vijayanagaram curfew
-
మార్క్రమ్ మెరుపు శతకం
సాక్షి ప్రతినిధి విజయనగరం: టీమిండియాతో టెస్టు సిరీస్‌కు ముందు దక్షిణాఫ్రికా ఓపెనర్ మార్క్రమ్ (118 బంతుల్లో 100 రిటైర్డ్ ఔట్; 18 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఫామ్ చాటుకున్నాడు. బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవెన్‌తో విజయనగరంలో జరుగుతున్న మూడు రోజుల సన్నాహక మ్యాచ్‌లో రెండో రోజు అతడు సెంచరీ కొట్టాడు. ఇటీవల భారత్ ‘ఎ’ జట్టుపై భారీ శతకం (160) బాదిన అతడు... ఈ మ్యాచ్‌లోనూ దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. మైదానం ఔట్ ఫీల్డ్ చిత్తడిగా ఉండటంతో శుక్రవారం మధ్యాహ్నం నుంచి మ్యాచ్ ప్రారంభమైంది. 50 ఓవర్ల అనంతరం వెలుతురు లేమి తో ముందే నిలిపివేశారు. కీలక బ్యాట్స్‌మెన్ టెంబా బవుమా (92 బంతుల్లో 55 నాటౌట్; 9 ఫోర్లు) అర్ధ సెంచరీతో రాణించడంతో సఫారీలు రోజు ముగిసే సరికి 5 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేశారు. దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోగా... ఓపెనర్ డీన్ ఎల్గర్ (6)ను ఏడో ఓవర్లోనే ఉమేశ్ యాదవ్ వెనక్కు పంపాడు. డి బ్రుయెన్ (6)ను ఇషాన్ పొరెల్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఈ దశలో జుబయిర్ హమ్జా (22)తో కలిసి మార్క్రమ్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. సెంచరీ పూర్తయ్యాక మార్క్రమ్ రిటైర్డ్ ఔట్‌గా వెనుదిరిగాడు. కెపె్టన్ డు ప్లెసిస్ (9)ను ధర్మేంద్ర జడేజా ఎల్బీ చేశాడు. మ్యాచ్‌కు శనివారం చివరి రోజు. దక్షిణాఫ్రికా ఇదే స్కోరు వద్ద డిక్లేర్ చేసి బోర్డు జట్టు బ్యాటింగ్‌కు వీలు కల్పించనుంది. తద్వారా టీమిండియా హిట్‌మ్యాన్ రోహిత్‌శర్మ ఓపెనర్‌గా చూసే అవకాశం ఉంది. -
విజయనగరంలో కొనసాగుతున్న కర్ఫ్యూ
సాక్షి నెట్వర్క్: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ కొనసాగుతున్న ఉద్యమం తీవ్ర రూపం దాల్చడంతో విజయనగరం కర్ఫ్యూ నీడలోకి వెళ్లింది. ఆదివారం వీధివీధినా పోలీసులు, కేంద్ర బలగాలు కవాతు నిర్వహించాయి. ఆందోళనకారులను తరిమి కొట్టాయి.పరిస్థితి పూర్తిగా అదుపు తప్పడంతో ఐజీ ద్వారకా తిరుమల రావు, ఇద్దరు డీఐజీలు, నలుగురు ఎస్పీలు, వందలాది మంది కానిస్టేబుళ్లతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. కర్ఫ్యూ ఉన్నప్పటికీ పలుమార్లు ఆందోళనకారులు పోలీసుల మీదకు రాళ్లు రువ్వా రు. దీంతో 35మందిని అరెస్టు చేశారు. పలుచోట్ల పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. దాసన్నపేటలో స్థానికులు పోలీసుబీట్ను తగులబెట్టేశారు. జిల్లాలో పరిస్థితిని తెలుసుకునేందుకు ఇంటెలిజెన్స విభాగం ఐజీ బాలసుబ్రహ్మణ్యం జిల్లాకు వచ్చారు. పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చేవరకూ కర్ఫ్యూ కొనసాగుతుందని కలెక్టర్ కాంతిలాల్ దండే పేర్కొన్నారు. జిల్లాలో శాంతియుత వాతావరణం నెలకొనేందుకు ప్రజలు సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఎస్పీ కార్తీకేయ మాట్లాడుతూ సంఘ విద్రోహక చర్యలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇదిలా ఉంటే ‘బొత్సా...నువ్వు కోట్లు దోచుకున్నావ్... ఢిల్లీలో ఉంటావ్... నీ పిల్లల్ని మేడల్లో పెడతావ్...మీరంతా బాగుంటారు.