vijayawada task force police
-
ఇంజక్షన్లు విక్రయిస్తున్న నలుగురి అరెస్ట్
విజయవాడ స్పోర్ట్స్: కరోనా చికిత్సకు ఉపయోగించే రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లను అమ్ముతున్న ఇద్దరిని, నకిలీ రెమ్డిసివిర్ను విక్రయిస్తున్న ఇద్దరిని విజయవాడ టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన వివరాలను నగర పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు వెల్లడించారు. సూర్యారావుపేటలోని యూనియన్ ఆస్పత్రి కోవిడ్ వార్డులో టెక్నీషియన్ షేక్ నజీర్‌బాషా, స్టాఫ్ నర్స్ పుష్పలత ఆస్పత్రిలో మిగిలిన రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లను చిట్టినగర్ మిల్క్ ప్రాజెక్ట్ వద్ద విక్రయిస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. వీరు పనిచేస్తున్న ఆస్పత్రిలో తెనాలికి చెందిన వ్యక్తి కోవిడ్ చికిత్స పొందుతూ మృతిచెందాడని, అతడి చికిత్సకు తీసుకురాగా మిగిలిన మూడు ఇంజక్షన్లను అక్రమమార్గంలో రూ.1.10 లక్షలకు అమ్ముతుండగా పట్టుకున్నట్లు చెప్పారు. వీరిని విచారణ కోసం టూ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు తెలిపారు. నిందితుడు షేక్ నజీర్‌బాషా అజిత్‌సింగ్‌నగర్‌లో ఆర్ఎంపీ వైద్యుడుగా పనిచేస్తున్నట్లు చెప్పారు. నకిలీ ఇంజక్షన్లు కొని అమ్ముతున్న వైద్యుడు రెమ్‌డెసివిర్‌ను పోలిన ఇంజక్షన్‌ను సితార సెంటర్ వద్ద విక్రయిస్తున్న డాక్టర్ ఆత్మకూరి భానుప్రతాప్, పసుపులేటి వీరబాబులను అరెస్టు చేసినట్లు సీపీ తెలిపారు. ఈ కేసులో మరో నిందితుడు పవన్‌ను అరెస్ట్ చేయాల్సి ఉందన్నారు. హైదరాబాద్‌లో ఉండే పవన్ నుంచి మంగళగిరి ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో డ్యూటీ డాక్టర్ భానుప్రతాప్ నాలుగు నకిలీ రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లను రూ.52 వేలకు కొనుగోలు చేసి, విద్యాధరపురానికి చెందిన మెడికల్ రిప్రజెంటేటివ్ వీరబాబుకు రూ.1.08 లక్షలకు విక్రయించాడని చెప్పారు. వీరబాబు ఈ మందులను సితార సెంటర్ వద్ద రూ.1.44 లక్షలకు విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. నిందితులను భవానీపురం పీఎస్‌కు తరలించినట్లు చెప్పారు. నిందితులను అరెస్ట్ చేసిన టాస్క్‌ఫోర్స్ ఏడీసీపీ కె.శ్రీనివాసరావు, ఏసీపీలు జి.వి.రమణమూర్తి, వి.ఎస్.ఎన్.వర్మ, సీఐ కృష్ణమోహన్‌లను సీపీ అభినందించారు. -
పేకాడుతూ పట్టుబడ్డ 'నాయకుడు'
పేకాట శిబిరంపై టాస్క్‌ఫోర్స్ దాడులు పట్టుబడిన వారిలో ఎంపీటీసీల సంఘం రాష్ర్ట అధ్యక్షుడు కాసరనేని మురళి రూ.7,84,990 స్వాధీనం కేసు మాఫీకి అధికార పార్టీ నేతల ఒత్తిడి విజయవాడ : గుట్టు చప్పుడు కాకుండా పేకాట శిబిరాన్ని నిర్వహిస్తున్న ఒక ఇంటిపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం దాడి చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఎంపీటీసీ సంఘం రాష్ర్ట అధ్యక్షుడు కాసరనేని మురళి పట్టుబడ్డాడు. కొంత కాలంగా నగరంలో అపార్ట్‌మెంట్లలోను, పెద్ద పెద్ద భవనాల్లోను జూదగృహాలు నడపటంైపై వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు విస్తృత నిఘా పెట్టారు. ఈ క్రమంలో గురునానక్ కాలనీలోని ఒక ఇంటిలో పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ ఏసీపీ మురళీధర్, ఎస్ఐ రావి సురేష్‌రెడ్డి తమ బృందంతో ఆకస్మిక దాడి చేశారు. ఈ దాడిలో 14 మంది జూదరులను పట్టుకుని వారి వద్ద నుంచి రూ.7,84,990, 15 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ జూదగృహాన్ని జిల్లాలోని వణుకూరుకు చెందిన ఆరేపల్లి శ్రీకాంత్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తెలుగుదేశం పార్టీ నాయ కుడు, ఎంపీటీసీల సంఘం రాష్ర్ట అధ్యక్షుడు కాసరనేని మురళి పట్టుబడ్డాడు. అతని పేరు బయటకు రాకుండా చూసేందుకు టీడీపీ నాయకులు పోలీసులు ఒత్తిడి తెచ్చారు. ఏం చేయాలో పాలుపోక చాలా సేపు కేసు నమోదు చేయలేదు. చేసేది లేక కేసు నమోదు చేశారు. పట్టుబడినవారిలో మచిలీపట్నం, వణుకూరు, ఉయ్యూరు ప్రాంతాలకు చెందినవారు ఎక్కువ మంది ఉన్నట్లు పేర్కొన్నారు. పేకాట శిబిరాలపై దాడులు నిర్వహించి జూదరుల నుంచి స్వాధీనం చేసుకున్న నగదులో ఇటీవల కాలంలో ఇది పెద్ద మొత్తం కావడం విశేషం. గ్రామాలలో జులాయిగా తిరుగుతూ స్థానికంగా ఉండే మోతుబరుల బలహీనతలను ఆసరాగా తీసుకుని కొందరు యువకులు నగరంలో ఇల్లు తీసుకుని ఇటువంటి జూదగృహాలు నిర్వహిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.