Visakapatnam Airport
-
విశాఖలో ఎయిర్ ఇండియా విమానం నిలిపివేత
సాక్షి, విశాఖపట్టణం : అండమాన్ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానాన్ని సాంకేతిక లోపం వల్ల విశాఖలో శుక్రవారం నిలిపివేశారు. విమానంలో 90 మంది ప్రయాణీకులు ఉండగా వారికి విశాఖలోనే వసతి, భోజన సదుపాయాలను ఎయిర్ ఇండియా సంస్థ ఏర్పాటు చేసింది. విమానంలో సాంకేతిక లోపాన్ని సరిచేసిన తర్వాత రేపు (శనివారం) విమానం ఢిల్లీ బయలుదేరి వెళ్తుందని ఎయిర్ ఇండియా తెలిపింది. -
విశాఖ ఎయిర్పోర్టులో వేట కత్తితో వ్యక్తి కలకలం
-
విశాఖ ఎయిర్పోర్టులో మళ్లీ కత్తి కలకలం
విశాఖపట్నం: విశాఖపట్నం ఎయిర్పోర్టులో మళ్లీ కత్తి కలకలం రేగింది. శుక్రవారం ఓ వ్యక్తి వేట కత్తి చేతిలో పట్టుకుని ఎయిర్పోర్టు లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నించాడు. పార్కింగ్ నుంచి ఇన్గేట్ వరకు ఆ వ్యక్తి వెళ్లాడు. వెంటనే అప్రమత్తమైన సీఆర్పీఎఫ్ సిబ్బంది ఆ వ్యక్తిని పట్టుకుని కత్తిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఎయిర్పోర్టు పోలీసులకు అప్పగించారు. విచారణలో సదరు వ్యక్తికి మతిస్థిమితం సరిగా లేదని గుర్తించారు. ఆ వ్యక్తి పరవాడకు చెందిన లోవరాజుగా గుర్తించారు. ఎన్నికల ఫలితాల మరుసటి రోజు ఎయిర్పోర్ట్కు వీఐపీల తాకిడి ఎక్కువ కావడంతో భద్రతా సిబ్బంది మరింత అప్రమత్తమయ్యారు. -
‘ఆపరేషన్ గరుడ వెనుక ఉన్నది చంద్రబాబే’
-
విశాఖ ఎయిర్పోర్ట్ సమీపంలో రోడ్డుప్రమాదం
విశాఖపట్నం: విశాఖ ఎయిర్పోర్ట్ సమీపంలో సోమవారం ఉదయం జరిగిన రోడ్డుప్రమాదంలో ఒకరు మృతిచెందగా, నలుగురికి స్వల్పగాయాలయ్యాయి. కాకానినగర్ వద్ద ఓ కారు అదుపు తప్పి వాకర్స్ పైకి దూసుకెళ్లడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు. ఈ ప్రమాదానికి పొగమంచు కారణంగా పోలీసులు భావిస్తున్నారు. దట్టంగా ఆవరించిన పొగమంచులో వాకింగ్ చేయడం శ్రేయస్కరం కాదని ట్రాఫిక్ సీఐ మళ్లా శేషు సూచించారు. ఈ ఘటనలో గాయపడ్డ నలుగురిని చికిత్స మేరకు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం.