
సీమాంధ్రులను వెళ్లగొట్టండి
కరెన్సీ నోట్లపై నినాదాలు... కర్నూలులో సమైక్యవాదుల ఆందోళన
కర్నూలు, న్యూస్‌లైన్: ‘డిసెంబర్ 31 తర్వాత సీమాంధ్ర వాళ్లను వెళ్లగొట్టండి’ అని తెలుగులో ముద్రలు ఉన్న పది రూపాయల కరెన్సీ నోట్లు పలు చోట్ల దర్శనమిస్తున్నాయి. చలామణిలో ఉన్న ఈ నోట్లు అటు తెలంగాణవారితో పాటు ఇటు సీమాంధ్రవాసులకూ చేరాయి. దీంతో ఈ ఘటనపై సీమాంధ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గురువారం కర్నూలులో జిల్లా సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. స్థానిక శ్రీ కృష్ణదేవరాయల విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో విభజన వాదులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీమాంధ్రులను ఇబ్బందులకు గురిచేసే విధంగా వ్యవహరిస్తున్న వారిని వెంటనే అరె స్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పాటుకు ముందే ఇలాంటి పరిస్థితి ఉంటే.. విభజన జరిగిన తర్వాత సీమాంధ్రులకు ఎవరు రక్షణ కల్పిస్తారని వారు ప్రశ్నించారు.