vijaya rama raju
-
బాధ్యతలు స్వీకరించిన రామరాజు
రాజమండ్రి సబ్ కలెక్టర్‌గా ఐఏఎస్ అధికారి విజయరామరాజు సోమవారం బాధ్యతలు స్వీకరించారు.ఈ స్థానంలో ఐఏఎస్ అధికారిని నియమించడం ఏడేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడే.. కోటగుమ్మం(రాజమండ్రి) : పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు కృషి చేస్తామని రాజమండ్రి సబ్ కలెక్టర్ వి.విజయరామరాజు పేర్కొన్నారు. సోమవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. శిక్షణ అనంతరం ఆయనకు తొలి పోస్టింగ్ ఇక్కడే కావడం విశేషం. ఏడేళ్ల అనంతరం రాజమండ్రి సబ్ కలెక్టర్‌గా ఒక ఐఏఎస్ అధికారి వచ్చారు. 2007లో కోన శశిధర్ విధులు నిర్వహించారు. అనంతరం ఆర్డీఓలుగా గ్రూప్-1 ఆఫీసర్లు బాధ్యతలు నిర్వర్తించారు. ఈ సందర్భంగా విజయ రామరాజు విలేకరులతో మాట్లాడారు. ‘‘మా స్వస్థలం విశాఖపట్నం. సీతమ్మధారలో ఉండేవాళ్లం. పదోతరగతి, ఇంటర్ అక్కడే చదివాను. ఐఆర్టీఎస్ రైల్వే ట్రాఫిక్ ఆఫీసర్‌గా చేస్తూనే ఐఏఎస్‌కు ప్రిపేర్ అయ్యాను. 2012 బ్యాచ్‌కు చెందిన నేను లాల్ బహుదూర్ శాస్త్రి అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ముస్సోరిలో శిక్షణ పొందాను. సమస్యలను అర్థం చేసుకొని కలెక్టర్, జాయింట్ కలెక్టర్ల సలహాలు తీసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తా. రెవెన్యూ సర్వీసులు కంప్యూ టరీకరించి వచ్చిన ఫిర్యాదులు సకాలంలో పరిష్కరిస్తా. పుష్కరాల పనులను పరిశీలించి కొన్నింటికి మార్పులు చేయవలసి వస్తే చేస్తా’’మని విజయరామరాజు తెలిపారు. రెవెన్యూ అసోసియేషన్ అభినందన విజయ రామరాజును రెవెన్యూ అసోసియేషన్ సభ్యులు కలసి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. రెవెన్యూ అసోసియేషన్ సంఘం అధ్యక్షుడు జి.డి. కిషోర్ బాబు, కార్యదర్వి కేవీ రమణ, ట్రెజరర్ పాపారావు, వైస్ ప్రెసిడెంట్ కాంతి ప్రసాద్, ఇతర రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. -
'విజయ' రామ రాజు గోరి డైరీ
-
అటవీ సిబ్బందికి ఆయుధాలు
సాక్షి, హైదరాబాద్: స్మగ్లర్ల దాడులను ఎదుర్కొనేందుకు అటవీ సిబ్బందికి ఆయుధాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. అటవీ సంపద పరిరక్షణ కోసం పాటుపడుతున్న సిబ్బందిపై స్మగ్లర్ల దాడులు పెరిగిపోతున్నాయని, ఈ నేపథ్యంలో అటవీ సిబ్బందికి ఆయుధాలు సమకూర్చాలని, సాయుధ పోలీసు బృందాలను సహాయంగా పంపాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఆదివారం హైదరాబాద్‌లోని జవహర్లాల్ నెహ్రూ జంతు ప్రదర్శన శాల స్వర్ణోత్సవాల ప్రారంభ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. మీరాలం చెరువు శుద్ధి, అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. అటవీశాఖ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు, అటవీ దళాల అధిపతి బీఎస్ఎస్ రెడ్డి తదితరులు ప్రసంగించారు. జూ పార్క్ ప్రవేశద్వారం వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన జవహర్లాల్ నెహ్రూ విగ్రహాన్ని, జూ స్వర్ణోత్సవ స్తూపాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. స్క్విరెల్ మంకీ, తెల్ల, నల్ల హంసల ప్రదర్శనశాలలను ప్రారంభించారు. పోస్టల్ శాఖ రూపొందించిన జూ స్వర్ణోత్సవ ప్రత్యేక కవర్, జూ సావనీర్లను విడుదల చేశారు. జూ సిబ్బందికి ప్రోత్సాహకాలు, 59వ వన్యప్రాణి సప్తాహం సందర్భంగా నిర్వహించిన పోటీల్లో విజేతలైన విద్యార్థులకు జ్ఞాపికలు అందజేశారు. పులులను దత్తత తీసుకున్న ఎస్బీహెచ్ తరఫున బ్యాంకు అధికారి భగవంతరావు రూ.15 లక్షల చెక్కును జూకు అందించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మోజం అలీఖాన్, ఎమ్మెల్సీ రంగారెడ్డి, అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శామ్యూల్, వన్యప్రాణి సంరక్షణ విభాగం అధిపతి జోసెఫ్, జంతు ప్రదర్శనశాలల డెరైక్టర్ మల్లికార్జునరావు, పోస్ట్‌మాస్టర్ జనరల్ సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు. -
శత్రుచర్ల ఇంటిపై సమైక్యవాదుల దాడి
విజయనగరం: తెలంగాణ నోట్‌ను కేంద్ర కేబినెట్ ఆమోదించడంతో జిల్లాలో సమైక్యవాదులు ఆగ్రహోదగ్రులయ్యారు. ఆ వార్తలు తెలిసిన వెంటనే ఉద్యోగులు, విద్యార్థులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. దీనిలో భాగంగా విజయనగరం జిల్లా పార్వతీపురంలో మంత్రి శత్రుచర్ల విజయ రామరాజు ఇంటిపై సమైక్యవాదులు దాడి చేశారు. అక్కడి ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. శాంతిభద్రతల కోణంలో పోలీసులు విజయనగరం జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. సమైక్య్యాంధ్ర జిల్లాల్లో నిరసన జ్వాలలు తీవ్రరూపం దాల్చాయి. సమైక్యాంధ్ర నిరసనకారులు కొవ్వొత్తులతో మానవహారంగా ఏర్పడి కేసీఆర్, సోనియా గాంధీలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. వారి దిష్టిబొమ్మలను దహ నం చేశారు. సీమాంధ్ర నేతల చేతకానితనం కారణంగానే రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు దాపురించాయని వారు మండిపడుతున్నారు.