విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్: సాధారణ ఎన్నికల్లో పల్లె ఓటర్లే అభ్యర్థుల విజయంలో కీలక పాత్ర పోషించనున్నారు. జిల్లాలో పట్టణాల్లో కంటే పల్లెల్లోనే అధిక మంది ఓటర్లు ఉండడంతో అభ్యర్థులంతా ప్రచారానికి గ్రామాల వైపు పరుగులు తీస్తున్నారు. జిల్లాలో తొమ్మిది అసెంబ్లీ, ఒక ఎంపీ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే నామినేషన్ల పర్వం పూర్తయిన నేపథ్యంలో నామినేషన్ల పరి శీలన, ఉపసంహరణ తరువాత అభ్యర్థులు ప్రచారంలో పూర్తిస్థయిలో నిమగ్నం కానున్నారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో కంటే 921 పంచాయతీల్లోనే ఓటర్లు అధి కంగా ఉండడంతో అభ్యర్థులు వారిని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు.
జిల్లా వ్యాప్తంగా 16,86,020 మంది ఓటర్లు ఉండగా ఇందులో పల్లెల్లోనే 13,85,577 మంది ఓటర్లు ఉన్నారు. అంటే దాదాపు 82.12 శాతం ఓటర్లు పల్లెల్లోనే ఉన్నారు. దీంతో సాధారణంగానే నా యకులు పల్లె ఓటర్ల వైపు దృష్టిసారిస్తున్నారు. దీంతో దాదాపు అన్ని పార్టీల అభ్యర్థులూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రచారాలకు ఊపునిస్తున్నారు. పల్లెప్రాంతాల్లోని ఓట ర్లు ఎవరికి ఓటు వేస్తారోరని రాజకీయ విశ్లేషకులతో పాటు అభ్యర్థులు కూడా ఎదురుచూస్తున్నారు. ఈ మే రకు అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త పథకాలతో ముందుకు వెళ్తున్నారు. వారిని తమ వైపు తిప్పుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. అయితే ఈసారి ఎన్నికల్లో ఎక్కువ మంది వైఎస్సార్ సీపీ వైపు ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది. కాగా జిల్లాలో ఓటర్ల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 16,86,020 మంది ఓటర్లు ఉండగా.. ఈనెల 19వ తేదీ నాటికి ఆ సంఖ్య 17,18,784 మందికి చేరింది.
పల్లె ఓటర్లే కీలకం!
Published Tue, Apr 22 2014 1:44 AM | Last Updated on Sat, Sep 2 2017 6:20 AM
Advertisement