ఇది సర్కారు ‘కిక్’!
త్వరలో 94చోట్ల ప్రభుత్వ మద్యం దుకాణాలు
అనుమతివ్వడమే తరువాయి
గాజువాక, అనకాపల్లి పరిధిలో
ఎక్సయిజ్ శాఖ సన్నాహాలు
విశాఖపట్నం : జిల్లాలో 94 చోట్ల ప్రభుత్వ మద్యం దుకాణాలు తెరుచుకోనున్నాయి. ప్రభుత్వ ఆదేశాలు జారీ అయిన వెంటనే ఈ దుకాణాలకు తెరవాలని ఎక్సైజ్ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. అనకాపల్లి, గాజువాక పరిధిలోనే ఈ దుకాణాలు ఉండడంతో త్వరలోనే వీటిని ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. నాలుగో విడత మద్యం దుకాణాల ఏర్పాటుకు 97 చోట్ల దరఖాస్తులు ఆహ్వానిస్తే ముగ్గురే ముందుకొచ్చారు.
దీంతో శుక్రవారం ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో అసిస్టెంట్ జాయింట్ కలెక్టర్ నర్సింహారావు సమక్షంలో ఆ ముగ్గురికీ దుకాణాలను కేటాయించారు. 94 మద్యం దుకాణాలకు ఒక్కరూ ముందుకు రాలేదు. ఖాళీగా ఉన్న 94 చోట్ల ప్రభుత్వ మద్యం ఔట్లెట్లు పెట్టేందుకు ప్రభుత్వానికి సిఫారసు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి అనుమతి కోసం ఎదురు చూస్తున్నారు.