Village Visit
-
‘రోడ్డు మీద కూడా పడుకోగలను’
బెంగళూరు : 5 స్టార్ హోటల్ రేంజ్ సదుపాయాలేం అక్కర్లేదు.. అవసరమైతే రోడ్డు మీద కూడా నిద్రపోగలను అంటున్నారు కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్డి కుమారస్వామి. శుక్రవారం నుంచి గ్రామాల్లో పర్యటన నిమిత్తం ‘గ్రామ వాస్తవ్య 2.0’ కార్యక్రమాన్ని యాద్గిర్ నుంచి ప్రారంభించారు కుమారస్వామి. అయితే సీఎం పర్యటన నేపథ్యంలో ఆయన బస చేయబోయే ఓ లాడ్జీలోని బాత్రూమ్ని రిన్నోవేట్ చేశారు అధికారులు. దాంతో విపక్షాలు పలు విమర్శలు చేస్తున్నాయి. సీఎం గ్రామ పర్యటన చాలా విలాసవంతంగా సాగుతుందని.. ఆయన కోసం 5 స్టార్ హోటల్ రేంజ్ సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించాయి. ఈ విమర్శలపై కుమారస్వామి స్పందిస్తూ.. ‘ఓ చిన్న బాత్రూంను నిర్మిస్తే ప్రతిపక్షాలు ఇంతలా విమర్శలు చేస్తున్నాయి. రోజంతా పలు కార్యక్రమాల్లో పాల్గొని అలసిపోతాను. ఫ్రెష్ అవడానికి చిన్న బాత్రూం ఏర్పాటు చేశారు. అది కూడా తప్పేనా. దానికే 5 స్టార్ హోటల్ రేంజ్ ఏర్పాట్లు అంటూ విమర్శించడం సరికాదు. పల్లే యాత్రలో భాగంగా ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు వచ్చాను. అది కూడా సాధరణ పౌరుడిలానే బస్సులో వచ్చాను. నేను ప్రయాణం చేసింది ఓల్వో బస్సు కాదు సాధరణ బస్సులో. గుడిసేలో కాదు అసరమైతే రోడ్డు మీద కూడా నిద్రపోగలను’ అన్నారు. అంతేకాక ‘మా నాన్న ప్రధానిగా ఉన్నప్పుడు రష్యాలోని గ్రాండ్ క్రెమ్లిన్ ప్యాలేస్‌లో బస చేశాను. ఇప్పుడు అవసరమైతే రోడు మీద కూడా పడుకోగలను. జీవితంలో అన్ని రకాల ఎత్తు పల్లాలు చూశాను. ఇప్పుడు బీజేపీని చూసి నేర్చుకోవాల్సిన అవసరం నాకు లేదు’ అంటూ కుమారస్వామి ఘాటుగా స్పందించారు. అనంతరం పల్లే యాత్రలో భాగంగా ప్రజల సమస్యల్ని స్వయంగా తెలుసుకోగల్గుతున్నానని.. వాటిని తప్పక పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు కుమారస్వామి. -
ఎకరాకు రూ. 70వేలు ఇవ్వాలి
సాక్షి, అనంతపురం : పంట నష్టానికి గురైన రైతులను ప్రభుత్వం పట్టించుకోవట్లేదని వైఎస్సార్సీపీ ఉరవకొండ ఎమ్మెల్యే వై విశ్వేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. సోమవారం బెలుగుప్ప మండలంలోని రామసాగరం, దుద్దేకుంట గ్రామాల్లో సోమవారం ఆయన పర్యటించారు. ఈదురుగాలుల కారణంగా దెబ్బతిన్న అరటి, మామిడి తోటలను ఆయన పరిశీలించారు. అకాల వర్షాల కారణంగా జిల్లా వ్యాప్తంగా వెయ్యి హెక్టార్లలో పంట నష్టం జరిగిందని పేర్కొన్నారు. పంట నష్టానికి గురైన రైతులను ప్రభుత్వం పట్టించుకోవట్లేదని, గత ఏడాదిలో నష్టపోయిన రైతులకు పరిహారం అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు. వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 70వేల రూపాయల నష్ట పరిహారం చెల్లించాలని విశ్వేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధర రావడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు మద్దతు ధర ఇవ్వడంలో ప్రభుత్వం విఫమైందని ధ్వజమెత్తారు. గత కొద్ది కాలంగా అరటి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వమే ఉచితంగా విత్తన మొక్కలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో రైతులకు ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామన్న చంద్రబాబు హామీ ఏమైందంటూ విశ్వేశ్వర రెడ్డి ప్రశ్నించారు. -
సబ్‌కలెక్టర్ ఎదురుచూపులు!
గ్రామసందర్శనకు సకాలంలో హాజరుకాని వైనం జగిత్యాల రూరల్ : గ్రామసందర్శనకు అధికారులు సకాలంలో హాజరుకాకపోవడంతో జగిత్యాల సబ్ కలెక్టర్ శశాంకకు వేచి చూడాల్సిన పరిస్థితి ఎదురైంది. ఉదయం 10 గంటలకు గ్రామ సందర్శన ప్రారంభంకావాల్సి ఉండగా.. 10.10 గంటలకు సబ్‌కలెక్టర్ గ్రామానికి చేరుకున్నారు. అధికారులెవరూ లేకపోవడంతో అరగంటపాటు గ్రామపంచాయతీలోనే ఎదురుచూశారు. ఎంఈవో మద్దెల నారాయణ హాజరుకాగా 10.45 గంటలకు ఎంపీడీవో శ్రీలతరెడ్డి వచ్చారు. ఇద్దరు అధికారులను వెంటబెట్టుకుని ప్రాథమిక పాఠశాల తనిఖీకి వెళ్లగా.. 11 గంటలకు ఐసీడీఎస్ సూపర్వైజర్ రాజశ్రీ హాజరయ్యారు. అరుుతే అధికారులను మందలించకుండానే సబ్‌కలెక్టర్ గ్రామసందర్శనలో పాల్గొన్నారు.