విజయనగరం: తెలంగాణ నోట్‌ను కేంద్ర కేబినెట్ ఆమోదించడంతో జిల్లాలో సమైక్యవాదులు ఆగ్రహోదగ్రులయ్యారు. ఆ వార్తలు తెలిసిన వెంటనే ఉద్యోగులు, విద్యార్థులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. దీనిలో భాగంగా విజయనగరం జిల్లా పార్వతీపురంలో మంత్రి శత్రుచర్ల విజయ రామరాజు ఇంటిపై సమైక్యవాదులు దాడి చేశారు. అక్కడి ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. శాంతిభద్రతల కోణంలో పోలీసులు విజయనగరం జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు.
సమైక్య్యాంధ్ర జిల్లాల్లో నిరసన జ్వాలలు తీవ్రరూపం దాల్చాయి. సమైక్యాంధ్ర నిరసనకారులు కొవ్వొత్తులతో మానవహారంగా ఏర్పడి కేసీఆర్, సోనియా గాంధీలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. వారి దిష్టిబొమ్మలను దహ నం చేశారు. సీమాంధ్ర నేతల చేతకానితనం కారణంగానే రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు దాపురించాయని వారు మండిపడుతున్నారు.