విశాఖ ఎయిర్‌పోర్ట్‌ సమీపంలో రోడ్డుప్రమాదం | One man dead, 4 injured in Road accident near Visakapatnam Airport | Sakshi
Sakshi News home page

విశాఖ ఎయిర్‌పోర్ట్‌ సమీపంలో రోడ్డుప్రమాదం

Published Mon, Dec 23 2013 8:11 AM | Last Updated on Tue, Aug 14 2018 3:22 PM

One man dead, 4 injured in Road accident near Visakapatnam Airport

విశాఖపట్నం: విశాఖ ఎయిర్‌పోర్ట్‌ సమీపంలో సోమవారం ఉదయం జరిగిన రోడ్డుప్రమాదంలో ఒకరు మృతిచెందగా, నలుగురికి స్వల్పగాయాలయ్యాయి. కాకానినగర్ వద్ద ఓ కారు అదుపు తప్పి వాకర్స్ పైకి దూసుకెళ్లడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు.

ఈ ప్రమాదానికి పొగమంచు కారణంగా పోలీసులు భావిస్తున్నారు. దట్టంగా ఆవరించిన పొగమంచులో వాకింగ్ చేయడం శ్రేయస్కరం కాదని ట్రాఫిక్ సీఐ మళ్లా శేషు సూచించారు. ఈ ఘటనలో గాయపడ్డ  నలుగురిని చికిత్స మేరకు  ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement