పల్లెతల్లి కన్నీళ్లు తుడిచే బడ్జెట్
► ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు
మందమర్రి : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి బడ్జెట్ పల్లెతల్లి కన్నీళ్లు తుడిచేవిధంగా ఉందని ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు అన్నారు. మంగళవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో అర్థంకాని అంకెలతో గందరగోళంగా ప్రవేశపెట్టిన బడ్జెట్ వల్ల తెలంగాణలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. మన రాష్ట్రాన్ని మనం పాలించుకుంటే అభివృద్ధి చేసుకునే అవకాశం మనకే ఉంటుందని ఈ బడ్జెట్ నిరూపించిందన్నారు.
రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజల అభివృద్ధికి దోహదపడే విధంగా బడ్జెట్లో కేటాయింపులు జరిపారని పేర్కొన్నారు. యాదవులకు కుటుంబానికి 20 గొర్రెలు, ఒక పొట్టేలు 75 శాతం సబ్సిడీపై అందజేత, గంగపుత్రులు, ముదిరాజ్‌లకు చేపపిల్లల పంపిణీ, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ఆర్థిక సహాయం రూ.51వేల నుంచి రూ.71వేలకు పెంపు, ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాలను ప్రోత్సహించేందుకు కేసీఆర్ కిట్, రూ.12వేల ఆర్థిక లబ్ధి వంటి సంక్షేమ పథకాలు హర్షణీయమన్నారు. సమావేశంలో జెడ్పీటీసీ సుదర్శన్‌గౌడ్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.