Vijay Bahadur Pathak
-
యూపీ చుట్టూ మోదీ చక్కర్లు
లక్నో: వచ్చే నెలలో ఉత్తరప్రదేశ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ రెండుసార్లు పర్యటించనున్నారు. బీజేపీ రాష్ట్ర యూనిట్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న పలు కార్యక్రమాల్లో మోదీ పాల్గొననున్నట్టు మంగళవారం ఆ పార్టీ వర్గాలు అధికారకంగా వెల్లడించాయి. ఏప్రిల్ 14న రాజ్యంగ పితామహుడు, దళితులకు స్పూర్తిప్రధాత, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జన్మదినం సందర్భంగా పలు కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అంబేద్కర్ జన్మదిన కార్యక్రమాల్లో ప్రధాని మోదీ పాల్గొనున్నారు. అంబేద్కర్ జన్మదినం నుంచి మొదలుకుని ఈ కార్యక్రమాలు ఏప్రిల్ 24 అగ్రాలో జరిగే కార్యక్రమంతో ముగుస్తాయని బీజేపీ పార్టీ అధికార ప్రతినిధి విజయ్ బహదూర్ పట్నాయక్ మీడియాకు తెలిపారు. 2014 ఎన్నికల అనంతరం రాజకీయంగా ఎదురుదెబ్బలు తగలడంతో దళితుల ఓట్లు చేజారియే ప్రమాదం ఉందని భావించిన బీజేపీ.. 2017 అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా పార్టీ ప్రచారం జోరుగా నిర్వహించాలని యోచిస్తోంది. -
'ముందు మీరు ఆత్మపరిశీలన చేసుకోండి'
లక్నో: తమను విమర్శించే ముందు ఆత్మపరిశీలన చేసుకోవాలని సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ కు బీజేపీ సూచించింది. కేంద్రంలో మూడు నెలల ఎన్డీఏ పాలనను నిందించేముందు ఉత్తరప్రదేశ్ లో 30 నెలల పాలనపై ఆత్మపరీక్ష చేసుకోవాలని ములాయంకు బీజేపీ అధికార ప్రతినిధి విజయ్ బహదుర్ పాఠక్ సూచించారు. 30 నెలల్లో హామీలు నెలబెట్టుకోని సమాజ్‌వాది పార్టీ ప్రభుత్వం మూడు నెలల ఎన్డీఏ పాలనను తప్పుబట్టడం హాస్యాస్పదమని అన్నారు. ఎన్నికల హామీలను నిలబెట్టుకోవడంలో నరేంద్ర మోడీ విఫలమయ్యారంటూ ములాయం చేసిన విమర్శలను పాఠక్ తప్పుబట్టారు. -
అఖిలేష్‌కు క్లీన్ చీట్ ఎలా ఇస్తారు:బీజేపీ
సమాజవాది పార్టీ అధ్యక్షుడు, లోక్‌సభ సభ్యుడు ములాయం సింగ్ యాదవ్ తన కుమారుడు, యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌కు క్లీన్ చీట్ ఇవ్వడం పట్ల భారతీయ జనతపార్టీ బుధవారం లక్నోలో మండిపడింది.ముజఫర్‌నగర్ అల్లర్ల వల్ల దాదాపు 40 మంది మరణించిన నేపథ్యంలో అఖిలేష్‌కు ఎలా క్లీన్ చీట్ ఇస్తారని యూపీ రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి విజయ్ బహుదుర్ పాథక్ ప్రశ్నించారు. ముజఫర్‌నగర్ అల్లర్లు మత ఘర్షణలుగా ములాయం వ్యాఖ్యానించడం పట్ల విజయ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దాదాపు రెండు దశాబ్దాల క్రితం రాష్ట్రంలో నెలకొన్న సంఘటనలు అఖిలేష్ ప్రభుత్వ హయాంలో పునారావృతం అయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇటీవల కాలంలో చోటు చేసుకున్న అత్యంత విషాధకరమైన సంఘటనగా ముజఫర్‌నగర్ అల్లర్లు అని ఆయన అభివర్ణించారు. అయితే ఇప్పటికే బీజేపీ జాతీయ నాయకత్వం యూపీలోని అఖిలేష్ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. అందులోభాగంగా యూపీ గవర్నర్‌ను కలసి అఖిలేష్ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని వినతి పత్రాన్ని ఆ రాష్ట్ర బీజేపీ కార్యవర్గం ఆందజేసింది. సెప్టెంబర్ 16 నుంచి యూపీ వర్షకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ముజఫర్‌నగర్ అంశాన్ని సభలో లేవనెత్తుతామని బీజేపీ ప్రకటించింది. ముజఫర్‌నగర్‌లో శనివారం చోటు చేసుకున్న అల్లర్ల వల్ల దాదాపు 40 మంది మరణించగా, మరో 1000 మంది వరకు గాయపడ్డారు. ముజఫర్‌నగర్‌లో జరిగిన అల్లర్లపై ఎస్పీ అధినేత ములాయం సింగ్ మంగళవారం ఆగ్రాలో తన కుమారుడు అఖిలేష్‌కు క్లీన్ చీట్ ఇవ్వడంపై బీజేపీ బుధవారంపై విధంగా స్పందించింది. అయితే ముజఫర్‌నగర్‌లో ఏ రాజకీయనాయకుడు పర్యటించకుండా ఉండేలా అఖిలేష్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.