Villages voters
-
పంచాయతీ ఎన్నికలకు ప్రణాళిక
ఖమ్మంసహకారనగర్: నిన్న మొన్నటి వరకు అసెంబ్లీ ఎన్నికల సందడి..ముగిసిందో లేదో ఇక గ్రామ పంచాయతీ ఎన్నికల కోలాహలం మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది. కోర్టు ఆదేశాల మేరకు జనవరి నెలలోగా ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉండటంతో అధికారులంతా ఆ పనుల్లో నిమగ్నమవుతున్నారు. కొత్త గ్రామ పంచాయతీల ప్రకారం రిజర్వేషన్లను పూర్తి చేసి ఎన్నికలు నిర్వహించనున్నారు. తాజాగా బీసీ ఓటర్ల గణనను చేయాలని ఆదేశాలు అందడంతో జిల్లా అధికార యంత్రాంగం ఆ కసరత్తులో నిమగ్నమైంది. ఆదివారం బీసీ ఓటర్లకు సంబంధించిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను గ్రామ పంచాయతీల వారీగా విడుదల చేశారు. జిల్లాలోని 584గ్రామ పంచాయతీల్లో ఈ పోరు మొదలవనుంది. 21మండలాల పరిధిలో 584 గ్రామ పంచాయతీలు ఉండటంతో వాటిల్లో బీసీ ఓటర్ల గణనపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఎట్టకేలకు ఆదివారం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 12వ తేదీన అభ్యంతరాలను స్వీకరించి అదే రోజున పరిశీలించనున్నారు. గ్రామసభలు ఇలా.. 12వ తేదీన అందిన అభ్యంతరాలు, ఓటర్ల గణనపై 13, 14వ తేదీల్లో అంతటా గ్రామసభలు నిర్వహించనున్నారు. అనంతరం 15వ తేదీన ఓటరు జాబితాను ప్రకటించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం రిజర్వేషన్లలో సందిగ్ధత నెలకొనడంతో పాటు ఈ నెల 11వ తేదీన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విడుదల అనంతరం ఏర్పడే కొత్త ప్రభుత్వం రిజర్వేషన్ల విషయంలో నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. పంచాయతీ రాజ్ ఎన్నికల గడువు కూడా దగ్గర పడుతుండడంతో వచ్చే కొత్త ప్రభుత్వం అప్పటి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంది. 15న తుది జాబితా.. బీసీ ఓటర్ల తుది జాబితాను ఈ నెల 15వ తేదీన విడుదల చేయనున్నారు. అందుకు అనుగుణంగా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. 13, 14వ తేదీల్లో గ్రామసభ అనంతరం 15వ తేదీన తుది జాబితాను విడుదల చేయనున్నారు. దీని ప్రకారం ఎన్నికలు జరగనున్నాయి. డ్రాఫ్ట్ నోటిఫికేషన్ వేశాం.. గ్రామ పంచాయతీల్లో డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను విడుదల చేశాం. 12న అభ్యంతరాల స్వీకరణ ఉంటుంది. అనంతరం 13, 14వ తేదీల్లో గ్రామసభలు నిర్వహిస్తాం. ఆ తర్వాత తుది జాబితాను విడుదల చేస్తాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాం. – శ్రీనివాస్, డీపీఓ, ఖమ్మం -
వచ్చాడు.. మా ఊరి మొనగాడు
సాక్షి, చింతపల్లి : పల్లెల్లో ఒకప్పుడు పలుకుబడి ఉన్న చోటామోటా నేతలంతా ఇప్పుడు పట్టణం వీడి సొంత గ్రామాలకు చేరుకుంటున్నారు. పండుగకో ..పబ్బానికో వచ్చే నేతలంతా ఎన్నికల సమయానికి రెక్కలు కట్టుకొని సొంత ఊళ్లలో వాలిపోతున్నారు. వారంతా ఎంతోకొంత రాజకీయ నేపథ్యం ఉన్న వారు కావడంతో తమ మాట నెగ్గించుకునేందుకు తహతహలాడుతున్నారు. పార్టి పెద్దలను ప్రసన్నం చేసుకుంటూనే తమ పరపతిని ప్రదర్శిస్తున్నారు. తాము మద్దతిచ్చే పార్టి అభ్యర్థి గెలి స్తేనూ.. లేక పార్టి అధికారంలోకి వస్తేనూ తాము కూర్చున్న వద్దనే చక్రం తిప్పుకునే అవకాశాలు ఉంటాయని ఆసక్తి కనబరుస్తున్నారు. ముఖ్యంగా దేవరకొండ నియోజకవర్గంలోని మండలాల్లో ఉన్న ప్రముఖులు చాలా మంది రాష్ట్ర రాజధానికి వెళ్లి స్థిరపడ్డారు. మండలంలోని ముఖ్యులు హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఉంటున్నారు. వీరంతా ఇప్పుడు ఎన్నికలు పూర్తయ్యే వరకు ఊళ్లోనే తిష్ట వేస్తున్నారు. రాజకీయ అనుభవాన్ని రంగరిస్తున్నారు.. పాతికేళ్లకుముందు ప్రజల్లో రాజకీయ చైతన్యం అంతంత మాత్రంగానే ఉండేది. ఎన్నికల్లో రిజర్వేషన్లు కూడా అప్పటికి లేకపోవడంతో కాస్త పేరు, పలుకుబడితో ఆర్థికంగా అంగబలం ఉన్న వారంతా స్థానిక ప్రజాప్రతినిధులు, నేతలుగా చెలామణి అయ్యారు. ఏళ్లతరబడి స్థానికంగా రాజకీయాలను శాసించే వారు. వారు చేసే అభివృద్ధి జన ఆదరణకు కారణమయ్యేవి. పంచాయతీకి వచ్చే నిధులతో గుత్తేదారులుగా ఉండి పనులు చేయించే వారు. ఊరికి ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులు వస్తే వారినిది సంప్రదించనిదే మాట ఇచ్చే వారు కాదు. అంతటి ప్రాబాల్యం ఉన్న గ్రామ స్థాయి నేతలంతా ఇప్పుడు మరోమారు చక్రం తిప్పే పనిలో పడ్డారు. తాజాలు.. మాజీలు కూడా.. పల్లెల్లో.. సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులుగా ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యులుగా పని చేస్తున్న వారిలో కూడా కొంత మంది మండల జిల్లా కేంద్రం కేరాఫ్‌గా ఉండే వారు. తాజా మాజి సర్పంచులతో పాటు ప్రస్తుతం ఉన్న ఎంపిటిసిలలో కొంత మంది ఇదే వరుసలో ఉన్నారు. చాలా మంది మండల కేంద్రంలో ఉండేందుకు ఇష్టపడుతున్నారు. పిల్లలు చదువుకోలేక, వ్యాపార పనులకో పల్లెలను వదిలేశారు. ఇలాంటి వారు మళ్లీ ఎన్నికల కోసం ఆగమేఘాల పై సొంత ఊరికి వచ్చి తిరుగుతున్నారు. అవ్వా.. మంచిగున్నావా అంటూ పలకరింపులు మొదలుపెట్టారు. తమ ఊరికి చేసిన ఉపకారాన్ని ప్రస్తావిస్తున్నారు. ఎవరికైన కష్టం వస్తే ఆపదలో తాము ఆదుకున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. గ్రామఅభివృద్ధికి భారీగా నిధులు కావాలన్నా, గ్రామంలో సమస్యలు పరిష్కారం కావాలంటే పైస్థాయి పరిచయాలు ఉన్న తమలాంటి నేతల మాటలకు విలువ ఇస్తే పూర్తయితాయని భరోసా కల్పిస్తున్నారు. అభ్యర్థులు కూడా వారి వెంటనే.. ఏ గ్రామంలో కూడా మూకుమ్మడిగా ఓట్లను ప్రభావితం చేసే వ్యక్తులపైనే అభ్యర్థులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఎవరి మాట ఎవరు వింటారనేదానిపైనే దృష్టిపెట్టారు. ఇప్పటితరం దానికి భిన్నమైనప్పటికి పాత తరం వారి మాట వేదమంటారు. చైతన్యం ఉన్న వారి అడుగుజాడల్లో నడవాలని కలుస్తారు. అందుకే అభ్యర్థులు కూడా పాత కాలపు ప్రాధాన్యతనిస్తున్నారు. క్యాడర్ సమన్యాయాన్ని, ఎన్నికల బాధ్యతలను అప్పజెబుతున్నారు. చివరి వరకు అన్ని తామే చూసుకుంటామని భరోసా ఇస్తున్నారు. భవిష్యత్తులో అదే తమకు శ్రీరామరక్ష అవుతుందని తలుస్తున్నారు. పోలింగ్ పూర్తయితేనే కాలు బయట పెట్టి తట్టాబుట్ట సర్దుతారు. అప్పటి వరకు ఊళ్లోనే ఉంటామంటున్నారు నేతలు. -
పల్లెల్లో ‘పంచాయతీ’ చర్చ
ఆదిలాబాద్: వచ్చే ఫిబ్రవరి నెలలోనే ముందస్తు పంచాయతీ ఎన్నికలకు వెళ్లేందుకు యోచిస్తున్నట్లు సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనతో గ్రామాల్లో రాజకీయ వేడి మొదలైంది. పంచాయతీ వ్యవస్థలో సమూల మార్పు దిశగా నిర్ణయం తీసుకున్నట్లు సంకేతాలిచ్చిన వ్యాఖ్యలతో ఎన్నికలపై చర్చ జోరందుకుంది. ప్రస్తుతం ఏ గ్రామంలో చూసినా రిజర్వేషన్ ఎవరికి వస్తుంది.. ఈసారి ఎవరిని సర్పంచ్‌గా ఎన్నుకుందాం.. పార్టీల మార్పులు.. వంటి వాటిపైనే చర్చ సాగుతోంది. గత మూడు నెలలుగా సర్పంచ్‌లకు పరోక్ష ఎన్నికలు జరిపిస్తామని కేసీఆర్ సూత్రప్రాయంగా ప్రకటించినప్పటి నుంచే పల్లెల్లో రాజకీయ వాతావరణం కొంత మారినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం గ్రామ కూడళ్లలో, టీకొట్ల వద్ద పంచాయతీ ఎన్నికల విషయమై చర్చించుకుంటున్నారు. ఆశావాహులు ఇప్పటి నుంచే తమ బలం పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎన్నిక పరోక్షమా..? ప్రత్యక్షమా..? అనే అంశంపై స్పష్టత రాకపోవడంతో ఏదైతే తమకు అనుకూలంగా ఉంటుందనే అంశాలపై లెక్కలు వేస్తున్నారు. బరిలో నిలవనున్న నేతలు ఇప్పటి నుంచే తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఎవరికి కలిసొస్తుందో..! 2019లో జరిగే శాసనసభ, పార్లమెంట్ ఎన్నికలకు ప్రీఫైనల్‌గా భావించే పంచాయతీ ఎన్నికలు ముందస్తుగా నిర్వహించేందుకు కేసీఆర్ సంకేతాలు ఇచ్చారు. దీంతో జిల్లాలో ముందస్తు పంచాయతీ ఎన్నికలు ఏ పార్టీకి కలిసొస్తుందోననే ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీల గుర్తుపై ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం చట్టంలో మార్పులు తెస్తుందన్న సమాచారంతో పార్టీల పరంగా కూడా లెక్కలు వేస్తున్నారు. జిల్లాలో ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాలతోపాటు ఖానాపూర్ నియోజకవర్గంలోని ఉట్నూర్, ఇంద్రవెల్లి, ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని నార్నూర్ మండలాలు ఉన్నాయి. ఈ నాలుగు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. టీఆర్ఎస్ అధికారంలో ఉండడంతో ఈ ప్రభావం ఎన్నికలపై పడే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు. ప్రభుత్వం మరో ఏడాదిన్నర పాటు అధికారంలో ఉంటుంది. దీంతో పార్టీల గుర్తులపై పంచాయతీ ఎన్నికలు జరిగితే ఫలితాలు ఆ పార్టీకి కొంత మెరుగ్గా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి మూడున్నరేళ్లు గడుస్తుండడంతో ప్రజలు ఏ మేరకు ఆ పార్టీని ఆదరిస్తారో చూడాలి. ఇక ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు పంచాయతీ ఎన్నికలపై దృష్టి పెట్టాయి. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తేనే పంచాయతీలపై ఆ పార్టీ పట్టు సాధించే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ముందస్తు పంచాయతీ ఎన్నికలపై ఆయా పార్టీలు బలాబలాలను బేరీజు వేసుకుంటున్నట్లు తెలుస్తోంది. విలీన గ్రామాలు, కొత్త పంచాయతీలపై సందిగ్ధత.. ప్రభుత్వం తరచూ ప్రకటిస్తున్న కొత్త పంచాయతీలు, నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రతిపాదన దశలోనే ఉన్నాయి. తండాలు, గూడేలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేస్తామని గత మూడున్నరేళ్లుగా ప్రభుత్వం ప్రకటిస్తోంది. జిల్లాలో ప్రస్తుతం 243 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇటీవల అధికారులు మరో 225 పంచాయతీలకు ప్రతిపాదనలు పంపారు. వీటిలో ప్రభుత్వం ఎన్నింటికి ఆమోదం తెలుపుతోందో చూడాలి. కొత్త పంచాయతీల ఏర్పాటుతోపాటు గతంలో ప్రభుత్వం మున్సిపాలిటీల్లో చుట్టుపక్కల గ్రామాలను విలీనం చేస్తామన్న ప్రకటించింది. ఒకవేళ ఫిబ్రవరిలోనే ఎన్నికలు వస్తే విలీన గ్రామాల అంశం సందిగ్ధంలోనే ఉంటుంది. జిల్లాలో ఆదిలాబాద్ ఒక్కటే మున్సిపాలిటీ ఉంది. 3 నుంచి 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్న గ్రామాలను విలీనం చేసేందుకు ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది. ఆదిలాబాద్ జిల్లాలోని మావల మేజర్ గ్రామ పంచాయతీ, బట్టిసవర్గాం, రాంపూర్, పొన్నారి, లాండసాంగ్వి, పొచ్చర, చాందా–టి గ్రామాలు విలీనం చేసేందుకు ప్రతిపాదనలు ఉన్నాయి. విలీన గ్రామాలపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం వెల్లడించడం లేదు. దీంతో ముందస్తు పంచాయతీ ఎన్నికలు జరిగితే ఈ గ్రామాలు విలీనం చేస్తారా.. లేదా అన్న సందిగ్ధత నెలకొంది. -
పల్లె ఓటర్లే కీలకం!
విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్: సాధారణ ఎన్నికల్లో పల్లె ఓటర్లే అభ్యర్థుల విజయంలో కీలక పాత్ర పోషించనున్నారు. జిల్లాలో పట్టణాల్లో కంటే పల్లెల్లోనే అధిక మంది ఓటర్లు ఉండడంతో అభ్యర్థులంతా ప్రచారానికి గ్రామాల వైపు పరుగులు తీస్తున్నారు. జిల్లాలో తొమ్మిది అసెంబ్లీ, ఒక ఎంపీ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే నామినేషన్ల పర్వం పూర్తయిన నేపథ్యంలో నామినేషన్ల పరి శీలన, ఉపసంహరణ తరువాత అభ్యర్థులు ప్రచారంలో పూర్తిస్థయిలో నిమగ్నం కానున్నారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో కంటే 921 పంచాయతీల్లోనే ఓటర్లు అధి కంగా ఉండడంతో అభ్యర్థులు వారిని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. జిల్లా వ్యాప్తంగా 16,86,020 మంది ఓటర్లు ఉండగా ఇందులో పల్లెల్లోనే 13,85,577 మంది ఓటర్లు ఉన్నారు. అంటే దాదాపు 82.12 శాతం ఓటర్లు పల్లెల్లోనే ఉన్నారు. దీంతో సాధారణంగానే నా యకులు పల్లె ఓటర్ల వైపు దృష్టిసారిస్తున్నారు. దీంతో దాదాపు అన్ని పార్టీల అభ్యర్థులూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రచారాలకు ఊపునిస్తున్నారు. పల్లెప్రాంతాల్లోని ఓట ర్లు ఎవరికి ఓటు వేస్తారోరని రాజకీయ విశ్లేషకులతో పాటు అభ్యర్థులు కూడా ఎదురుచూస్తున్నారు. ఈ మే రకు అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త పథకాలతో ముందుకు వెళ్తున్నారు. వారిని తమ వైపు తిప్పుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. అయితే ఈసారి ఎన్నికల్లో ఎక్కువ మంది వైఎస్సార్ సీపీ వైపు ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది. కాగా జిల్లాలో ఓటర్ల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 16,86,020 మంది ఓటర్లు ఉండగా.. ఈనెల 19వ తేదీ నాటికి ఆ సంఖ్య 17,18,784 మందికి చేరింది.