విజయనగరం మున్సిపాలిటీ/ అర్బన్, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల్లో విజయనగరం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అభ్యర్థులెవరు తమకు న్యాయం చేయలేరంటూ పలువురు ఓటర్లు నోటా ఓటును విని యోగించారు. ఇలా జిల్లా మొత్తం మీద 9,407 మంది నోటా మీట నొక్కారు. విజయనగరం నియోజకవర్గం లో 2లక్షల 16వేల 301 ఓట్లు ఉండగా... అందులో లక్షా 53వేల 923 ఓట్లు పోలయ్యాయి. శుక్రవారం జరిగిన ఓట్ల లెక్కింపులో ప్రతి రౌండ్‌లో నోటా ఓట్లు పోలయ్యా యి. నియోజకవర్గం నుంచి మొత్తం 11 మంది అభ్యర్థు లు బరిలో నిలవగా వారెవ్వరనీ కాదని 1148 ఓటర్లు నోటా బటన్ నొక్కి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంతేకాకుండా పోస్టల్ బ్యాలెట్ ద్వారా మొత్తం 1188 ఓట్లు పోలవ్వగా... అందులో ఆరు ఓట్లు నోటా కింద నమోదయ్యాయని అధికారులు పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారిగా కేంద్ర ఎన్నిక ల సంఘం ప్రవేశ పెట్టిన ఈ పద్ధతిని ఇంత మంది ఓటర్లు వినియోగించడం గమనార్హం.
చీపురుపల్లిలో..
చీపురుపల్లి: నియోజకవర్గంలో ఎంఎల్‌ఏ అభ్యర్థులుగా పోటీ చేసిన వారిని తిరస్కరించిన వారు కూడా వందల సంఖ్యలోనే ఉన్నారు. చీపురుపల్లి నియోజకవర్గానికి ఎమ్మె ల్యే అభ్యర్థిగా ప్రధాన పార్టీలతో పాటు 11 మంది బరిలో ఉన్నారు. అయితే వీరెవరూ తమకొద్దంటూ తిరస్కరించిన వారు నియోజకవర్గంలో 763 మంది ఉన్నా రు. ఈ నెల 7న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చీపురుపల్లి నియోజవకర్గంలోని 1,53,452 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఎన్నికల కమిషన్ కొత్తగా అమల్లోకి తీసుకొచ్చిన నోటా బటన్(తిరస్కరణ)కింద 11 మంది అభ్యర్థులను నియోజకవర్గంలోని 763 మంది తిరస్కరించారు.
నెల్లిమర్లలో..
నెల్లిమర్ల రూరల్: సాధారణ ఎన్నికల్లో నెల్లిమర్ల నియోజక వర్గానికి సంబంధించి 679 ఓట్లు నోటా(తిరస్కరణ)కు పడ్డాయి. నియోజక వర్గం నుంచి మొత్తం పది మంది అభ్యర్థులు ఈ సారి ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే వీరెవరినీ కాదని 679 మంది ఓటర్లు నోటాను ఎంచుకున్నారు. అత్యధికంగా భోగాపురం మండలం నుంచి 181 మంది ఓటర్లు అభ్యర్థులు ఎవరూ తమకు నచ్చలేని నోటా ద్వారా స్పష్టం చేశారు. అలాగే నెల్లిమర్ల మండలం నుంచి మరో 156 మంది నోటాను ఎంచుకున్నారు. పూసపాటిరేగ మండలం నుంచి 171 మంది ఓటర్లు , డెంకాడ మండలం నుంచి 173 మంది ఓటర్లు నోటాకు ఓటు వేశారు. అలాగే పార్వతీపురంలో 827, ఎస్.కోట 1136, బొబ్బిలిలో 537, కురుపాంలో 2077, గజపతినగరంలో 755, సాలూరులో 1485 ఓట్లు నోటాకు పడ్డాయి.
చీపురుపల్లి 763
పార్వతీపురం 827
ఎస్.కోట 1136
సాలూరు 1485
విజయనగరం 1148
నెల్లిమర్ల 679
గజపతినగరం 755
కురుపాం 2077
బొబ్బిలి 537
అభ్యర్థులను తిరస్కరిస్తూ 9407 ఓట్లు
Published Sat, May 17 2014 2:03 AM | Last Updated on Sat, Sep 2 2017 7:26 AM
Advertisement
Advertisement