోనే సీమాంధ్రలో అభివృద్ధి జరుగుతుందన్నారు. కాగా గంటా మురళికి మంచి పట్టు ఉండటంతో ఆయన చేరికతో చింతలపూడి నియోజకవర్గంలోని కాకుండా పశ్చిమ గోదావరి జిల్లాలో వైఎస్ఆర్ సీపీ మరింత బలపడనుంది. కాగా విజ్ఞాన్ సంస్థలు అధినేత లావు రత్తయ్య కూడా ఇవాళ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ సీపీలో చేరారు. -
వైఎస్ఆర్ సీపీలో చేరిన విజ్ఞాన్ రత్తయ్య
హైదరాబాద్ : విజ్ఞాన్ సంస్థల చైర్మన్ లావు రత్తయ్య శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో లోటస్ పాండ్లో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్లో చేరారు. ఈ సందర్భంగా రత్తయ్య మాట్లాడుతూ సీమాంధ్ర అభివృద్ధికి బలమైన నాయకత్వం కావాలని, అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరానన్నారు. తాను టికెట్ ఆశించి పార్టీలో చేరలేదని, వైఎస్ఆర్ సీపీ విజయానికి కృషి చేస్తానన్నారు. ప్రస్తుతం ఉన్న టీడీపీలో సహజత్వం కోల్పోయిందని.... కాంగ్రెస్ వలసలతో ఆపార్టీ నిండిపోయిందని రత్తయ్య వ్యాఖ్యానించారు.