
టికెట్ అడగలేదనేది అసత్య ప్రచారం: హరికృష్ణ
హైదరాబాద్ : విజయవాడ తూర్పు సీటుపై తాజాగా నందమూరి హరికృష్ణ పేరు తెరమీదకు వచ్చింది. కాగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును తాను టికెట్ అడగలేదని అసత్య ప్రచారం చేస్తున్నారని మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ అన్నారు. ఆయన బుధవారమిక్కడ మాట్లాడుతూ చంద్రబాబు పాదయాత్రలో ఉండగానే పెనమలూరు టికెట్ అడిగానని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
కృష్ణాజిల్లాలో ఏదో ఒక అసెంబ్లీ స్థానం ఇస్తారని తాను ఆశించానని హరికృష్ణ పేర్కొన్నారు. హిందుపురం టికెట్ కావాలని పార్టీ పొలిట్బ్యూరో సమావేశంలో మరోసారి కోరానన్నారు. కాగా హిందుపురం నియోజకవర్గం నుంచి బాలకృష్ణ బరిలోకి దిగిన విషయం తెలిసిందే. బుధవారం ఆయన హిందుపురంలో నామినేషన్ దాఖలు