visleshana
-
పోరు నష్టం... పొందు లాభం
గల్వాన్ లోయ ఘటన తర్వాత దిగజారిన భారత్, చైనా సంబంధాలు మెరుగుపడటానికి ఇదే సమయం. రెండు దేశాలూ బలప్రదర్శనతో ప్రయోజనం లేదని గుర్తించాయి. ప్రపంచంలోనే రెండు అతిపెద్ద దేశాలుగా... విస్తృత ప్రయోజనాలపై దృష్టి పెట్టాల్సి ఉందన్న అవగాహన కూడా పెరిగింది. దీనికితోడు, ప్రస్తుత యుద్ధ వాతావరణంలో అమెరికా ఒత్తిళ్లను తట్టుకుని మరీ రష్యాపై భారత్ ఎలాంటి వ్యతిరేక వ్యాఖ్యలూ చేయక పోవడాన్ని ‘డ్రాగన్’ గమనించకుండా ఉండదు. ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ, ప్రయోజనాలను గుర్తిస్తూ సాగడం అవసరం. పాశ్చాత్యుల మాదిరిగా స్వీయ ప్రయోజనాలు మాత్రమే చూసుకోకుండా, ఐదు వేల ఏళ్ల పురాతన సంస్కృతి నేర్పిన జ్ఞానాన్ని భారత్, చైనా ఆచరణలో పెట్టాల్సిన తరుణం ఇది. రష్యా–ఉక్రెయిన్ మధ్య యుద్ధం జోరుగా సాగుతున్న పరిస్థితులు... భారత్–చైనా సంబంధాలు మెరుగు పడేందుకు కారణం అవుతున్నాయి. వ్యూహాత్మక విషయాల్లో స్వయం ప్రతిపత్తి, స్వతంత్ర విదేశాంగ విధానం కలిగి ఉన్న భారత్... రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో ఒక పక్షం వైపు నిలబడేందుకు నిరాకరిస్తున్న విషయం... అగ్రరాజ్యం అమెరికా ఒత్తిళ్లకు లొంగని తత్వం... డ్రాగన్ దృష్టిని మీరి ఉండే అవకాశమే లేదు. కాబట్టి గల్వాన్ ఘటనను గతకాలపు జ్ఞాపకంగా వదిలేసి, ఇరు దేశాలూ తమ సంబంధాలను మళ్లీ దృఢతరం చేసుకునేందుకు ఇదే మంచి తరుణం. అలాగే భారత్ –చైనా రెండూ కలిసికట్టుగా రష్యా– ఉక్రెయిన్ యుద్ధానికి తెరదింపగలిగితే యూరప్‌లో శాంతికి ఆసియా దేశాలు కృషి చేసే అపురూప ఘట్టం ఒకటి ఆవిష్కృతమవుతుంది. రెండేళ్లుగా భారత్–చైనా సంబంధాలు బాగా దెబ్బ తిన్నాయన డంలో ఎలాంటి సందేహమూ లేదు. లదాఖ్‌లో వాస్తవాధీన రేఖ వెంబడి గల్వాన్ లోయలో ఇరు దేశాల సైనికుల ఘర్షణతో మొదలైన పతనం ఇప్పుడు పుంజుకునే అవకాశాలు ఏర్పడ్డాయి. సంబంధాలు పూర్వస్థితికి లేదా ఉచ్ఛస్థితికి చేరుకునేందుకు కొంత సమయం పట్టవచ్చు కానీ... కొత్త పరిణామాలు మాత్రం వైషమ్యం తగ్గుముఖం పట్టే ఆశను కల్పిస్తున్నాయి. చైనా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి వాంగ్ యీ నేడు భారత్ రానున్నారు. ఇదే విధంగా భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ బీజింగ్ వెళ్లే అవకాశమూ ఉంది. ఇరు దేశాల మంత్రుల పర్యటన... వచ్చే ఏడాది జరిగే ‘బ్రిక్స్’ సమావేశాల్లో పాల్గొనేందుకుగానూ ప్రధాని నరేంద్ర మోదీ చైనా పర్యటనకు రంగం సిద్ధం చేయడం అనేది నిస్సందేహం. భారత ప్రధాని హాజరీ లేకుండా బ్రిక్స్ సమావేశం జరగడం ఊహించలేము. అదే సమయంలో వాస్తవాధీన రేఖ వెంబడి పరిస్థితి ఎంతో కొంత చక్కబడకుండా భారత ప్రధాని చైనా అధ్యక్షుడు జింగ్‌పింగ్‌తో ముఖాముఖి మాట్లాడే పరిస్థితీ ఉత్పన్నం కాదు. ఇరుదేశాల మధ్య మళ్లీ స్నేహపూరిత వాతావరణం ఏర్పడేందుకు కారణాలేమిటి? బలప్రదర్శనతో ప్రయోజనం లేదని ఇరు దేశాలూ గుర్తించడం మొట్టమొదటి కారణం. ఆశ్చర్యకరమైన విషయం ఏమి టంటే... బల ప్రదర్శన నిష్ప్రయోజనమన్న విషయం ముందుగా చైనా వైపు నుంచే వ్యక్తం కావడం. ఈ నెల ఏడవ తేదీన చైనా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి మాట్లాడుతూ, ‘‘లక్ష్యాల సాధనకు ఒకరి కొకరు సహకరించుకోవాలేగానీ... ఒకరి శక్తిని ఇంకొకరు పీల్చేసు కుంటూ ఉండటం సరికాదు’’ అని వ్యాఖ్యానించారు. సరిహద్దుల్లో యాభై వేలమంది సైనికులను మోహరించడం (శక్తి), ఆయుధ వ్యవస్థలను సిద్ధంగా ఉంచుకోవడం పైనే ఈ వ్యాఖ్య అన్నది అర్థం చేసుకోవాలి. కమాండర్ల స్థాయిలో పదిహేనుసార్లు చర్చలు జరిపినా ఉద్రిక్తతల తగ్గింపు అందని మానిపండులాగే మిగిలింది మరి. రాజ కీయంగానూ పరిష్కారం కానరాని నేపథ్యంలో బల ప్రదర్శన చేయడం తర్కానికి నిలిచేది కాదు. ఆ పరిస్థితి తాలూకూ విపరిణా మాలను ఇరుదేశాలూ అనుభవించాల్సి ఉంటుంది. రెండో కారణం... ఒక చిన్న ఘటనతో ద్వైపాక్షిక సంబంధాలు ఇంత దిగజారిపోవాల్సిన అవసరం లేదని ఇరుదేశాలూ గుర్తించడం. ప్రపంచంలోనే రెండు అతిపెద్ద దేశాలుగా... విస్తృత ప్రయోజనాలపై దృష్టి పెట్టాల్సి ఉందన్న అవగాహన పెరగడం. ఆర్థిక, వాణిజ్య రంగాలతోపాటు వాతావరణ మార్పులపై పోరు, డిజిటల్ టెక్నా లజీలు, ప్రాంతీయంగా శాంతి వంటి అనేకానేక ప్రయోజనాలు ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగ్గా ఉంటేనే సాధ్యమనీ, తద్వారా ప్రపంచస్థాయిలో సరికొత్త భిన్న ధ్రువాత్మక రాజకీయాలకు రూప కల్పన చేయవచ్చుననీ భావించడం. కొన్ని అంశాల్లో ఇరు దేశాల ప్రయోజనాలూ, దృక్కోణాలూ వేరుగా ఉన్నప్పటికీ... చాలా అంశాల్లో సారూప్యతా ఉంది. సారూ ప్యతతో వచ్చే ప్రయోజనాలు పొందాలన్నా... భిన్నాభిప్రాయాల పరిణామాలను నియంత్రించాలన్నా రాజకీయంగా అత్యున్నత స్థాయి చర్చలు అత్యవసరం. గల్వాన్ ఘటన కారణంగా ఈ చర్చల ప్రక్రియ ఆగిపోవడం దురదృష్టకరం. ఈ ఘటనకు ముందు మోదీ, జింగ్పింగ్ దాదాపు 18 సార్లు కలిసినా... ఆ తరువాత మాత్రం ఒక్క సారి కనీసం కలుసుకోలేదు. ఈ స్తబ్ధత ఇరువురికీ మేలు చేసేదేమీ కాదు. భారత్–చైనా మధ్య సంబంధాలు మెరుగుపడాల్సిన అవసరాన్ని చెప్పే ఇంకో కారణం... ప్రాంతీయంగానూ, అంతర్జాతీయంగానూ జరుగుతున్న పరిణామాలు. శాంతి, సుస్థిరతల స్థాపనలో ఇరు దేశా లకూ బాధ్యత, భాగస్వామ్యం ఉంది. అమెరికా బలగాలు వెళ్లిపోయిన తరువాత తాలిబాన్ల చేతిలో చిక్కిన అఫ్గానిస్థాన్ పునర్నిర్మాణంపై కూడా ఇరు దేశాలూ పనిచేయాల్సిన పరిస్థితి ఉంది. దక్షిణాసియా ప్రాంతంలో ఉగ్రవాదానికీ, మతపరమైన తీవ్రవాదానికీ, వేర్పాటు వాద శక్తులకూ చోటులేకుండా చూడటం కూడా అత్యవసరం. ఈ మూడు లక్ష్యాల సాధనకు పాకిస్తాన్‌తోపాటు ఈ ప్రాంతంలోని అన్ని దేశాల మ«ధ్యా చర్చలు కచ్చితంగా జరగాలి. చైనా ప్రభావం పాకిస్తాన్‌పై కూడా ఉన్న విషయం ఇక్కడ చెప్పుకోవాలి. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కూడా భారత్, చైనా తమ ఆలో చనలను మార్చుకోవాల్సిన పరిస్థితి కల్పించింది. రష్యాతో ఇరుదేశా లకూ మంచి సంబంధాలే ఉండటం దీనికి కారణం. ప్రస్తుత యుద్ధ వాతావరణంలో అమెరికా ఒత్తిళ్లను తట్టుకుని మరీ రష్యాపై భారత్ ఎలాంటి వ్యతిరేక వ్యాఖ్యలూ చేయకపోవడాన్ని చైనా కచ్చితంగా గమనించే ఉంటుంది. ‘‘కొన్ని శక్తులు రెండు ఆసియా దేశాల మధ్య విభజనను సృష్టించేందుకు ప్రయత్నించాయి’’ అన్న బీజింగ్ వ్యాఖ్య ఇక్కడ ప్రస్తావనార్హం. ప్రపంచస్థాయిలో భారత్ అవసరాన్నీ, ప్రాము ఖ్యతనూ చైనా కూడా పరోక్షంగా గుర్తు చేస్తూనే ఉంది. ‘‘భారత్– చైనా భాగస్వా ములూ, మిత్రులూ కావాల్సిన అవసరం ఉంది. ఒకరికి ఒకరు ముప్పుగా పరిణమించకుండా పరస్పర అభివృద్ధికి అవకా శంగా మారాలి’’ అంటూ వాంగ్ యీ ఇటీవల చేసిన వ్యాఖ్య ఇందుకు ఒక ఉదాహరణ. ‘‘భారత్, చైనా దేశాలు అతిపురాతన నాగరికతలకు ఆనవాళ్లు. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు మాత్రమే కాకుండా... వేరు చేయలేని ఇరుగూ పొరుగూ కూడా. ఒకరిపై ఒకరికి విశ్వాసం కలిగితే ఆ మైత్రికి హిమాలయాలూ అడ్డు కాబోవు’’ అని కూడా వాంగ్ వ్యాఖ్యానించారు. రెండేళ్ల స్తబ్ధతను ఛేదించేందుకు ఈ ఏడాది గట్టి ప్రయత్నమే జరిగింది. ఇరు దేశాల్లోనూ భారత – చైనా నాగరికతలపై చర్చలు చేపట్టాలని చైనా ప్రతిపాదించడం వీటిల్లో ముఖ్యమైనది. 2019 మే నెలలో జింగ్పింగ్ ఆసియా నాగరికతలపై ఓ చర్చా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సాధారణ ఎన్నికల నేపథ్యంలో భారత్ ఆ చర్చల్లో అధికారికంగా పాల్గొనలేకపోయింది. కానీ.. వీటిల్లో నేను పాల్గొ న్నాను. ఆ కార్యక్రమంలో జింగ్పింగ్ ఆసియా నాగరికతలు రూపు దిద్దుకోవడంలో భారత భాగస్వామ్యంపై ప్రశంసల వర్షం కురిపిం చారు. రుగ్వేదం, గంగ, సింధు నదులతోపాటు అమూల్యమైన బౌద్ధం గురించి కూడా ప్రస్తావించారు. ‘‘పరాజితులు లేని... ఇరు పక్షాలూ విజితులుగా నిలిచేదే మేలైన వివాద పరిష్కారం’’ అన్న గౌతమ బుద్ధుడి వ్యాఖ్యను ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. భారత్, చైనా కూడా ఈ మాటలకు చెవి ఒగ్గడం ఎంతైనా అవసరం. ఇరు దేశాల సరిహద్దుల్లో ఏర్పడ్డ వివాదం పరస్పరం రాజీ పడటం ద్వారా మాత్రమే పరిష్కారమవుతుంది. ఇందుకు ఇరు పక్షాలూ ముందడుగు వేయాలి. ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ, ప్రయోజనాలను గుర్తిస్తూ, పునఃసమీక్ష చేసుకుంటూ సాగడం అవసరం. పాశ్చాత్యుల మాదిరిగా స్వీయ ప్రయోజనాలు మాత్రమే చూసుకోకుండా, హింసను ప్రేరేపించకుండా... భారత్, చైనా ఐదు వేల ఏళ్ల పురాతన సంస్కృతి నేర్పిన జ్ఞానాన్ని ఆచరణలో పెట్టాల్సిన సమయం ఇది. అలా చేయని పక్షంలో గల్వాన్ లోయ తరహా ఘర్షణలు మరింత తీవ్రరూపం దాల్చడం తప్పదు! సుధీంద్ర కులకర్ణి వ్యాసకర్త ఫోరమ్ ఫర్ ఎ న్యూ ఆసియా వ్యవస్థాపకులు (‘ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
బాబు బ్రాండ్ రాజకీయాలు
మనం మంచి చేయలేనప్పుడు, ఎదుటివారు చేస్తున్న మంచిని నిరాకరిస్తే? మనకు సమర్థత లేనప్పుడు, ఎదుటివారు అసమర్థులని విరుచుకుపడితే? ఇవీ ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ అనుసరిస్తున్న రాజకీయ వ్యూహాలు. నాటుసారా మరణాలంటూ ‘జంగారెడ్డిగూడెం యాగీ’ని సృష్టించింది... అసెంబ్లీలో ప్రభుత్వ పరంగా వచ్చే పాజిటివ్ సమాధానాలను అడ్డుకోవడం కోసమే అన్నది అర్థం చేసుకోవడం కష్టం కాదు. తద్వారా వైసీపీ ప్రభుత్వం మీద ప్రజల్లో ఏర్పడే సానుకూలతను అడ్డే యత్నం అది. ఇందులో సహజంగానే టీడీపీ మీడియా భాగం అవుతుంది. గతంలో సారా నిషేధం అమలులోనూ, అనంతరం దాన్ని ఎత్తివేయడంలోనూ, తిరిగి ఇప్పుడూ టీడీపీ, దాని అనుకూల మీడియా ఆడుతున్నవి కపట నాటకాలే! ఒక పత్రికలో నాటుసారా వల్ల జంగారెడ్డి గూడెం వద్ద పలువురు మరణించారని వార్త వచ్చింది. చంద్రబాబు నాయుడు వెంటనే జంగారెడ్డిగూడెం వెళ్లి పోయారు. ఆయన ఎటూ అసెంబ్లీకి రావడం లేదు. కానీ టీడీపీ ఎమ్మెల్యేలను సభకు పంపించి రచ్చ చేయిస్తున్నారు. నిజంగానే నాటు సారా వల్ల ఎవరైనా మరణిస్తే విచారించవలసిందే. దానిని అడ్డం పెట్టుకుని ఏదో రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నించడం మాత్రం విచారకరం. సారా వల్ల అందరూ చనిపోలేదనీ, సహజ మరణాలనీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని తాను స్వయంగా బాధిత కుటుంబాలతోనూ, ప్రభుత్వ వైద్యులతోనూ మాట్లాడానని శాసనసభలో వివరించారు. అయినా తెలుగుదేశం ఎమ్మెల్యేలు శాంతించలేదు. ప్రతి రోజూ ప్రభుత్వ పరంగా వచ్చే పాజిటివ్ సమాధానాలను రానివ్వకుండా చేయడం కోసమే ఇలా వ్యవహరించేవారని అర్థం చేసుకోవడం కష్టం కాదు. ఉదాహరణకు ఒక రోజు రాష్ట్రంలో ముప్పై లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం, ఇళ్లు నిర్మించడంపై చర్చ జరగవలసి ఉంది. దానిపై ముఖ్య మంత్రి జగన్ సహజంగానే తన భావాలను పంచుకుంటారు. తెలుగు దేశం నేతలు ఈ స్కీమ్‌కు కోర్టుల ద్వారా ఎలా అడ్డుపడిందీ వివరి స్తారు. దీనికి ఇష్టపడని టీడీపీ ఈ లొల్లిని సాకుగా వాడుకుంది. సారా మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనని చంద్ర బాబు ఆరోపించారు. నిజంగానే ఇలాంటి మరణాలపై టీడీపీ నాయకత్వానికి సాను భూతి ఉందా అనుకుంటే అదేమీ కనిపించదు. గోదావరి పుష్కరాలలో చంద్రబాబు, ఆయన కుటుంబం పుణ్యస్నానం చేసే సన్నివేశాలను డాక్యుమెంటరీగా చిత్రీకరించడం కోసం సామాన్య భక్తులను అంద రినీ గేటు వద్దే నిలిపివేశారు. వేల సంఖ్యలో జనం గుమికూడటం, ఒక్కసారిగా గేటు తీయడంతో తొక్కిసలాట జరిగి ఇరవై తొమ్మిది మంది నిమిషాలలో మరణించారు. కానీ ఆ కేసులో కనీసం ఒక్క కానిస్టేబుల్ కూడా సస్పెండ్ కాలేదు. చంద్రబాబు కూడా బాధ్యత తీసుకోలేదు. పైగా ఆ ఘటనకు సంబంధించి ఏ విధంగా జవాబు ఇచ్చారో చూస్తే విస్తుపోవాల్సిందే. కుంభమేళాలో చనిపోవడం లేదా? జగన్నాథ ఊరేగింపులో మరణించలేదా? రోడ్డు ప్రమాదాలలో మృతి చెందలేదా అని వ్యాఖ్యానించి పుష్కరాల తొక్కిసలాటను చిన్న సమస్యగా తేల్చేశారు. తన ప్రచార యావ కోసం తొక్కిసలాట జరిగిందన్న సంగతిని పక్కనపెట్టి రోడ్డు ప్రమాదాలతో పోల్చారు. కానీ ఈ మూడేళ్లలో ఎక్కడ ఏ ఘటనలో ఎవరు మరణించినా, తెలుగుదేశ వర్గం మీడియా దానిని వివాదం చేస్తోంది. వెంటనే చంద్ర బాబు లేదా ఆయన కుమారుడు అక్కడకు వెళతారు. తమ తండ్రి చనిపోయిన బాధ కన్నా కొంతమంది దీనిని రాజకీయం చేసి సారా వల్ల చనిపోయారని చెప్పడం మరింత బాధగా ఉందనీ, ఇది అవమానకరమనీ అతడి కుమారుడు, కుమార్తె వాపోయినా వీరికి పట్టదు. అసలు సారా అలవాటే లేని వ్యక్తికి కూడా దీనిని అంటగట్టి అవమానించడానికి ఈ రాజకీయ పార్టీలు వెనుకాడటం లేదు. ఇలాంటి ఘటనలు జరగాలని ఏ ప్రభుత్వమూ కోరుకోదు. దీనికి ఏకంగా ముఖ్యమంత్రో, మంత్రో రాజీనామా చేయవలసి వస్తే, టీడీపీ హయాంలో జరిగిన వాటికి ఆనాటి ముఖ్యమంత్రి, మంత్రులు ఎన్ని సార్లు రాజీనామా చేసి ఉండాలి! తిరుపతి అడవులలో ఇరవై మంది ఎర్రచందనం కూలీలను ఎన్కౌంటర్ చేసినప్పుడు ఎవరు రాజీనామా చేయాలి? ఒక మహిళా అధికారిని జుట్టుపట్టి కిందపడేసినప్పుడు ఎవరు రాజీనామా చేయాలి? చిత్తూరు జిల్లా ఏర్పేడు వద్ద అక్రమ ఇసుక వ్యవహారంలో లారీతో ఢీకొట్టి సుమారు పదిమందిని దుండ గులు చంపినప్పుడు ఎవరు పదవుల నుంచి వైదొలగాలి? ఇలాంటి ఘటనలు కోకొల్లలుగా టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగాయి. ఇక్కడ ఒక విశేషాన్ని గుర్తు చేసుకోవాలి. సారా నిషేధం కావాలని నెల్లూరు జిల్లాలో దూబగుంట రోశమ్మ నేతృత్వంలో ఒక ఉద్యమం జరిగింది. అది ఇతర ప్రాంతాలకు కూడా పాకింది. ఒక ప్రధాన పత్రిక ఆ అంశాన్ని తన భుజాన ఎత్తుకుని ఒక పేజీ కేటాయించి వార్తలు ఇచ్చేది. ఆనాటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డి సారాను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయినా ఆ పత్రిక శాంతించలేదు. మొత్తం మద్య నిషేధం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పేజీలకు పేజీలు వార్తలు ఇస్తూ రాష్ట్రం అంతటా అల్లకల్లోలం అవుతున్నట్లు భ్రమలు కల్పించేది. ఎన్.టి.రామారావు కూడా మద్య నిషేధాన్ని ఎన్నికల అంశంగా తీసుకుని ప్రచారం చేశారు. తాను సీఎం అవ్వగానే మద్య నిషేధం అమలు చేశారు. కానీ చంద్రబాబు వ్యూహాత్మకంగా ఎత్తివేశారు. అప్పుడు ఆ పత్రికవారు నామ్ కే వాస్తే ఒక సంపాద కీయం రాసి వదిలేశారు. ఆ పత్రిక తన వ్యాపార, రాజకీయ కారణాల తోనే అలా వ్యవహరించిందని అప్పట్లో అంతా అనుకునేవారు. ఎన్.టి.ఆర్. మద్య నిషేధం సమయంలో కొన్ని డిస్టిలరీలు, బ్రూవరీల ఏర్పాటుకు అనుమతి ఇచ్చారు. ఆ తర్వాత ఆయన లండన్ టూర్ వెళ్లారు. ఆ తరుణంలో చంద్రబాబు టీమ్ ఈ ఉత్తర్వులతో ఏపీ అంతా అలజడి ఏర్పడినట్లు ప్రచారం చేసింది. చివరికి లండన్‌లో ఉన్న ఎన్.టి.ఆర్.తో మాట్లాడి వాటిని కాన్సిల్ చేయించినట్లు చెప్పేవారు. ఆ తర్వాత కాలంలో చంద్రబాబే పలు డిస్టిలరీలకు, బ్రూవరీలకు ఆమోదం తెలిపారు. ప్రస్తుతం కూడా ప్రభుత్వంపై దాడి చేసే ప్రక్రియలో భాగంగా ఏపీలో ముఖ్యమైన బ్రాండ్ల మద్యం దొరకడం లేదనీ, జె బ్రాండ్ మద్యమే లభిస్తోందంటూ చంద్రబాబు ప్రచారం చేశారు. తీరా చూస్తే జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఒక్క డిస్టిలరీకి అనుమతి ఇవ్వలేదట. ఇప్పుడు చంద్రబాబు చెబుతున్న ప్రెసిడెంట్ మెడల్, గవర్నర్... ఇలా రకరకాల పేర్లతో ఉన్న మద్యం బ్రాండ్లన్నీ ఆయన టైమ్‌లోనే వచ్చినవట. నిజం వెలుగులోకి వచ్చే లోపు అబద్ధం లోకం చుట్టి వచ్చిందట. తెలుగుదేశం వారు తాము చేసిన తప్పులను ఎదుటివారిపై మోపి ప్రచారం చేయడంలో దిట్టలని ఈ ఉదంతం రుజువు చేస్తోంది. 2014లో టీడీపీ తిరిగి ఎన్నికైన తర్వాత బెల్టు షాపులను రద్దు చేస్తామని చంద్రబాబు ప్రకటించినా, దానిని ఆయన విస్మరించిన ఫలితంగా నలభై ఐదువేల బెల్టు షాపులు అవతరించాయి. ఇక పర్మిట్ రూమ్‌ల పేరుతో ఎంత చెడ్డపేరు తెచ్చుకుందీ అందరికీ తెలుసు. మద్యాన్ని టీడీపీ నేతలు తమ ఆదాయ వనరుగా మార్చుకున్నారు. కానీ జగన్ సీఎం అయ్యాక బెల్టు షాపులు దాదాపు లేకుండా చేశారు. ప్రైవేటు షాపులను ఎత్తివేసి ప్రభుత్వపరం చేశారు. ఇది ప్రజలలోకి బాగానే వెళ్లింది. దీనిని చెడగొట్టడం కోసం తంటాలు పడటంలో భాగంగానే జంగారెడ్డి గూడెం యాగీని టీడీపీ సృష్టించింది. వీరు ఆ ఊరు వెళ్లేవరకూ అక్కడ అంతా ప్రశాంతంగానే ఉండటం గమనార్హం. ఇంకో సంగతి కూడా గుర్తు చేసుకోవాలి. ఒక నాయకుడు గతంలో చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా ఉండేవారు. ఆయన పాతికేళ్ల క్రితం సారా వ్యాపారం చేసేవారు. ఆ సందర్భంలో ఏదో ఘటన జరిగి అసెంబ్లీలో పెద్ద వివాదం అయింది. అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వంలోని ఒక మంత్రికి ఆయన సన్నిహితుడని చంద్రబాబు ఆరోపించారు. దానిపై ఆ మంత్రి మండిపడ్డారు. సీన్ కట్ చేస్తే ఆ వ్యాపార నాయకుడు తెలుగుదేశంలో చేరి అత్యంత ముఖ్యమైన నేతగా ఎదిగారు. చంద్రబాబుకు సన్నిహితుడుగా చక్రం తిప్పారు. తదుపరి టీడీపీ అధికారం కోల్పోయాక పార్టీ వీడారు. చంద్రబాబు రాజకీయాలు ఇలా ఉంటాయనడానికి ఇది ఒక ఉదాహరణ. సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర సంపాదించడం చంద్రబాబు అదృష్టం. ఏపీలో అత్యంత ఎక్కువకాలం ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా పదవులలో ఉండటం కూడా గొప్ప విషయమే. కానీ ఆయన ఆ గొప్పతనం నిలబడేలా వ్యవహరించకుండా, చిన్నబుద్ధులతో ప్రతి దానికీ రాజకీయం పులిమి వైసీపీ ప్రభుత్వాన్ని బదనాం చేయబోయి తాను అప్రతిష్టపాలు కావడం ఒక విషాదం. వ్యాసకర్త కొమ్మినేని శ్రీనివాసరావు సీనియర్ పాత్రికేయులు -
చట్ట సభల్లో హాజరీ బాగోతం
విశ్లేషణ అత్యంత కీలకమైన అంశంపై చర్చ జరుగుతున్నప్పుడు కూడా పార్టీలతో పనిలేకుండా మహారాష్ట్ర అసెంబ్లీలోని 288 మంది సభ్యులలో హాజరైనవారు అక్కడక్కడ మాత్రమే కనిపిస్తుంటారు. ఎంత అనివార్యమైనా కావచ్చు... శాసన సంబం ధ వ్యవహారాలను అడ్డగిం చడానికి పార్లమెంట్ కార్య క్రమాలను విచ్ఛిన్నపర్చ డంలో భారతీయ జనతా పార్టీ గతంలో అనుసరిం చిన మార్గాలను అధిగ మించడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. యూపీఏ 2కి నేతృత్వం వహిస్తున్న కాలంలో కాంగ్రెస్ చెప్పినదాన్నే ఇప్పుడు పాలక బీజేపీ మరింత గట్టిగా ప్రతిధ్వనించడం అనేది వినో దానికి తక్కువ, ప్రజాగ్రహానికి ఎక్కువలాగా తయా రైంది. ఇదెలా ఉందంటే రెండు ప్రధాన పార్టీలు సంవత్సరాలుగా, తమ పార్లమెంటరీ విధులను నెరవేర్చకుండానే ఎన్నికకావటం అనే వినూత్న కళను సంవత్సరాలుగా మెరుగుపరుస్తూ వస్తున్న ట్లుంది. రాష్ట్రాల శాసనసభలతోపాటు దేశ చట్టసభ ల్లోని సభ్యులు చర్చ, వాదన, అసమ్మతి తెలుపడం, ఓటింగ్‌లో పాల్గొనడం, తదుపరి కార్యక్రమాలను చేపట్టడం వంటి విషయాల్లో అసాధారణ ప్రవర్త నతో వ్యవహరించడానికి సంబంధించి ఒక్కటంటే ఒక్క ఘటనను కూడా ప్రదర్శించలేదనే చెప్పాలి. రాజ్యాంగం నిర్దేశించిన పద్ధతిలో ప్రభుత్వాన్ని పడ గొట్టడం చేతకానప్పుడు వేరేమార్గంగా చట్టవిరుద్ధ నడవడికను చేపడుతున్నట్లుగా ఉంది. దీంతో సభా వ్యవహారాలను నడిపే ప్రిసైడింగ్ అధికారులు.. కల హిస్తున్న పార్టీలలో వివేచనను, నిగ్రహాన్ని నెలకొల్ప లేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్ర శాసనసభ ప్రస్తు తం పూర్తిగా ఒక కొత్త కొలమానాన్ని ప్రతిపాదిస్తోం ది. బహుశా దేశ చరిత్రలోనే ఎవరూ ఇంతవరకూ దీన్ని విని ఉండకపోవచ్చు. శాసనసభలో తన సభ్యు ల హాజరీని రోజుకు మూడుసార్లు పరిశీలించి సభ జరుగుతున్నప్పుడు గైర్హాజర్ అయిన సభ్యుల గురించిన నివేదికను పార్టీ కేంద్ర, రాష్ట్ర అధ్యక్షులకు నివేదించే ప్రక్రియను బీజేపీ ప్రారంభించింది. సభ్యులు తమ వ్యవహార శైలిని మెరుగుపర్చుకు నేలా చేయడమే దీని లక్ష్యం. మహారాష్ట్ర అసెంబ్లీలో అన్ని పార్టీలకు సంబంధించిన సభ్యులలో సగం మందిపైగా తొలిసారి ఎన్నికైన వారే. వీరికి ప్రారంభ కోర్సును నిర్వహించారు. సభా సెషన్లలో కార్యక్రమాలు ఎలా జరుగుతాయో విశదీక రించారు. క్రమం తప్పకుండా సభకు హాజరు కావా లని, ప్రశ్నలు, అనుబంధ ప్రశ్నలు, కాల్ అటెన్షన్ తీర్మానాలు, ప్రైవేట్ సభ్యుల బిల్లు వగైరా వివిధ ఉపకరణాలను ఉపయోగించడంలో కొంత అనుభ వం ఉన్న సీనియర్ సభ్యులు వ్యవహరిస్తున్న తీరు ను పరిశీలించాలని తొలిసారి సభకు వచ్చిన ఎమ్మె ల్యేలకు బోధించారు. దురదృష్టవశాత్తూ ఈ సల హాలు, బోధనలన్నీ తామరాకుపై నీటి చందంలా నీరుగారిపోయాయి. దీన్ని ఎవరో ఒక నేత గుర్తిం చారు. వెంటనే పార్టీ విప్ అమలులోకి వచ్చింది. ఇది బహుశా మరొక అప్రకటిత కారణం కావచ్చు. ప్రభుత్వంలో భాగమైనప్పటికీ బీజేపీకి సం బంధించినంతవరకూ శివసేన ఒక నమ్మలేని పార్టీ గానే ఉంది. బీజేపీతో సభలోనూ, సభ వెలుపల కూడా అది చావగొట్టి మళ్లీ చల్లబర్చే రకం సంబం ధాన్ని కొనసాగిస్తోంది. తనకంటే స్థాయిలో చిన్న దైనప్పటికీ, దూకుడుగా ఉన్న పార్టీకి తలొగ్గాల్సిరావ డం జాతీయ పార్టీకి పెద్ద చిక్కుగా మారింది. ఉన్న ట్లుండి చీలిక ఏర్పడినట్లయితే శివసేనను నమ్ముకో వచ్చా అనే అంశంలో బీజేపీకి హామీ లభించడం లేదు. ఇది తీవ్రమైన పరిణామాలను కొని తెస్తుంది. శివసేన ఎమ్మెల్యేలు పార్టీ గుర్తింపుతో నిమిత్తం లేకుండా క్రమం తప్పకుండా సభకు.. ప్రత్యేకించి అసెంబ్లీకి హాజరుకావటంలో, రిజిస్టర్లో సంతకం పెట్టడంలో, కొద్ది క్షణాలు లేదా నిమిషాలు సభలో గడిపి తర్వాత ఇతర కార్యక్రమాలకు వెళ్లిపోవడంలో అసాధారణ ఉదాహరణలుగా నిలుస్తుంటారు. ఇది అందరి విషయంలో సాధ్యమయ్యేది కాదు. నియో జకవర్గానికి సంబంధించిన పనిగా లాబీ చేసే ధోరణి కనబడుతుంది కాని ఇది అంతకంటే ఎక్కు వే. ఎమ్మెల్యే అందుబాటులో ఉన్నప్పుడు ఎమ్మెల్యే హాస్టల్స్‌లో కానీ, వెలుపల కానీ స్వప్రయోజనాలు ఆశించి వచ్చిన వారందరూ చుట్టూ ఉంటారని ఎవ రైనా బెట్ కట్టొచ్చు. ప్రశ్నోత్తరాల సమయం తర్వాత శాసన సభ్యు ల హాజరు పలుచబడిపోవడం ఎక్కువగా లేదా తక్కువగా ఒక రివాజులా మారిపోయింది. తమ శాఖకు సంబంధించిన వ్యవహారాలు పూర్తికాగానే మంత్రులు సైతం సభనుంచి వెళ్లిపోతుంటారు. ముఖ్యమైన వ్యవహారంపై ఉదాహరణకు అత్యంత కీలకమైన అంశంపై చర్చ జరుగుతున్నప్పుడు కూడా పార్టీలతో పనిలేకుండా మహారాష్ట్ర అసెంబ్లీలోని 288 మంది సభ్యులలో హాజరైనవారు అక్కడక్కడ మాత్రమే కనిపిస్తుంటారు. ఒక చర్చా విభాగంలో వారి ఓటుకు అంత విలువలేదని వీరి నమ్మకం కావ చ్చు. ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్‌ను ఎన్నుకునేటప్పుడు లేదా వాయిదా తీర్మానాన్ని లేక అవిశ్వాస తీర్మా నాన్ని ప్రతిపాదించేటప్పుడు మాత్రమే తాము హాజ రు కావలసి ఉంటుందని వారు భావిస్తుండవచ్చు. బడ్జెట్ సమర్పణ, గవర్నర్ ప్రసంగం సమ యంలో మాత్రమే అసెంబ్లీ హాలు నిండిపోతుంది. కొన్ని సమయాల్లో కోరంకు సంబంధించిన సమ స్యపై విధివిధానాలు సవాలు చేయకుండా ఆ రోజు ను ఎలాగోలా నిర్వహిస్తే ఆ ప్రిసైడింగ్ అధికారి చాలా అదృష్టవంతుడే అని చెప్పాలి. పేదలకు అంటే ఉపాధి హామీ పథకం వంటి అంశాలపై చర్చ జరు గుతున్నప్పుడు కోరంకు సరిపడ సభ్యులు మాత్రమే ఉండే సందర్భాలు కూడా ఉండటం నాకు గుర్తుంది. శాసన సభ్యులు కేవలం తమ తమ సొంత ప్రయోజ నాలను మాత్రమే కలిగి ఉన్నారా అని నాకు ఆశ్చ ర్యం వేసేది. బీజేపీ మాత్రమే తన పార్టీ లెజిస్లేచర్ల హాజరీని పరిశీలించడం లేదు. కాంగ్రెస్ కూడా ఈ పనిచే స్తోంది. ఎందుకంటే కేవలం 42 మంది ఎమ్మెల్యే లను మాత్రమే కలిగి ఉన్న ఈ పార్టీ సభ్యుల హాజరీ పేలవంగా ఉంటే సభలో అది మరీ పలుచనగా కని పిస్తుంది. ఒక సభ్యుడిని తక్కువగా కలిగిన నేషనల్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ కంటే దూకుడును కలిగి ఉండవలసిన అవసరం ఉంది. దీంతో ఎన్సీపీ తన సభ్యులు క్రమం తప్పకుండా పూర్తిగా శాసనసభకు హాజరయ్యేలా చూసుకోవలసి వస్తోంది. మహారాష్ట్ర అసెంబ్లీలో సంఖ్యాపరంగా మూడో, నాలుగో స్థానంలో ఉన్న కాంగ్రెస్, ఎన్సీపీలు కౌన్సిల్ హాల్ వెలుపలి మెట్లమీద నిరసన తెలుపడానికైనా తగి నంత మంది సభ్యులను కలిగి ఉండాలి. మరి అక్కడ ఫొటోగ్రాఫర్లు కూడా ఉంటారాయె. మహేశ్ విజాపుర్కార్ (వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు) ఈమెయిల్: mvijapurkar@gmail.com.