అనాథాశ్రమంలోని బాలుడు అదృశ్యం
మారేడుపల్లి: సికింద్రాబాద్ వెస్ట్ మారేడుపల్లి విక్రంపురికాలనీలోని ఓ అనాథాశ్రమం నుంచి బాలుడు అదృశ్యమైన సంఘటన గురువారం మారేడుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మారేడుపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విక్రంపురి కాలనీలోని మంచికళలు సంస్థ(అనాథ ఆశ్రమం)లో ఉంటున్న కరుణాకర్(10)) బుధవారం సాయంత్రం ఆశ్రమం నుంచి కనిపించకుండా వెళ్లాడు.
కరుణాకర్‌ను జూన్‌లో చిల్డ్రన్ స్టెట్ హోమ్ నుంచి మంచి కళలు సంస్థకు తీసుకువచ్చారు. స్థానికంగా ఓ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నాడు. బుధవారం స్కూల్ నుంచి ఆశ్రమానికి వచ్చిన కరుణాకర్ కనిపించకుండా వెళ్ళిపోయాడు. దీంతో ఆశ్రమ నిర్వాహకులు రమేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.