vijayawada east
-
పిల్లలను తోసి కాలువలోకి దూకిన తల్లి
పటమట(విజయవాడతూర్పు): ఓ తల్లి తన ఇద్దరు కుమార్తెలను కాలువలోకి నెట్టి, తానూ దూకి ఆత్మహత్యకు యత్నంచింది. ఈ ఘటనలో ఓ చిన్నారి మృతదేహం లభించగా.. తల్లి, మరో కుమార్తె ఆచూకీ లభించలేదు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని స్క్రూబ్రిడ్జి వద్ద ఆదివారం ఈ ఘటన జరిగింది. భార్యాభర్తల మధ్య మనస్పర్థలే దీనికి కారణమని తెలిసింది. పోలీసుల కథనం మేరకు వివరాలు.. గుంటూరు శారద కాలనీకి చెందిన తిరుపతిరావు రోజువారీ పనులకు వెళ్తుంటాడు. అతనికి సుధారాణి(25)తో ఐదేళ్ల కిందట వివాహమైంది. వారికి జాస్వీ (16 నెలలు), బ్లెస్సీ(4 నెలలు) సంతానం.శనివారం గుంటూరులో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. విజయవాడ కృష్ణలంకలోని కళానగర్‌లో నివసించే తిరుపతిరావు బావ కోటేశ్వరరావు ఇంటికి భార్యాభర్తలు వచ్చారు. మధ్యాహ్నం సమయంలో ఫోను వచి్చందని తిరుపతిరావు బయటకు వెళ్లాడు. ఆ వెంటనే సుధారాణి తన ఇద్దరు పిల్లలను తీసుకుని ఇంటి నుంచి బయటకు వచ్చి స్క్రూబ్రిడ్జికి చేరుకుని ఇద్దరు పిల్లలను బందరు కాలువలో పడేసి ఆమె కూడా దూకింది.స్థానికులు దీనిని గమనించి వారిని కాపాడే ప్రయత్నం చేయగా బ్లెస్సీ మృతదేహం దొరికింది. విషయం తెలుసుకున్న పటమట సీఐ పవన్‌కిషోర్ ఎన్డీఆర్ఎఫ్ సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. కాలువలో నీటి ప్రవాహం ఉధృతంగా ఉండటంతో జాస్వీ, సుధారాణిల ఆచూకీ లభించలేదు. పోలీసులు తిరుపతిరావును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
చంద్రబాబూ.. ఆ మోసాన్ని గుర్తు తెచ్చుకో: దేవినేని అవినాష్
సాక్షి, విజయవాడ: రాణిగారితోటలో నిన్నటి చంద్రబాబు సభ అట్టర్ ప్లాప్ అయ్యిందని, 40 ఇయర్స్ ఇండస్ట్రీ నేతకు 200 మంది కార్యకర్తలు కూడా రాలేదని విజయవాడ తూర్పు నియోజకవర్గం వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ ఎద్దేవా చేశారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, గద్దె రామ్మోహన్, చంద్రబాబు అందరూ కట్టకట్టుకుని కృష్ణా నదిలో దూకాలంటూ ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘గత ఐదేళ్లలో కృష్ణలంక, రాణీగారి తోట ప్రజలను చంద్రబాబు మోసం చేశారు. నిన్నటి సభ చూసైనా చంద్రబాబు ఈ ప్రాంతానికి చేసిన మోసాన్ని గుర్తు తెచ్చుకోవాలి. తూర్పు నియోజకవర్గ ప్రజలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి. సీఎం జగన్ ప్రభుత్వంలోనే రాణిగారితోట ప్రాంతం అభివృద్ధి చెందింది. ఇంటింటికీ కుళాయిలు అందించాం. చంద్రబాబు మీటింగ్ పెట్టుకున్న సభకు ఎదురుగా ఉన్న కమ్యూనిటీ హాల్ మేం నిర్మించిందే. రిటైనింగ్ వాల్ నిర్మించింది కూడా సీఎం జగన్ ప్రభుత్వమే’’ అని దేవినేని అవినాష్ అన్నారు. చదవండి: చంద్రబాబుకు జూనియర్ ఎన్టీఆర్ సెగ.. ఈడ్చిపడేయాలంటూ ఆదేశాలు ‘‘సైకిల్ పోవాలని.. చంద్రబాబే తన మనసులో మాట బయటపెట్టాడు. బెజవాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహం మేం ఏర్పాటు చేస్తున్నాం. ఇలాంటి ఆలోచన నీకెప్పుడైనా వచ్చిందా చంద్రబాబు. గద్దె రామ్మోహన్ రాసిచ్చిన పేపర్ చదివి మమ్మల్ని విమర్శించావ్. రాణిగారితోట ప్రాంతంలో ముస్లిం మహిళలను రెచ్చగొట్టింది గద్దె రామ్మోహన్. టీడీపీలో కొందరు నారా లోకేష్‌ను ఫాలో అవుతున్నారు. వార్డు మెంబర్‌గా గెలవలేని వాళ్లను పార్టీలో చేర్చుకునే స్థాయికి చంద్రబాబు దిగజారిపోయాడు’’ అని అవినాష్ దుయ్యబట్టారు. -
మనం చేస్తున్న మంచిని ప్రజలకు వివరించండి : సీఎం వైఎస్ జగన్
-
ఓటు హక్కు వినియోగించుకోవాలి
సాక్షి, మొగల్రాజపురం(విజయవాడ తూర్పు) : ఓటు హక్కును అర్హులైన ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని అప్పుడే ప్రజాస్వామ్యంలో అభివృద్ధి సాధ్యమవుతుందని కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ అన్నారు. ఓటు హక్కు వినియోగంతో పాటుగా ఓటింగ్ యంత్రాలపై అవగాహన కార్యక్రమం పీబీ సిద్ధార్థ ఆడిటోరియంలో బుధవారం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో మౌలిక సదుపాయాలు సాధించుకోవడంతో పాటుగా ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటు హక్కు ఎంతో విలువ ఉందన్నారు. ఎన్నికల బరిలో నిలబడిన అభ్యర్థుల్లో ఎవరికి ఓటు వేయడం ఇష్టం లేని పక్షంలో నోటా వినియోగించుకోవచ్చునని చెప్పారు. క్రిమినల్ చరిత్ర తెలియజేయాల్సిందే... తాజాగా సుప్రీం కోర్టు నిబంధనల ప్రకారం ఎన్నికల పోటీలో ఉన్న ప్రతి అభ్యర్థి తనపై ఉన్న కేసుల వివరాలను కూడా తప్పనిసరిగా అఫిడవిట్లో పేర్కొనాల్సిందేనని స్పష్టం చేసిందని ఇంతియాజ్ తెలిపారు. బాహుబలిలా.... ఎన్నికల ఓటింగ్ యంత్రాల అవగాహనలో భాగంగా ఏర్పాటు చేసిన సదస్సులో కలెక్టర్ విద్యార్థులకు ఆసక్తి కలిగించడానికి బాహుబలి సినిమాతో పాటుగా మిసిసిపి మషాలా అనే ఇంగ్లిష్ సినిమాలోని అంశాలను ప్రస్తావించారు. కెన్యాలోని ఒక నియంత నాయకుడు అయితే ఆ పాలన ఎలా సాగుతుందోననే అంశాలతో మిసిసిపి మషాలా సినిమాలో చూపించారని అప్పుడు ఓటు విలువ తనకు తెలిసిందని చెప్పారు. మొదటి సారిగా వివి ప్యాట్ల వినియోగం ఓటర్ వెరిఫేబుల్ పేపర్ ఆడిట్ వేర్ (వీవీ ప్యాట్)ను మన రాష్ట్రంలో మొదటి సారిగా ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఉపయోగిస్తున్నామని, ఈవీఎంలో ఓటరు ఎవరికి ఓటు వేశారో ఈ ప్యాట్‌లో ఏడు సెకన్ల పాటు ఓటరుకు కనిపిస్తోందని చెప్పారు. ఫారం–7 కింద 25 కేసులు నమోదు చేశాం.. జిల్లా పరిధిలో ఒకరి పేరుతో ఉన్న ఓటును తొలగించమని కొంత మంది ఫారం–7 ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేశారు. ఈ విధంగా దరఖాస్తు ఎవరు చేశారనే విషయంపై విచారణ జరుగుతుంది. తప్పుగా దరఖాస్తు చేసిన వారిపై జిల్లాలో 25 కేసులు నమోదు చేశాం. విచారణ జరిపిన చర్యలు తీసుకుంటామని సదస్సు అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. సదస్సులో తూర్పు నియోజకవర్గం ఎన్నికల రిటర్నింగ్ అధికారి సి.గురుప్రకాష్, తహసీల్దార్ లలిత, సిద్ధార్థ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.రమేష్ పాల్గొన్నారు. సదస్సు అనంతరం ఎన్నికల ప్రచార వాహనాలను కలెక్టర్ పరిశీలించారు. -
హరికృష్ణకు విజయవాడ తూర్పు లేక నూజివీడు?
హైదరాబాద్: రాజ్యసభ మాజీ సభ్యుడు నందమూరి హరికృష్ణకు కృష్ణా జిల్లాలోని విజయవాడ తూర్పు లేక నూజివీడు శాసనసభ నియోజకవర్గాలలో ఏదో ఒకటి కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రెండు స్థానాలను పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎవరికీ కేటాయించలేదు. పెనమలూరు టికెట్ లేదా హిందూపురం టికెట్ ఇవ్వమని తాను ముందే అడిగినట్లు హరికృష్ణ చెప్పారు. అయితే హిందూపురం బాలకృష్ణకు, పెనమలూరును బడే ప్రసాద్‌కు కేటాయించారు. కృష్ణాజిల్లాలో ఏదో ఒక అసెంబ్లీ స్థానం తనకు ఇస్తారని ఆశించినట్లు హరికృష్ణ చెప్పారు. ఈ నేపధ్యంలో కృష్ణా జిల్లాలో మిగిలి ఉన్నా విజయవాడ తూర్పు, నూజివీడు స్థానాలలో ఏదో ఒకటి ఆయనకు కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా, కృష్ణా జిల్లా నూజివీడులో ముద్రబోయిన వెంకటేశ్వరరావు రహస్యంగా నామినేషన్ దాఖలు చేశారు. ముద్రబోయిన ఇటీవలే కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. విజయవాడ తూర్పు శాసనసభ స్థానానికి మాజీ ఎంపి, పార్టీ తూర్పు నియోజకవర్గ బాధ్యుడు గద్దె రామ్మోహన్ తన తరపున భార్య అనూరాధతో నామినేషన్ వేయించారు. ఈ రెండిటిలో ఏదైనా హరికృష్ణకు కేటాయిస్తారా లేక మొండిచేయి చూపుతారా అనేది తెలుసుకోవాలంటే వేసి చూడవలసిందే. -
టికెట్ అడగలేదనేది అసత్య ప్రచారం: హరికృష్ణ
హైదరాబాద్ : విజయవాడ తూర్పు సీటుపై తాజాగా నందమూరి హరికృష్ణ పేరు తెరమీదకు వచ్చింది. కాగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును తాను టికెట్ అడగలేదని అసత్య ప్రచారం చేస్తున్నారని మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ అన్నారు. ఆయన బుధవారమిక్కడ మాట్లాడుతూ చంద్రబాబు పాదయాత్రలో ఉండగానే పెనమలూరు టికెట్ అడిగానని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కృష్ణాజిల్లాలో ఏదో ఒక అసెంబ్లీ స్థానం ఇస్తారని తాను ఆశించానని హరికృష్ణ పేర్కొన్నారు. హిందుపురం టికెట్ కావాలని పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశంలో మరోసారి కోరానన్నారు. కాగా హిందుపురం నియోజకవర్గం నుంచి బాలకృష్ణ బరిలోకి దిగిన విషయం తెలిసిందే. బుధవారం ఆయన హిందుపురంలో నామినేషన్ దాఖలు