పల్లెటూరి ప్రేమకథ
‘చూడాలని ఉంది, ఇంద్ర, యువరాజు’ సినిమాల్లో బాలనటుడిగా నటించిన తేజను లక్కీ మీడియా సంస్థ హీరోగా పరిచయం చేస్తోంది. బెక్కం వేణుగోపాల్ (గోపి) నిర్మిస్తున్న ఈ సినిమాకు హరి దర్శకుడు. సెప్టెంబర్ 15న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నారు. నిర్మాత గోపి మాట్లాడుతూ– ‘‘పల్లెటూరి యువత నేపథ్యంలో జరిగే అందమైన ప్రేమకథా చిత్రమిది. కుటుంబమంతా చూసేలా ఉంటుంది. మా దర్శకుడు ప్రముఖ నిర్మాత శ్యామ్ప్రసాద్రెడ్డిగారి సంస్థలో దర్శకత్వ విభాగంలో ఎనిమిదేళ్లు పనిచేశారు. ‘ఉయ్యాలా జంపాలా, స్వామిరారా’ ఫేమ్ యంఆర్ సన్నీ మా సినిమాకు స్వరకర్త’’ అన్నారు.