Vijay Shah
-
ఒక్క హెయిర్ కటింగ్‌తో 60 వేల రూపాయలు!
భోపాల్: ఇటీవల కాలంలో రాజకీయ నాయకులు స్వార్థ ప్రయోజనాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. కానీ కొందరు రాజకీయ నాయకులు మాత్రం సేవా భావంతో ఆదర్శంగా నిలుస్తున్నారు. తాజాగా మధ్యప్రదేశ్‌కు చెందిన రోహిదాస్ హెయిర్ సెలూన్ షాప్ పెట్టడానికి మధ్యప్రదేశ్ అటవీశాఖ మంత్రి విజయ్ షాను ఆశ్రయించాడు. అయితే కటింగ్‌లో రోహిదాస్ నైపుణ్యం తెలుసుకోవడానికి హెయిర్ కటింగ్, షేవింగ్ చేయమని రోహిదాస్‌ను మంత్రి విజయ్ షా కోరారు. దీంతో కరోనా నేపథ్యంలో మాస్క్ ధరించి అద్భుతంగా కటింగ్ చేశాడు. రోహిదాస్ నైపుణ్యానికి ముగ్ధుడైన మంత్రి సంతోషంతో రూ.60,000 ఆర్థిక సహాయం చేశారు. ఈ అంశంపై విజయ్ షా స్పందిస్తూ కరోనా ఉదృతి నేపథ్యంలో గత కొన్ని నెలలుగా యువత ఉద్యోగాలు కోల్పోయారని తెలిపారు. కరోనా ప్రభావం ఉన్నా నిబంధనలు (మాస్క్‌లు) పాటించి సంతోషంగా హెయిర్ కటింగ్ చేసుకోవచ్చని అన్నారు. మరోవైపు చిన్న వ్యాపారాలు చేయాలనుకునే యువతకు ప్రభుత్వం రుణ సహాయం చేస్తుందని పేర్కొన్నారు. -
హాజరు పలికేటప్పుడు జైహింద్ అనాల్సిందే
భోపాల్, మధ్యప్రదేశ్ : మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివ్‌రాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి పాఠశాలల్లో విద్యార్థులు హాజరు పలికేటప్పుడు జైహింద్ అనడం తప్పనిసరి చేస్తూ విద్యాశాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. సాత్నా జిల్లాలో తొలుత దీనిని ప్రయోగాత్మకంగా చేపట్టిన విద్యాశాఖ.. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా ఈ నిర్ణయాన్ని అమలు చేయనుంది. ఇందుకు సంబంధించి మధ్యప్రదేశ్ విద్యాశాఖ మంత్రి విజయ్ షా గత డిసెంబర్లోనే కసరత్తు ప్రారంభించారు. ఇదే అంశంపై విజయ్ మాట్లాడుతూ.. ఇకపై ప్రభుత్వ పాఠశాలలో ఇక నుంచి విద్యార్థులు ‘యస్ సార్, యస్ మేడమ్’కు బదులు జైహింద్ అనాలని పేర్కొన్నారు. దీని ద్వారా విద్యార్థుల్లో దేశ భక్తి భావం పెరుగుతోందని తెలిపారు. ఈ నిర్ణయాన్ని ఎవరు వ్యతిరేకిస్తారని అనుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షా ఇరవై రెండు వేల ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నిబంధన అమల్లోకి వస్తుందని వెల్లడించారు. ప్రైవేటు పాఠశాలలకు దీనికి సంబంధించిన ఆదేశాలను జారీ చేయనున్నట్టు తెలిపారు. -
పాము కరిచిందనే అనుమానంతో మంత్రిని ఆస్పత్రికి తరలింపు!
భోఫాల్: పాము కాటుకు గురైనారనే అనుమానంతో మంత్రిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్ లో పౌర సరఫరాల శాఖాను నిర్వహిస్తున్న విజయ్ షా పాముకాటుకు గురయ్యారు. పాము కాటుకు గురైన మంత్రిని ప్రభుత్వ జేపీ ఆస్పత్రికి తరలించారు. పాముకాటుకు గురయ్యారా లేక విష కీటకం కుట్టిందా అనే విషయంపై ఇంకా నిర్ధారణకు రాలేదని జేపీ ఆస్పత్రి ముఖ్య వైద్యాదికారి పంకజ్ శుక్లా తెలిపారు. ఈ ఘటన ఆదివారం తెల్లవారు జామున 3.30 నిమిషాలకు జరిగిందన్నారు. మంత్రి షాను ఐసీయూకి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి బాగానే ఉంది. ఆందోళన పడాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు.