సాక్షి నెట్‌వర్క్: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ కొనసాగుతున్న ఉద్యమం తీవ్ర రూపం దాల్చడంతో విజయనగరం కర్ఫ్యూ నీడలోకి వెళ్లింది. ఆదివారం వీధివీధినా పోలీసులు, కేంద్ర బలగాలు కవాతు నిర్వహించాయి. ఆందోళనకారులను తరిమి కొట్టాయి.పరిస్థితి పూర్తిగా అదుపు తప్పడంతో ఐజీ ద్వారకా తిరుమల రావు, ఇద్దరు డీఐజీలు, నలుగురు ఎస్పీలు, వందలాది మంది కానిస్టేబుళ్లతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. కర్ఫ్యూ ఉన్నప్పటికీ పలుమార్లు ఆందోళనకారులు పోలీసుల మీదకు రాళ్లు రువ్వా రు. దీంతో 35మందిని అరెస్టు చేశారు. పలుచోట్ల పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు.
దాసన్నపేటలో స్థానికులు పోలీసుబీట్‌ను తగులబెట్టేశారు. జిల్లాలో పరిస్థితిని తెలుసుకునేందుకు ఇంటెలిజెన్‌స విభాగం ఐజీ బాలసుబ్రహ్మణ్యం జిల్లాకు వచ్చారు. పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చేవరకూ కర్ఫ్యూ కొనసాగుతుందని కలెక్టర్ కాంతిలాల్ దండే పేర్కొన్నారు. జిల్లాలో శాంతియుత వాతావరణం నెలకొనేందుకు ప్రజలు సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఎస్పీ కార్తీకేయ మాట్లాడుతూ సంఘ విద్రోహక చర్యలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇదిలా ఉంటే ‘బొత్సా...నువ్వు కోట్లు దోచుకున్నావ్... ఢిల్లీలో ఉంటావ్... నీ పిల్లల్ని మేడల్లో పెడతావ్...మీరంతా బాగుంటారు.