vijayadurga
-
స్టార్ హీరోయిన్ రవళి కెరీర్ ముగిసిపోవడానికి కారణమిదే!
సినిమాల్లో కనిపిస్తే చాలనుకునేవారు కొందరైతే సినిమా ఇండస్ట్రీనే ఏలేయాలనుకునేవాళ్లు మరికొందరు. అనుకోకుండా సినిమాల్లోకి వచ్చేవాళ్లు కూడా ఉంటారు. అలాంటి కోవలోకే వస్తుంది సినీనటి విజయదుర్గ. 1987లో తన ముగ్గురు పిల్లల్ని చేతపట్టుకుని చెన్నపట్నం(ప్రస్తుత చెన్నై) వెళ్లింది. కష్టాలను లెక్కచేయకుండా తన పని తాను చేసుకుంటూ పోయింది. ఛాన్సులు చేజిక్కించుకుంది, విజయాలను అందుకుంది. ఆమె ఇద్దరు కూతుర్లు రవళి, హరితలు కూడా నటనారంగంలో కీర్తిప్రతిష్టలు అందుకున్నారు. మా అసలు పేర్లు ఇవీ.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో విజయదుర్గ ఆసక్తికర విషయాలు పంచుకుంది. 'నా అసలు పేరు కనకదుర్గ. మాది గుడివాడ. చెన్నైలో ఓసారి దసరా నవరాత్రులకు వెళ్లాను. అక్కడి వాతావరణం నచ్చడంతో పిల్లలను తీసుకుని చెన్నై షిఫ్ట్ అయ్యాను. పిల్లల్ని క్లాసికల్ డ్యాన్స్లో శిక్షణ ఇప్పించాను. అక్కడికి వెళ్లిన నాలుగు నెలలకే.. రఘువరన్ హీరోగా ఎస్పీ ముత్తరామన్ డైరెక్ట్ చేసిన ఓ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. అప్పటికే కనకదుర్గ పేరిట ఓ నటి ఉండటంతో నా పేరును విజయదుర్గగా మార్చారు. నటి హరిత దంపతులు పెళ్లి సందడితో ఫుల్ క్రేజ్ తమిళంలో 15, తెలుగులోనూ దాదాపు 15 చిత్రాలు చేశాను. నా కూతురు హరిత(అసలు పేరు శాంతి) మొదట హీరోయిన్గా చేసింది. పొట్టిగా ఉందంటూ తనకు సిస్టర్ క్యారెక్టర్స్ ఇచ్చారు. ప్రస్తుతం తను బుల్లితెరపై రాణిస్తోంది. ఆ తర్వాత నా కొడుకు విజయ్ (అసలు పేరు శేషు) హీరోగా ఓ సినిమా చేశాడు, కానీ అది విడుదల చేయలేదు. పెళ్లి సందడి సినిమాకు నా కూతురు రవళి(అసలు పేరు శైలజ)కి రూ.50 వేలు ఇచ్చారు. తర్వాత మాత్రం లక్షల్లో అందుకుంది. ఆ ప్రచారం వల్లే కెరీర్ నాశనం తన కెరీర్ ఊపులో ఉన్న సమయంలో రవళి లావైపోయిందని వార్తలు రాశారు. ఆ ప్రచారం వల్ల తన కెరీర్ నాశనమైంది. చెప్పుకోదగ్గ పాత్రలు, సినిమాలు రాలేదు. పెళ్లి చేసుకుని సినిమాలు మానేద్దామనుకుంది. ఆ సమయంలో చిరంజీవి స్టాలిన్ మూవీలో ఛాన్స్ వచ్చింది. అలా కొన్ని చిత్రాలు చేసి 2011లో సినిమాలకు ఫుల్స్టాప్ పెట్టింది. త్వరలోనే తను రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. నా ఆస్తి అంతా ముగ్గురికీ సమానంగా పంచాను. నా దగ్గర సెంటు భూమి కూడా పెట్టుకోలేదు. ఉన్నదంతా ఇచ్చేశాను' అని చెప్పుకొచ్చింది. చదవండి: నాకు లవ్ మ్యారేజ్ ఇష్టం, ముందు సహజీవనం చేస్తా, అప్పుడే పచ్చబొట్టు వేయించుకుంటా! -
విజయదుర్గలో అరుదైన హృదయ చికిత్స
కర్నూలు(హాస్పిటల్): పుట్టుకతో గుండెలో వచ్చిన లోపాన్ని కర్నూలు వైద్యులు సరిదిద్ది ఊపిరిపోశారు. ఆపరేషన్ వివరాలను శుక్రవారం శ్రీ విజయదుర్గ కార్డియాక్ సెంటర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్డియాలజిస్టు డాక్టర్ ఎ. వసంతకుమార్ వెల్లడించారు. సాధారణంగా గర్భస్థ శిశువుకు పెద్దధమని, చిన్నధమని మధ్య డక్లస్ ఆర్టిరియోసిస్ ట్యూబ్ ఉంటుందన్నారు. ఈ ట్యూబ్ గర్భస్థ శిశువుకు ఆరోగ్యానికి ఎంతో అవసరం అన్నారు. శిశువు గర్భం నుంచి బయటకు వచ్చాక మూడు నెలల్లో ఈ ట్యూబ్ పూడుకుపోతుందన్నారు. లేకపోతే బిడ్డకు గుండెపై ఒత్తిడి పెరిగి డొక్కలు ఎగరేయడం, బరువు తగ్గడం, సరిగ్గా తినలేకపోవడం, దగ్గు, ఆయాసం, చెమటలు పట్టడం వంటి సమస్యలు వస్తాయన్నారు. ఇలాంటి సమస్యతోనే బాధపడుతున్న కాకినాడకు చెందిన విజయలక్ష్మి(9) వారం క్రితం ఆసుపత్రికి వచ్చిందన్నారు. 2వేల మందిలో ఒకరికి ఈ సమస్య వస్తుందన్నారు. ఇలాంటి సమస్య ఉన్న వారికి గతంలో ఆపరేషన్ ద్వారా ట్యూబ్ను మూసివేస్తారన్నారు. కానీ విజయలక్ష్మికి ఆపరేషన్ లేకుండా డివైస్ క్లోజర్ పద్ధతిలో తొడ నరం ద్వారా గుండెకు ట్యూబ్ను పంపి తెరిచి ఉన్న డక్లస్ ఆర్టిరియోసిస్ ట్యూబ్ను సరిచేశామన్నారు. ఎన్టిఆర్ వైద్యసేవ కింద ఉచితంగా ఆపరేషన్ నిర్వహించినట్లు చెప్పారు. సమావేశంలో బాలిక విజయలక్ష్మి, ఆమె తండ్రి ఓబులనాయుడు, అనెస్తెటిస్ట్ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. -
విజయదుర్గమ్మా..... వానలు కురిపించవమ్మా..
– ఘనంగా అష్టోత్తర శతకలశాభిషేకం – కదిలివచ్చిన భక్తజనం కడప కల్చరల్ : మాతా నమోస్తుతే....తల్లీ విజయదుర్గమ్మా.. నిండుగా వానలు కురిపించవమ్మా....మా జిల్లా పచ్చగా ఉండేటట్లు దీవించవమ్మా....సాగునీటికి, తాగునీటికి కొరత లేకుండా చూడుతల్లీ అంటూ భక్తులు శ్రీ విజయ దుర్గామాతను కోరుకున్నారు. అమ్మవారిని స్తుతిస్తూ నినాదాలు చేశారు. మంగళవారం స్థానిక శ్రీ విజయదుర్గాదేవి ఆలయంలో అమ్మవారి ఉత్సవమూర్తికి పవిత్ర జలాలు గల 108 కలశాలతో అభిషేకించారు. 41 రోజులపాటు జిల్లాలోని అన్ని మండలాలలోగల దేవాలయాలలో ఈ కలశాలను ఉంచి పూజలు నిర్వహించారు. అభిషేకం సందర్భంగా ఆయా మండలాలకు చెందిన భక్తులు ట్రాక్టర్లు, లారీలు, గూడ్స్ ఆటోలలో ఆ పవిత్ర కలశాలను ఊరేగింపుగా మేళ తాళాలతో తీసుకొచ్చారు. జయజయ ధ్వానాలు చేస్తూ అమ్మవారిని స్వయంగా అభిషేకించారు. బారులు తీరి వేచి ఉండి మరీ విశేష అలంకారంలో ఉన్న అమ్మవారి మూలమూర్తిని దర్శించుకున్నారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ప్రముఖ వేద పండితులు రాయపెద్ది సుబ్బరామశర్మ, ఫణిభూషణశర్మలు పూజా కార్యక్రమాలను పర్యవేక్షించారు. కలెక్టర్ పూజలు.. జిల్లా కలెక్టర్ కేవీ సత్యనారాయణ మంగళవారం శ్రీ విజయదుర్గాదేవిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయ వ్యవస్థాపకులు సుధా మల్లికార్జునరావు, నిర్వాహకులు దుర్గాప్రసాద్ ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. కలెక్టర్కు తీర్థ ప్రసాదాలు అందజేసి అమ్మవారి విశేష వస్త్రాలను, చిత్రపటాన్ని, గ్రంథాలను అందజేశారు. ఈ సందర్భంగా కర్నూలుకు చెందిన విజయదుర్గ కార్డియాలజీ సెంటర్ వైద్యులు ప్రత్యేకంగా మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. -
లోక కల్యాణం కోసం ...
కడప కల్చరల్ : ‘శ్రీ విజయదుర్గాదేవీ.. జిల్లా అంతటా సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలంతా సుఖ శాంతులతో ఉండాలి’ అని భక్తులు వేడుకున్నారు. ఆదివారం స్థానిక శ్రీ విజయదుర్గాదేవి ఆలయంలో వేద పండితుల బృందం శాస్త్రోక్తంగా విరాట పర్వ పారాయణం నిర్వహించారు. లోక కల్యాణం కోసం నిర్వహిస్తున్న బ్రహ్మయజ్ఞ సహిత అష్టోత్తర శతకలశాభిషేక ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజు అమ్మవారికి పంచామృతాభిషేకాలు చేశారు. అనంతరం చతుర్వేద హవనం, మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, చండీ పారాయణం, హోమం, మూలమంత్ర పారాయణం చేశారు. రాయపెద్ది సుబ్బరామశర్మ, ఫణిభూషణశర్మ ఆధ్వర్యంలో దాదాపు 15 మంది వేద పండితులు ఈ కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపకుడు సుధా మల్లికార్జునరావు, నిర్వాహకుడు దుర్గాప్రసాద్ కార్యక్రమాలను పర్యవేక్షించారు.