visitors details
-
వదంతులకు ‘ఆధార్’తో చెక్
నర్సింగ్‌పూర్: పిల్లలను ఎత్తుకుపోయేవాళ్లు తిరుగుతున్నారన్న ఫేక్ వార్తలు మధ్యప్రదేశ్ గ్రామాల్లో కొన్నిరోజులుగా ఆందోళన రేకెత్తిస్తూండగా.. ఈ సమస్యను అధిగమించేందుకు జమార్ గ్రామ ప్రజలు ఓ వినూత్నమైన ప్రయత్నం మొదలుపెట్టారు. అన్ని రకాల పనులకు ఆధార‘భూతం’గా నిలిచిన ఆధార్ కార్డు లేనిదే గ్రామంలోకి ఎవరినీ అనుమతించేది లేదని భీష్మించారు ఈ గ్రామస్తులు. ఆధార్ లేదా అలాంటి ఏదైనా గుర్తింపు కార్డు ఉంటేనే తమ గ్రామంలోకి అడుగుపెట్టాలని వీరు స్పష్టం చేస్తున్నారు. పిల్లలను ఎత్తుకుపోయే వాళ్లు తిరుగుతున్నారన్న పుకార్లు రావడంతో గ్రామ సేవకులు కొందరు ఇంటింటికీ తిరిగి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. అంతేకాకుండా.. సోషల్‌మీడియాలో వచ్చే సమాచారాన్ని నిర్ధారించుకున్న తరువాతే ఫార్వర్డ్ చేయాలని సూచించారు. ఈ నేపథ్యంలోనే ఆధార్ ఆధారంగా అపరిచితులను గుర్తించడం గ్రామంలో మొదలైంది. ఈ పని మొదలుపెట్టిన తరువాత ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నామని గ్రామస్తులు తెలిపారు. -
ఇక ఏం చెప్పం.. నేను వెళ్లాకే తెలుస్తాయి: ట్రంప్
వాషింగ్టన్: మరోసారి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మొండివైఖరి బయటపడింది. ఆయన ఏ విషయాన్ని కాపీ కొట్టబోరని, మంచి విధానమే అయినప్పటికీ పాటించబోరని తాజాగా ఇచ్చిన ఆదేశాల ద్వారా మరోసారి స్పష్టమైంది. అధ్యక్ష భవనాన్ని ఎవరెవెరు సందర్శిస్తున్నారనే విషయాన్ని తాము ఇక నుంచి చెప్పబోమని తాజాగా ట్రంప్ చెప్పారు. ఈ విషయాన్ని అమెరికా వైట్ హౌస్ శుక్రవారం ప్రకటించింది. గతంలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్‌హౌస్ సందర్శించిన వారి వివరాలు స్వచ్ఛందంగా తెలిపేవారని, ఆ విధానం తాము అమలుచేయాల్సిన అవసరం లేదని పేర్కొంది. జాతీయ భద్రతా దృష్ట్యా, స్వేచ్ఛా భంగం కారణంగా తాము ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు కూడా వివరించింది. అత్యవసరం అనుకున్నప్పుడు మాత్రమే తెలుపుతారని, లేదంటే ట్రంప్ పాలన ఉన్నన్ని రోజులు చెప్పకుండా ఆయన పగ్గాలు వదిలేసిన తర్వాత మొత్తం ఎంతమంది వచ్చారు? వారెవరు అనే వివరాలు ప్రజలకు తెలియజేస్తారని వివరించింది. ఈ కొత్త విధానానికి ట్రంప్ పచ్చజెండా ఊపుతున్నట్లు వైట్ హౌస్ పేర్కొంది.