VIP passes
-
గాంధీభవన్‌లో దండోరా సభ పాస్‌ల గొడవ
హైదరాబాద్: గాంధీభవన్‌లో దండోరా సభ పాస్‌ల గొడవ తీవ్ర దుమారాన్ని రేపింది. కాగా, సభకు సంబంధించి తమకు పాస్‌లు ఇవ్వలేదని కాంగ్రెస్ నాయకులు సత్యనారాయణ, నిరంజన్లు గాంధీభవన్‌లో ఆందోళన చేపట్టారు. సీనియర్లకు వీఐపీ పాస్‌లు ఇవ్వలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, టీడీపీ నుంచి వచ్చిన వారి పెత్తనమేంటని సీనియర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. -
'షిర్డీ' వీఐపీ పాస్‌ల ధర పెంపు
ముంబై (మహరాష్ట్ర) : ప్రముఖ పుణ్యక్షేత్రం షిర్డీలో వీఐపీ దర్శనం పాస్‌ల ధర పెంచుతూ సాయబాబా సంస్థాన్ ట్రస్టు (ఎస్ఎస్ఎస్టీ) నిర్ణయం తీసుకుంది. సంస్థాన్ కార్యనిర్వాహక అధికారి బాజీరావ్ షిండే ఈ మేరకు శుక్రవారం వివరాలు వెల్లడించారు. వీఐపీ పాస్ ధరను రూ.100 నుంచి రూ.200కు, ఉదయం హారతి (కాకడ్) వీఐపీ పాస్ ధరను రూ.500 నుంచి రూ.600కు పెంచినట్లు చెప్పారు. మధ్యాహ్నం హారతి ధర కూడా రూ.300 నుంచి రూ.400కు పెంచామని, పెంచిన ధరలు మార్చి ఒకటి నుంచి అమలులోకి వస్తాయని తెలిపారు. సాధారణ భక్తులకు ప్రసాదం (స్వీట్మీట్) ఉచితంగా అందించనున్నట్లు చెప్పారు. భక్త నివాస్‌లో మార్చి ఒకటి నుంచి పాస్ విక్రయ కౌంటర్ ప్రారంభించనున్నట్లు ఎస్ఎస్ఎస్టీ వెల్లడించింది. -
కనకమ్మకు నీరాజనం
వైభవంగా తొలి గురువారం పూజలు లక్షకు పైబడి అమ్మవారిని దర్శించుకున్న భక్తులు డాబాగార్డెన్స్ : ఉత్తరాంధ్రుల కల్పవల్లి, భక్తుల కొంగు బంగారం శ్రీకనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో తొలి గురువారం పూజలను వైభవంగా నిర్వహించారు. మార్గశిర మాసోత్సవాలలో అమ్మవారి దర్శన భాగ్యం కోసం భక్తులు తపిస్తారు. అందునా గురువారం దర్శించుకునేందుకు జన సంద్రమై పోటెత్తుతారు. తొలి గురువారం లక్షమందికి పైగా భక్తులు కనకమ్మను దర్శించినట్టు అంచనా. బుధవారం అర్ధరాత్రి నుంచే భక్తుల తాకిడి మొదలైంది. క్యూలైన్లు టౌన్కొత్తరోడ్డును తాకాయి. దర్శనానికి మూడు నుంచి నాలుగు గంటల సమయం పట్టింది. ఈ దఫా సామాన్య భక్తులకే ప్రాధాన్యత కల్పించారు. వీఐపీ పాసులకు భారీగా కోత పెట్టడంతో భక్తులకు ఇబ్బంది కలగలేదు. పాసుకు రూ.100 ధర నిర్ణయించారు. అవీ కూడా రెండు వేలు మాత్రమే జారీ చేశారు. జిల్లా కలెక్టర్ ఎన్.యువరాజ్ ఆదేశాల మేరకు ఇక్కడి నిబంధనలను కఠినతరం చేశారు. అర్ధరాత్రి నుంచి వేకువజాము వరకు భక్తుల తాకిడి సాధారణంగా కనిపించినా ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రద్దీ అధికంగా ఉంది. సాయంత్రం కూడా భారీ సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. తొలి పూజను దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్, సీఎంఆర్ అధినేత మావూరి వెంకటరమణ నిర్వహించగా మంత్రి గంటా శ్రీనివాసరావు ఉదయం 10 గంటల ప్రాంతంలో అమ్మవారి ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా సాయంత్రం ఆలయ ప్రాంగణంలో హరికథా గానం భక్తులను అలరించింది. తెల్లవారుజామున, సాయంత్రం అమ్మవారికి విశేష పంచామృతాభిషేకాలు, సహస్రనామార్చనలు జరిపారు. స్వర్ణాభరణాలతో అలంకరించారు. ఆలయ మండపంలో శ్రీచక్రనవార్చన, శ్రీలక్ష్మీ హోమాలు, ప్రత్యేక కుంకుమ పూజలు జరిపారు. 24 గంటలూ ఆలయం తెరిచే ఉంచారు. తోపులాటలు జరగకుండా ప్రత్యేక క్యూలైన్లు ఏర్పా టు చేశారు. పోలీస్ బందోబస్తు పటిష్టం చేశారు. అగ్నిమాపక వాహనాన్ని ఆలయం సమీపంలోనే అందుబాటులో ఉంచారు. మొబైల్ టాయ్‌లెట్‌ను ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ నీటి సౌకర్యం లేకపోవడంతో కొంతమంది ఇబ్బందిపడ్డారు. పోలీసులు ట్రాఫిక్‌ను మళ్లించారు. కురుపాం మార్కెట్, పాతపోస్టాఫీస్‌కు వెళ్లే వారి కోసం టౌన్ కొత్తరోడ్డు వద్దనే ట్రాఫిక్‌ను మళ్లించారు. ప్రభుత్వ విక్టోరియా ఆసుపత్రి (ఘోషా ఆస్పత్రి) వద్ద స్టాపర్లను ఏర్పాటు చేసి ఎటువంటి వాహనాలను అనుమతించలేదు. -
టీటీడీలో వీఐపీ పాస్‌ల దందా
తిరుమల: కలియుగ పుణ్యక్షేత్రమైన తిరుమలలో కొలువైన శ్రీ వేంకటేశ్వరుడిని దర్శించుకునేందుకు నిత్యం వేలాదిమంది భక్తులు వస్తుంటారు. ఏడుకొండలవాడిని కనులార వీక్షించేందుకు భక్తులు బారులుతీరి మరీ వేచివుంటారు. నిత్యం భక్తులతో కిటికిటలాడే తిరుమల తిరుపతి దేవస్థానంలో వీఐపీ పాస్‌ల దందా యధేచ్ఛగా కొనసాగుతోంది. టీటీడీ ఛైర్మన్ ఆఫీసు వద్ద ఛైర్మన్ సిబ్బంది పబ్లిక్‌గా వీఐపీ పాసులను అమ్ముకుంటూ దందా చేస్తున్న వైనం సాక్షి కెమెరాకు చిక్కింది. వీఐపీల పాసుల పేరుతో టీటీడీ సిబ్బంది వేలకు వేలకు వసూళ్లకు పాల్పడుతున్నట్టు సమాచారం. -
వీఐపీలకే దర్శనభాగ్యమా?
సామాన్యులకు దూరమవుతున్న ఆపదమొక్కులవాడు ఒకటో తేదీ, ఏకాదశికి క్యూ కడుతున్న వీఐపీలు.. బంధుగణంతో సుమారు 180 మంది ఎంఎల్ఏలు, 30 మంది ఎంఎల్సీలు సాక్షి, తిరుమల: ఆపద మొక్కులవాడా...అని మొక్కగానే కష్టాలను తీర్చే తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం సామాన్య భక్తులకు రోజురోజుకీ దూరమవుతోంది. ఒకప్పుడు పది అడుగుల దూరంలోని కులశేఖరపడి నుంచే ఆ దేవదేవుని రూపాన్ని దర్శించుకుని భక్తులు తన్మయత్వం పొందేవారు. రద్దీని బూచిగా చూపి మహాలఘు దర్శనం పేరుతో 70 అడుగుల దూరానికి సామాన్య భక్తులను నెట్టివేశారు. ఇక కొత్త సంవత్సరం, వైకుంఠ ఏకాదశి రోజుల్లో సామాన్య భక్తులకు స్వామి దర్శనం గగనమైపోతోంది. ప్రతిసారి ధర్నాలు, ఆందోళనలు, తోపులాటలు, తొక్కిసలాటలు జరిగినా టీటీడీ ధర్మకర్తల మండలి పెద్దలు, అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా వేలాది బంధుగణంతో తరలి వచ్చే వీవీఐపీలు, రాజకీయ నేతలు, ప్రజా పతినిధులు, వ్యాపార, వాణిజ్య వేత్తలకు ఎర్ర తివాచీ వేసేందుకు టీటీడీ మరోసారి సమాయత్తమవుతోంది. వైకుంఠ ఏకాదశి రోజున ఏకంగా పదివేల వీఐపీ టికెట్లు ఇచ్చే అవకాశం ఉందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. అంటే ఈ ఏడాది కూడా సామాన్య భక్తులకు అష్ట కష్టాలు తప్పవన్నమాట! పెరుగుతున్న సామాన్య భక్తులు.. తప్పని అగచాట్లు... తిరుమలకు సరాసరిగా రోజుకి 80వేలు, రద్దీ రోజుల్లో లక్ష, కొత్త సంవత్సరం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో రోజుకు లక్షన్నర వరకు భక్తులు వస్తారు. 1933 నుంచి 1970 వరకూ భక్తులు మహాద్వారం నుంచి నేరుగా ఆలయంలోకి వెళ్లి పది నిమిషాల్లోనే స్వామిని దర్శించుకుని వచ్చేవారు. 1945, ఏప్రిల్ 10న మొదటి ఘాట్‌రోడ్డు ప్రారంభమైన తర్వాత 1952 టీటీడీ లెక్కల ప్రకారం రోజుకు 2 వేలమంది స్వామిని దర్శించుకోగా... 2012 నాటికి 2.73 కోట్లకు పెరిగింది. ఇక 2013వ సంవత్సరం ఇప్పటివరకు సుమారు 3 కోట్లకు చేరింది. వీరిలో కేవలం నాలుగు నుంచి ఐదు శాతం మినహా అందరూ సామాన్య భక్తులే. ఎటువంటి సిఫారసులు లేకుండానే 10 గంటల నుంచి 36 గంటల పాటు కూడా క్యూలో నిరీక్షించి స్వామివారినిదర్శించుకుంటారు. ఇందులో కంపార్ట్మెంట్లలో రోజుల తరబడి వేచి ఉండే సర్వదర్శనం... అలిపిరి, శ్రీవారి మెట్టు కాలిబాటల్లో నడిచి తిరుమలకు వచ్చి తిరిగి 10 నుంచి 16 గంటలపాటు క్యూలైన్లలో వేచి ఉండి దర్శించుకునే దివ్యదర్శనం... చంటి బిడ్డలతో వచ్చిన తల్లిదండ్రులు, వృద్ధులు, వికలాంగులు దర్శనం.... తిరుమలలో ఎవరి సిఫారసు లేకుండానే 8 నుంచి 15 గంటలపాటు క్యూలైన్లలో వేచి ఉండే రూ.300 టికెట్ల భక్తులు... ఈ- దర్శన్ కేంద్రాల్లో అడ్వాన్స్ బుకింగ్ కింద రూ.50 టికెట్ల సుదర్శనం... అర్ధరాత్రుల వరకు మేల్కొని ఆన్లైన్ ద్వారా ముందస్తుగా బుక్ చేసుకునే ఆర్జిత సేవా భక్తులు ఉన్నారు. వీరిలో ఆర్జిత సేవా భక్తులు మినహా మిగిలినవారు గంటల నుంచి రోజుల తరబడి క్యూలో నిరీక్షించిన తర్వాత స్వామి దర్శనం లభిస్తోంది. విశిష్ట పర్వదినాలు, వారాంతపు రద్దీరోజుల్లోనే కాదు సాధారణ రోజుల్లో కూడా భక్తుల ఆగచాట్లు నిత్యకృత్యం. మరోవైపు వీఐపీలు రాజమార్గంలో వెళ్లి అరగంట నుంచి గంటలోపే స్వామివారిని దర్శించుకుంటున్నారు. కొత్త సంవత్సరం, ఏకాదశిలో వీఐపీలకే ఎర్ర తివాచీ.. 2014 కొత్త సంవత్సరం జనవరి 1వ తేదీ, 11వ తేదీ వైకుంఠ ఏకాదశి, 12వ తేదీ ద్వాదశి పర్వదినాల్లో వీఐపీ దర్శనాల కోసం తిరుమలకు తరలివచ్చే ప్రముఖులకు బస, దర్శన విషయంలో టీటీడీ పెద్దలు ఎర్ర తివాచీ సిద్ధం చేశారు. బంధుగణంతో సుమారు 180 మంది ఎంఎల్ఏలు, 30 మంది ఎంఎల్సీలు, మరో 25 మంది ఎంపీలు, 100 మందికి పైగా కేంద్ర , రాష్ట్ర ఉన్నతాధికారులు, జ్యుడీషియల్, వ్యాపార, వాణిజ్యవేత్తల రాకపై ఇప్పటికే టీటీడీకి సమాచారం అందింది. తిరుమలకు వస్తామో?రామో అన్న విషయం ఇంకా స్పష్టం కాకపోయినా తమపేరుతో తమ బంధుగణానికి శ్రీవారి సన్నిధిలో బస, దర్శన ఏర్పాట్లు సిద్ధం చేసుకోవటంలో నేతలు, అధికారులు బిజీబిజీ అయ్యారు. ఇందుకోసం ప్రత్యేకంగా రిసెప్షన్, ఆలయ అధికారులు, ఇంజనీర్లతో కూడిన అధికారులతో కమిటీలు కూడా వేసేశారు. తిరుమలకు వచ్చే వీఐపీకి బస, దర్శనం విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా రాచమర్యాదలు చేయాలని అధికారికంగా ఉత్తర్వులు సైతం ఇచ్చేశారు. దీంతో సంబంధిత టీటీడీ కింది స్థాయి అధికారులు కూడా ప్రముఖుల సేవకు సిద్ధమవుతున్నారు.